Saturday, October 27, 2012

అర్జునుడు - X

    అర్జున్ కళ్ళు తెరిచి చూసాడు. నిద్ర నించి అప్పుడే లేచిన తనకి, పక్కనే పడుకున్న శైలజ కనిపించింది. తన కళ్ళల్లో నీళ్ళని తనకి తెలియకుండానే తుడుచుకున్నాడు అర్జున్. అర్జునా! కేక మళ్ళీ వినిపించింది. సందేహం లేదు, రాజ గురువుది, ఆ కేక. ఈ లోపులో ఒక బాణం రివ్వున ఎగసి, తన వెనుక  ఉన్న గోడకి గుచ్చుకుంది. శైలజ దిగ్గున లేచింది.

    కత్తి, డాలు తో, యోధుని get-up  లో బయటికి వచ్చాడు అర్జున్. కోట గోడల దగ్గర, ద్వారం వద్ద ఉన్న సైనికులు బాణాల కి మరణించారు. ఎదురుగా చెక్క మరియు రాతి weapons  తో ఉన్నారు, ఫిలిప్పీన్స్ సైనికులు. పున్నమి చంద్రుని వెలుగులో, ఎత్తైన ఆ కోట నించి  బాణాలని తప్పిస్తూ, కిందకి దిగుతూ వస్తున్నాడు అర్జున్.

    వస్తూనే, తన కత్తి వేటుకి ఇద్దరిని చంపాడు అర్జున్. ఇంకా సైనికులు చాల మంది ఉన్నారు. 

Saturday, October 13, 2012

Telugu To English Translation (అనగా అనువాదము)

    మన వాళ్ళు ఇంగ్లీషు లో మాట్లాడే కొన్ని వాక్యాలకి తీరు తెన్నూ ఉండదు. అలాంటి "మక్కి కి మక్కీ" అనువాదాల గురించే, ఈ పోస్ట్.

1. That much is not there. (అంత లేదు)
2. Write oil on your head. (నీ తల మీద నూనె రాయి).
3. Your head! (నీ తలకాయి)
4. Your face (u)! (నీ మొహం) 
5. What (a)maa? (ఏంటమ్మ?)
6. Cry your own cry (నీ ఏడుపు నువ్వు ఏడు)
7. First First లో (మొట్ట మొదట్లో)
8. You are very white! (నువ్వు చాల తెల్లగా ఉన్నావు, should use 'fair' instead of 'white' here)

డాన్ (కీ) జోక్స్కష్టమే కాదు .... 

ఒక సారి డాన్, ఒక పేరు మోసిన జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. తన ఫ్యూచరు చెప్పమని బలవంతం చెయ్యడం తో, ఆయన డాను తో కూర్చున్నాడు. ఆయన డాను ముఖం చూసాడు, కుడి చెయ్యి చూసాడు, తనకి తెలిసినదంతా యూస్ చేసాడు. కాని డాను ఫ్యూచరు మాత్రం అంతుపట్ట లేదు. అప్పుడు అర్ధమైంది ఆయనకి, "డాన్ ఫ్యూచరు చెప్పడం కష్టమే కాదు, అసాధ్యం" అని.

ఒక సారి డబ్బు అవసరం అయ్యి, డాను కూర్మారావు దగ్గర పది వేలు అప్పు తీసుకున్నాడు. నెల తిరిగాక, కూర్మానికి ఏదో అవసరం అయ్యి, డాను ఇంటికి ఫోను చేసాడు. ఇంట్లో లేడట, ఆఫీసులో ఫోను చేసాడు, లేడన్నారు. ఇలా పాపం ఆరు నెలలు గడిచింది. చివరికి ఏదో పని మీద అటుగా వెళ్తుంటే, డాన్ ఇంట్లో ఉండటం చూసాడు. వెంటనే డాన్ ఇంట్లోకి వెళ్తే, డాను నేల మీద శవమై పడి ఉన్నాడు. అప్పుడు అర్ధమైంది కూర్మానికి "డాన్ చావనైనా చస్తాడు కాని, డబ్బులు మాత్రం వెనక్కి ఇవ్వడని".

ఒక సారి, డాన్ వాళ్ళ ఆవిడకి, కళ్ళ ప్రోబ్లం ఏదో వస్తే, డాక్టరు దగ్గరికి వెళ్లారు. పనిలో పనిగా మీరు కూడా చెక్ అప్ చేయించుకోమ్మంది ఆవిడ. తప్పక ఒప్పుకున్నాడు డాను. ఆవిడ చకింగు అయ్యాక, డాక్టరు డాన్ ని కూర్చోబెట్టాడు. ముందు ఏవో పెద్ద అద్దాలు పెట్టి, చదవమన్నాడు. డాన్ అన్నీ గడగడా చదివేశాడు. Prescription రాస్తూ డాక్టరు ఏదో డవుటు పడ్డాడు. రెండు కళ్ళకీ అంత తేడా ఉండదని చెప్పి, మళ్ళీ ఒక కంట్లో అద్దం మార్చాడు. డాన్ మళ్ళీ అన్నీ గడగడా చదివేశాడు. డాక్టరు డవుటు వచ్చి మళ్ళీ మార్చాడు, ఇలా మారుస్తూనే ఉన్నాడు. అన్నీ డాను గడగడా చదివేశాడు. అప్పుడు అర్ధమైంది డాక్టరు కి "డాన్ కళ్ళ సైటు చెక్ చెయ్యడం, కష్టమే కాదు, అసాధ్యం కూడా అని".

డాన్ వాళ్ళ స్కూల్లో రంజని అని ఒక అమ్మాయి ఉండేది. డాన్ అంటే, ఎందుకో తనకి కొంచెం ఇష్టం ఉండేది. ఒక సారి, డాన్ కి "ఫ్రెండ్ షిప్ చేస్తే చాక్లెట్ ఇస్తా"నంది, డాను ఒప్పుకున్నాడు. చాకలేట్టు తీసుకుని, రెండు రోజుల్లో మొహం చాటేశాడు. తరవాత మళ్ళీ ఇంకో సారి, నాతో ఫ్రెండ్ షిప్పు చేస్తే పరీక్షల్లో చూపిస్తానంది. డాన్ ఒప్పుకున్నాడు, తీరా పరీక్షల్లో (చూసి కాపీ కొట్టినా కూడా) తనకే ఎక్కువ మార్కులు రావడంతో, మళ్ళీ మాట్లాడ లేదు డాన్.

ఇంకో సారి, నాతొ ఫ్రెండ్ షిప్ చేస్తాడేమో అని, ఊరికే వాడి రికార్డ్లు రాయడానికి ఒప్పుకుంది తను. ఇప్పుడూ పని జరగలేదు, అప్పుడు అర్ధమైంది తనకి, "డాన్ తో ఫ్రెండ్షిప్ చెయ్యడం కష్టమే కాదు, అసాధ్య౦ కూడా అని".

చిన్నప్పుడు డాన్ వాళ్ళ నాన్న, రోజూ సైకిలు ఎందుకు తుడవడం లేదని, డాన్ కి ఒక రోజు బడిత పూజ చేసాడు. అప్పటి నించీ డాన్, regular గా సైకిలు తుడవటం మొదలెట్టాడు, డాన్ తండ్రి కూడా పాపం తన కొడుకు బాగు పడుతున్నాడని, సంతోషించాడు. రోజు సైకిలు తుడిచాక, ఒక గంట సేపు TV చూసేవాడు డాను. ఎప్పుడూ జాకి చాన్, సినిమాలే చూస్తున్నా ఏమీ అనేవాడు కాదు తండ్రి. ఆర్నెల్ల తర్వాత, సడన్ గా ఒక రోజు నించీ సైకిలు తుడవడం మానేసాడు డాను. చాలా రోజులు మానేసే సరికి, డాన్ తండ్రి ఒక రోజు మళ్ళీ అడిగాడు, డాను పెడసరం గా సమాధానం చెప్పడం తో, ఈ సారి కర్ర పట్టుకొచ్చాడు తండ్రి. అయితే డాను అద్వితీయమైన కరాటే నైపుణ్యం చూపించి, తండ్రి ని కొట్టకుండా వదిలేసాడు. అప్పుడు అర్ధమైంది తండ్రికి, "డాన్ ఇంకొకరు చెప్పిన మాట వినడం, కష్టమే కాదు, అసాధ్యం అని".

విలేకరి: అసలీ డాన్ ఎవరో, ఎలా ఉంటాడో, పూర్తిగా చెప్తారా?
పోలీసు ఆఫీసరు: డాన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా!
(సశేషం) 

డాను, వాడి డూపు ఒకే చోట ఉన్నారు. ఇద్దర్లో, ఎవరు నిజమో, ఎవరు నకిలీయో చెప్పడం కష్టం గా ఉంది. ఇద్దరూ, నేను డాను కాదంటే కాదని వాదిస్తున్నారు. చివరికి పోలీసు ఆఫీసరు, ఇద్దర్నీ విడిచి పెట్టేయ్యమంది, ఎందుకో తెలుసా... డాన్ ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కాబట్టి. దొరికిన వాళ్ళు ఇద్దరూ డాన్సు కాదని తేల్చేసింది, పోలీసు ఆఫీసరు రంజని. 

వీర తాళ్ళు


అప్పుడెప్పుడో మాయా బజార్లో, కొత్త పదాల అవసరాన్ని మన S.V. రంగా రావు గారు గుర్తు చెయ్యడం కాదు, నేను అనుకునే కొన్ని కొత్త పదాలని (funny గా) ఒక చోట పొందు పరిస్తే ఎలా ఉంటుందని, ఈ పేజీ మొదలు పెట్టాను. అసమదీయులందరికీ, ఇందులో స్వాగతం. 

1. గజీతగాడు: బాగా జీతం సంపాదిస్తున్న వాడు.
2.  సంపన్నులు: కొంచెం అయినా (ఆదాయపు) పన్ను కడుతున్న వాళ్ళు. 
3. ఆస్తికులు: బాగా ఆస్తి ఉన్న వాళ్ళు.

Tuesday, October 9, 2012

Serial Killers - IV

గురూజీ: కుదరదన్నా నా! (కొంచెం కోపం గా)

తెంబి: యాణ్ (తనూ గట్టిగా)

గురూజీ: (ఏవో లెక్కలు వేస్తూ నోట్లో ఆలోచిస్తూ ఉండి, చెయ్యి అడ్డం గా తిప్పాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు).

తెంబి: (ఏదో ఆలోచించి) ఒణ్ మిణిట్! (తన భుజానికున్న గుడ్డ సంచీ లోంచి, ఇవాల్టి న్యూస్ పేపర్ తీసాడు).

అందులో, ఈ రోజు సుడోకు ఉన్న పేజి తిప్పాడు. మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యడం మొదలు పెట్టాడు.     అయిదు నిమిషాల తర్వాత మొత్తం అంతా అయ్యింది. తర్వాత, ఉన్న తొమ్మిది చదరాల్లోను, మధ్య నంబరు circle  చేసాడు. వాటిల్తో ఏదో జ్యోతిష్యం లాగ గణించడం మొదలు పెట్టాడు. కొంత సేపటికి,

తెంబి: నోర్త్, ఇంద సాటైన్, డిల్లి ఇంద సాటైన్ (Saturn, శని). (Explain చేసాడు). జూపిటేయ్ (Jupiter, గురుడు) ఇంద ... (పెన్ను ఉన్న కుడి చెయ్యి పేపరు నించి పైకి లేపి, కుడి వైపు రెండు సార్లు ఊపాడు, ఈస్ట్ కి  వెళ్లాలన్నట్టు).

గురూజీ, కళ్లార్పి తల ఊపాడు.

ఇది చెప్పి తెంబి, నొసలు చిట్లించాడు, తర్వాత కళ్ళజోడు సవరించి, గురూజీ కళ్ళల్లో చూసిన తన కళ్ళు, కిందకి దించాడు. ఇదంతా చూసిన ముత్యాలకి మాత్రం ఏమి అర్ధం కాలేదు.

- 2 -
మొత్తానికి, హీరో సైకిలు మీద హై-వే మీదుగా హైదరాబాద్ నించి డిల్లీ వెళ్ళడం కాన్సిల్ అయ్యింది. అలా ఉత్తరం వైపు  వెళ్తే శని అట. తూర్పుకి వెళ్ళడం, వాస్తు ప్రకారం భేషని, గురూజీ, అండ్ తెంబి ప్రవచించడం జరిగింది. ఆల్రెడీ హీరోయిన్ను కోసమని డిల్లీ కి సైకిలు మీద వెళ్ళడం, ఒక నెల రోజులు లాగించారు, కాబట్టి, ఇప్పుడు కలకత్తా వెళ్ళడానికి మంచి కారణం కావలసి వచ్చింది. హై-వే మీద diversion పెట్టాలని తెంబి చెప్పిన సలహా అందరికీ నచ్చింది. (హై-వే under repair, ప్లీజ్ టర్న్ రైట్) పెట్టిన బోర్డుని, అక్కడ పెట్టారు. పక్కనే ఉన్న మట్టి రోడ్డు, చెట్ల గుబురు మీదకి మంచి diversion ఇచ్చారు.

జరిగిన ఎపిసోడులు already టీవీ లలోకి వెళ్ళిపోయాయి కాబట్టి, రూటు మార్చి, హీరో కలకత్తా వైపు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాల్సి రావడం జరిగింది.

- 3 -
ఇది జరిగిన తర్వాత, గురూజీ తెంబి అంటే ప్రత్యేకమైన ప్రేమ చూపించడం మొదలెట్టారు. "సుడోకు లో జ్యోతిష్యం" అనే ఒక గొప్ప ప్రక్రియని తనకి పరిచయం చెయ్యడం తో, తన సహోద్యోగి తెలివి తేటలపై, అపారమైన నమ్మకం వచ్చింది గురూజీకి. ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా ఆనంద భాష్పాలు వచ్చేవి గురూజీకి.

- 4 -
ఈ వార్త మొత్తం ఇంట్లో స్టాఫ్ అందరికీ తెలిసిపోయింది. ముత్యాలు, ఇంట్లో అందరికీ, పెద్ద గొంతికతో ఈ స్టోరీ చెప్పడం, అందరూ, (టీవీ unit తో సహా) తెంబి ని అభినందించడం జరిగాయి.

సత్తి రెడ్డి: సుడోకు తో జాతక మెట్ల చెప్తార్ర బై ...?  

నాయక్: ఏమో, నాకేం దెల్సు రా బై! (కొంచెం సేపాగి, హాలంతా చూస్తూనే ...) అసలు సుడోకంటే ఏంద్ర? (అసలు డవుటు చెప్పాడు)

సత్తి రెడ్డి: అయినా, పేపర్ల పక్కనే జాతకం ఉంటె, సుడోకు ఎందుకురా పూర్తి చెయ్యుడు?

నాయక్: (చిన్నగా నవ్వుతూ ...) ఏది జాతకమెక్కడ? చూపియ్?

సత్తి రెడ్డి: ఇదిగోరా భై! (సుడోకు పేజీలోనే ఉన్న జాతకం చూపించాడు).

నాయక్: ఇవాళేమి రాసిండో, చెప్పించుకోవాల. లాయరు బాబు ఉన్నడా ఏంది? 

Saturday, September 29, 2012

అర్జునుడు - IX


   అర్జున్ కి మళ్ళీ ఒక కల వస్తోంది.

    చిమ్మ చీకటి. ఉరుములు, మెరుపుల మధ్య వాన. ఎక్కడా ఏమీ కానరాని ఆ వానలో అప్పుడప్పుడు మెరుపులు మెరిసినప్పుడల్లా ఒక మెరుపులా నేల మీద కనిపిస్తోంది ఒక రధం. ఏడు శ్వేతాశ్వాలు అతి వేగం గా పరిగెడుతున్న ఆ రధం లో ఉన్నది ఒక రాకుమారుడు, వెనుక రధంలో ఉన్నది ఒక నిండు చూలాలు. అయితే ఈ రాకుమారుడు అర్జున్ లాగ లేదు, అర్జున్ కి ఇదంతా తాను బయటినించి చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఆమె సొమ్మసిల్లి పడి ఉంది. శ్వేతాశ్వాలను అతి వేగం గా పరుగు తీయిస్తున్నాడు అతడు. ఆ దారికి అంతం ఎక్కడా అతనికి కనిపించడం లేదు. ద్రష్ట చెప్పింది గుర్తుంది అతనికి, అది ఎంత దుస్సాధ్యమైనా, మానవ ప్రయత్నం చెయ్యక తప్పదు మరి. అతని కళ్ళలోని అశ్రుధారలు, ఆ అఘోరమైన తుఫాను వానలో కలిసిపోయాయి. 

    వాళ్ళు వెళ్ళవలసిన గమ్యం (మన భాషలో చెప్పాలనుకుంటే), 10 మైళ్ళ దూరంలో ఉన్న రామ దేవాలయం. అక్కడికి వెళ్ళడానికి వాళ్లకి ఇంకో ఐదు నిమిషాలు మాత్రమే time ఉంది. గుర్రాలు, ఎంత జాతి అశ్వాలు అయినా, పది మైళ్ళు పరిగెత్తడానికి, పది నిముషాలు తీసుకుంటాయి. దైవ సంకల్పం మాత్రమే వాళ్ళని, ఈ పరిస్థితి నించి బయటకు తీసుకువెళ్ళగలదు. "హే కృష్ణా... ముకుందా... పాహి పాహి..." మనసులో ప్రార్ధించాడు అతడు.

   ద్రష్ట వర్తమానం తెలియగానే అతను చెయ్యగలిగినదంతా చేసాడు. అన్ని గండభేరుండ పక్షులు (Genetically Engineered Animals), స్వయంచోదక విద్యుల్లతాశ్వాలు, మహాశ్వేత వరాహాలు యుద్ధంలోనికి నియోగింపబడటం చేత, సామాన్యమైన అశ్వాలతో కూడిన రధాలు మాత్రమే మిగిలాయి అతనికి. వాటితోనే, రాబోయే ముప్పు గురించి నగరమంతా చాటింపు వేయించాడు. అటువంటి ఒక రధాన్ని సమకూర్చుకుని, ద్రష్ట ఆజ్ఞ మీద, అయిష్టంగా తన నగర ప్రజలని వదలి పయనమయ్యాడు అతడు. అతని సేనాని నగర ప్రజలలో వాళ్ళు వీళ్ళని కాకుండా, వృద్ధులు, బాలలు, మహిళలను తీసుకుని, రధాలతో నగరం అవతలకి పంపిస్తున్నాడు. 

     రధాన్ని తీసుకుని నగరాన్ని దాటుతున్నరాకుమారునికి అనేక హృదయ విదారకమైన దృశ్యాలు పొడగాట్టాయి. అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నగర ప్రజానీకం లో ఒక్క పిట్ట కూడా చావు తప్పించుకోలేదు. ఈ విషయం తెలిసి, ప్రయత్నిస్తున్న తన అమాయక ప్రజలను అతడు చూడలేకపోయాడు. కొందరు తల్లిదండ్రులు, పిల్లలను వదిలిపెట్టి, పరుగులు తీస్తున్నారు. కొందరు యువకులు, వృద్ధులైన తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా, రధాలలో స్థానం కోసం ఎగబడుతున్నారు. కొందరు భార్యలను విడిచిపెడుతున్నారు. ఈ ఘోరకలి రాబోయే చెడు రోజులకి సంకేతం లాగ ఉంది. తాము బతకమనే విషయం తెలిసిందో ఏమో, కొందరు కుటుంబసమేతం గా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు నగర ప్రజలు, గుళ్ళను, గోపురాలను ఆశ్రయిస్తున్నారు. 

     రాకుమారుడు ఆలోచనల నించి బయటపడ్డాడు. మెరుపులు మెరిసినప్పుడల్లా అతనికి లీలగా ఒక ఆలయం ఎదురుగా కనిపిస్తోంది. కొంతసేపటికి, ఉరుములు, వాన శబ్దాల మధ్య, ఈదురు గాలికి కొట్టుకుంటున్న ఆ గుడి గంట కూడా అతనికి వినిపించింది. కాని సమయానికి తాను ఎదురీదుతున్నాడని తెలుసు అతనికి. రామాలయానికి చాల దగ్గరిలో ఉండగా, ఆకాశంలో ఒక భయంకరమైన ధ్వని, వెలుగు కనిపించాయి అతనికి. చిన్నగా విరక్తిపూరితమైన నవ్వు నవ్వాడతను. ఆ వెనువెంటనే నగర ప్రజల హాహాకారాలు వినిపి౦చాయి. వెర్రి వాళ్ళు, ఆకాశం నించి ఏదో పడటం చూసి ఉంటారు. 

    ఇక లాభం లేదని,రాకుమారుడు, సొమ్మసిల్లిన ఆమెని తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఒక్క ఉదుటన ఆ రధం నించి దూకాడు. నేలపై ఆనుతూనే, తన శక్తినంతా ఉపయోగించి మరొక్క మారు గాలిలోనికి లంఘించాడు. ఈ సారి రామాలయం ముందున్న మంటపం లోనికి పడ్డారు ఇద్దరూ. ఇప్పటికే కూలబడిన అతడు, తన చేతుల్లోని స్త్రీని చాల జాగ్రత్తగా మంటపం మధ్యలో పరు౦డబెట్టాడు. ఏదో అనిపించి, తలెత్తి చూసాడు, పైన రామాలయం గంట మోగుతూనే ఉంది. పర్వాలేదు, తన బాధ్యత నిర్వర్తి౦చాననుకున్నాడు. 

      నిజానికి అతనికి ఏమి వినిపించటం లేదిప్పుడు. నేలపై ఆని మళ్లీ దూకినప్పుడు, అతని పాదం చీరుకుపోయింది. ఇప్పుడా పాదం రెండుగా కొంతవరకు చీలి, రక్తం వస్తోంది. ఎదురుగా స్పృహ తప్పిన ఆమెని చూసి, కళ్ళు మూసుకున్నాడతను. కళ్ళు మూసుకున్నాడు అనటం కంటే, స్పృహ కోల్పోయాడని చెప్పవచ్చు. 

    అది జరిగిన ఉత్తరక్షణం, ఒక పెద్ద వెలుగు, అతని వెనుక కనిపించిది. చెవులు చిల్లులు పడేటటువంటి భయంకరమైన శబ్దం చాల సేపు ఆ పరిసరాల్లో వినిపించింది. ఒక ఈదురు గాలి, ఏదో సందేశాన్ని మోసుకువస్తున్నట్టు, ఎవరికోసమో వెతుకుతున్నట్టు చాలా సేపు తచ్చాడింది. ఆ పక్కగా ప్రవహిస్తున్న గంగానది, ఏడ్చిఏడ్చి కనీళ్ళు ఇంకిపోయినట్టు, ఎండిపోయింది. ఆ ప్రదేశాన్ని కమ్ముకున్న మృత్యు మేఘాలు ఆ పై లోకాలకు దారి ఇస్తున్నట్టు విచ్చుకున్నాయి. అంతా ఐపోయింది. మనుషులే కాదు, నగర ప్రధాన కేంద్రం నించి పది మైళ్ళ దూరం లోని అన్ని ప్రాణులూ దేహం చాలించాయి. చెట్లు రక్తం కారుస్తున్నట్టు, రక్తవర్ణం దాల్చాయి. మనుష్య జాతి చరిత్రలో, ఇదివరకెన్నడూ చూడని విలయం మొదటిసారి పలకరించింది. కన్యాకుబ్జం, ఆ నిండు చూలాలి గర్భం లోని పసికందు కోసమని, శతాబ్దాల శాపాన్ని మోయడానికి సిద్ధమైంది. 

    బయటినించి ఇది చూస్తున్నట్టు అనిపిస్తున్న అర్జున్, మొహం తిప్పుకున్నాడు. ఈ సారి, రాకుమారుడు వేషంలో,  దూరం గా ఉన్న అర్జున్ తనకి కనిపించాడు, ఆ రాకుమారుని కళ్ళలో సన్నటి కన్నీటి పొర.

    అర్జునా..., దూరం గా రాజ గురువు  పిలుస్తున్నట్టు అనిపించింది అర్జున్ కి. వెంటనే కళ్ళు తెరిచాడు అర్జున్, అతని కళ్ళల్లోనూ ఒక సన్నటి కన్నీటి పొర.

(సశేషం)


అర్జునుడు - VIII


    తెల్లవార కట్ట, కమాండర్ సుబోలిన్ చెప్పిన ప్రాంతం లో గస్తీ తిరుగుతున్న helicopters కి, ఈ బోటు కనిపించింది. రఘునాథ్ instructions మేరకి, చాలా జాగ్రత్త గా, ఒక ice box లోనికి, గ్లోవ్స్ సహాయంతో, సుబోలిన్ భుజాన్న ఉన్న బాగ్ ని మార్చారు సైనికులు. మళ్ళీ helicopter లోనికి చేరిన సైనికులు, philippines లో భాగమైన ఒక చిన్న దీవి వైపు వెళ్లారు. అది, రఘునాథ్ పరిశోధనలు చేసుకునే దీవి.

    రఘునాథ్ దీవిలో హెలిపాడ్ మీద హెలికాప్టర్ దిగింది. అక్కడ ఒక మిలిటరీ స్టైల్ లో ఒక కోట (fortress) ఉంది. ఎత్తైన కాంక్రీటు గోడలు, పెద్ద స్టీల్ door, దానికి రెండు వైపులా సైనికులు. Ice box తీసుకుని లోపలకి వెళ్ళిన వాళ్లకి, shake hand  ఇచ్చి, box తీసుకున్నాడు రఘునాథ్. ఫిలిప్పీన్స్ పంపించిన సైన్యం మొత్తం తన కళ్ళ ముందుగానే, చనిపోవడం అతనికి ఇంకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఏ ఫీలింగ్ లేకుండా ఆ box తీసుకున్నాడు రఘునాథ్.

    ఈ మట్టిలో ఏముందో, ఏమిటో తెలుసుకోవడానికి ఇంక చివరలో fight జరుగుతూ ఉండగా, కమాండర్ కి మట్టి, ఇసుక, మొక్కలు, నీళ్ళు, వీలయితే కొన్ని జంతువులూ, ఆ దీవి లోనివి వీలైనన్ని తీసుకురమ్మని (samples) చెప్పాడు రఘునాథ్. అలా తీసుకు వచ్చినవే ఈ box లో ఉన్నాయి. ఇక వీటి మీద ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టాలి రఘునాథ్.

-- 2 --

    ఈ సంఘటన జరిగి పదిహేను రోజులు కావస్తోంది. ఆ రోజు philippines  అధ్యక్షుడి తో, మిలిటరీ జనరల్స్, ఇంకా రఘునాథ్ అందరూ మీట్ అవుతున్నారు. ఈ attack గురించే ప్రస్తావన వస్తుందని, అందరూ reports రెడీ చేసుకున్నారు. రఘునాథ్ ఆ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు.

రఘునాథ్: Gentlemen, we might have lost the battle, but not the war! In fact, మనం ప్రపంచం లోనే పెద్ద యుద్ధాన్ని గెలవబోతున్నాం. ఈ దీవి లో attack చేసి, మన సైనికులు మరణించడం వాస్తవమే. అయితే, నా పరిశోధనల ప్రకారం ...

ఇంకా ఏదో చెప్పబోతున్న రఘునాథ్ కి అడ్డం వస్తూ,

సోన్వక్: (ఒక కుర్ర మిలిటరీ ఆఫీసర్, ఫిలిప్పీన్స్ కి చెందిన వాడు) మిస్టర్ రఘునాథ్, ముందు అది ఎలా జరిగిందో చెప్తారా? ఎందుకంటే, మీరు scientist  గా చేసే పరిశోధనలకి ఇది అనువైన సమయం కాదేమో (కొంచెం వెటకారం గా అన్నాడు).

అది విన్న రఘునాథ్, మొహం కోపం తో జేవురించింది, ఏమి చెప్పాలో తెలియక ఉన్న రఘునాథ్ పరిస్తితి చూసి,

అధ్యక్షుడు: మిస్టర్ సోన్వక్, మీ వంతు రాక ముందు మాట్లాడటం మంచిది కాదు, పైగా, మన దేశానికి ఎంతో సేవ చేసిన రఘునాథ్ అవసరమే మనకి ఉంది (కోపం గా ఎటో (సోన్వక్ వైపుగా) చూస్తూ, తల ఊపుతూ అంటున్నాడు).

సోన్వక్ silence అయ్యాడు. రఘునాథ్ కంటిన్యూ చేసాడు.

రఘునాథ్: Gentlemen, lets come to the point. ఆ దీవిలో బంగారం, వజ్రాలు metals/valuables ఉన్నాయని మనం attack చేసాం, అయితే ఇంకా గొప్పది, వెలకట్టలేనిది ఆ దీవిలో ఉంది. (స్క్రీన్ మీద ఆ దీవి తాలూకు ఏరియల్ వ్యూ వస్తోంది). It has antidote for every modern weapon, everything! Even the nu...

చెప్తూ ఆపు చేసాడు, Slides change చేసాడు.

రఘునాథ్: For my younger colleagues, (సోన్వక్ కేసి ఒక సారి చూసి, project అయ్యిన slide కేసి చూపిస్తూ), ఇది 1945 లో హిరోషిమ లో జరిగిన అణు బాంబు విస్ఫోటనం. ఈ విస్ఫోటనం ఒక పెద్ద నగరాన్ని బలికొంది. అంత వరకూ, ప్రపంచం లో ఎవరికీ కూడా, ఒక నగరాన్ని, అందులో ఉండే లక్షలాది ప్రజలని, చంపే ఆయుధం లేదు. అణుబాంబు మాత్రమే అంత విధ్వంసం సృస్టించగలదు.

రఘునాథ్: అణుబాంబు పేలినపుడు, మొదట, అతి ఎక్కువ శక్తి తో ఉన్న కణాలు వేగం గా బయటికి వస్తాయి (Slide change అయ్యింది). ఆ కణాలు, వేగంగా వెళ్తూ, తమ దారిలో ఉన్న అన్నిటినీ  గుద్దుకుంటూ మెల్లగా స్లో అవుతాయి. రెండు కార్లు గుద్దుకుంటే, వేడి ఎలా పుడుతుందో అలాగే, ఇవి గుద్దుకున్న ప్రతి వస్తువూ, చాలా వేడెక్కి పోతుంది, ఇంచు మించు గా, అణుబాంబు పడిన సెకన్లలో, ఆ చుట్టూ ఉన్న ప్రదేశం అంతా ఆవిరయి పోతుంది. (Slide change). Imagine, వంద కిలోమీటర్ల వేగం తో వెళ్ళే కారు ఏ గోడనో గుద్దుకుంటేనే, చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అదే గంటకి కొన్ని కోట్ల కిలోమీటర్ల వేగం తో వెళ్ళే కార్లు, ఒకటి కాదు, కొన్ని కోట్లు, ఎక్కడ పడితే అక్కడ, గుద్దుకుంటే, ఎంత ప్రమాదం జరుగుతుందో. That is the destructive ability of an Atom bomb.

రఘునాథ్: అదే అణుబాంబు. The Ultimate of Weapons, the technology that had not met its match, well. at least till now! ఆయుదాలకే ఆయుధం, ప్రపంచ దేశాలన్నీ, ఒక దానికి ఒకటి పడక పోయినా, యుద్ధం అంటే భయ పడేది, ఎందుకంటే, అణుబాంబుకి. ఇంత వరకూ ప్రపంచ దేశాల దగ్గర, దీనికి సమాధానం లేదు. ఒక దేశం దగ్గర అణుబాంబు ఉంది అంటే, అమెరికా అయినా రష్యా అయినా సరే, దాని వైపు కన్నెత్తి చూడదు, కాని అదంతా ఇప్పటి వరకు.

రఘునాథ్: Gentlemen, I present to you, one and only technology, that can nullify atom bombs. ప్రపంచం అంతా భయపడే అణుబాంబుకి విరుగుడు, ఆ దీవిలో ఉంది. (Slide change అయ్యింది. ఫిలిప్పీన్స్ సైనికులు ప్రయోగించిన ఆయుధాలు అన్నీ, దీవి లోపలకి వెళ్ళక పోవడం కనిపిస్తోంది, వీడియో లో). మనం ఇప్పటి వరకూ బుల్లెట్లు వెళ్ళక పోవడం చూసాం, plastic-made  మిస్సైల్ వెళ్లకపోవడం చూసాం, poisonous-gases వెళ్లకపోవడం చూసాం, but, నా పరిశోధనలో తేలింది ఏమిటి అంటే, అణుబాంబులు కూడా ఆ దీవిని ఏమి చెయ్యలేవు.

అధ్యక్షుడు: మిస్టర్ రఘునాథ్, ఎంతవరకు మీరు దీనిని కన్ఫర్మ్ చెయ్యగలరు? (కొంచెం డవుటు గా అడిగాడు).

రఘునాథ్: 100% Mr. President, 100%. నేను చేసిన పరిశోధనల్లో, 100%, ఇట్ వర్క్స్ (చిన్నగా నవ్వాడు).
(ఏమి చెప్పాలో తెలియక, నమ్మలేకుండా చూస్తున్న అందరి కేసి చూసి, రఘునాథ్)

రఘునాథ్: Let me explain! Gentlemen, let me show you. (లేచి నిలబడిన కొందరిని కూర్చోమన్నట్టు సైగ చేసాడు అధ్యక్షుడు. అందరూ కూర్చున్నారు, silence అయ్యింది మీటింగ్ హాల్ అంతా). ఇది యురేనియం, (Remote button నొక్కితే డోర్ ఒపెనయ్యి కనిపించింది). అణుబాంబుల్లో వాడేది, Of course, చాల తక్కువ మొత్తం లో, no danger, it is in very less quantity. దీని పైకి, ఆ దీవి లో ఉన్న, గాలిని పంపిస్తాను చూడండి. (అది ఉన్న గ్యాస్ చాంబర్ లోనికి, గాస్ పంపించాడు. చూస్తుండగానే యురేనియం మాయం అయ్యింది).

రఘునాథ్: Gentlemen, ఆ దీవిలోని మట్టిలో గాలిలో, ఒక బాక్టీరియా (వైరస్) ఉంది. అది, దీవి చుట్టూ, ఒక కనిపించని గొడుగు లాగ ఉంది. ఆ క్రిములు, దేనినైనా లోహాన్ని గాని, ప్లాస్టిక్ ని గాని, యురేనియుం వంటి రేడియో ధార్మిక పదార్ధాలని గాని తిన గలవు. They react with everything in-organic, and release it in the form of gases. ఆ కవచాన్ని (దీవి చుట్టూ, ఒక లేత ఆకుపచ్చ రంగు, పార దర్సకమైన గొడుగు కనిపిస్తోంది ఇప్పుడు), దాటి, లోహం గాని, plastic weaponry గాని లోపలకి వెళ్ళలేవు.

రఘునాథ్: Just imagine, ఈ క్రిముల్ని మనం పెంచి, ఇందులో ఓన్లీ అణ్వాయుదాలు తినే క్రిముల్ని వేరు చేసి, ఫిలిప్పీన్స్ చుట్టూ ఒక గొడుగు లా పెట్టుకొంటే, ఏ అగ్ర రాజ్యం అయినా మనల్ని ఏమి చెయ్యలేదు. (స్వరం మెల్లగా పెంచుతూ) నేల మీద నించి వచ్చినా, నీటిలో నించి వచ్చినా, ఆకాశం నించి వచ్చినా, మన శత్రువుల ఆయుధాలు, మన ముందు నిర్వీర్యం అయ్యిపోతాయి. మన దేశాన్ని ఇంత కాలం, అణిచివేసిన, మిగతా ప్రపంచ దేశాలు, మన శత్రువులూ, మనకి దాసోహం అంటాయి. ఫిలిప్పీన్స్ will be, Number 1.

అధ్యక్షుడితో సహా అందరూ, నిలబడి చప్పట్లు కొట్టారు.

అర్జునుడు - VII


అది ఫిలిప్పీన్స్ లోని మనిలా లో Military district. ఒక పెద్ద భవంతిలో, మిలిటరీ దుస్తుల్లో కొంతమంది. వాళ్ళంతా ఒక meeting hall లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఒక presentation జరుగుతోంది. Presentation ఇస్తున్నది, ఫిలిప్పీన్స్ King's Scientific advisor, భారతీయ సంతతి కి చెందిన Dr. రఘునాథ్. 

రఘునాథ్: Gentlemen! I will make it brief. (బటన్ నొక్కాడు, తెర మీద ఒక ద్వీపం యొక్క aerial view కనిపిస్తోంది). ఈ ద్వీపం మన దేశానికి 100 మైళ్ళ దూరం లో ఉంది. ఇంత కాలం ఎందుకో మన satellite images లో ఇది కనిపించలేదు. ఇప్పుడు కనిపించిన data ప్రకారం దీన్లో చాలా విలువైన ఖనిజాలు, మినరల్స్ ఉన్నాయి. దీన్ని సొంతం చేసుకోవడం వల్ల, మన దేశానికి ఆర్ధికం గా బలం చేకూరుతుంది. 

రఘునాథ్: (తనే మళ్ళీ కంటిన్యూ చేసాడు). మనకు తెలిసిన సమాచారం బట్టి, ఈ దీవి ఇంకా ఆటవికుల చేతిలో ఉంది. వాళ్లకి సముద్రం మీద ప్రయాణించడం, ఇంకా తెలియదు. వాళ్ళ technology కూడా మన ముందు నిలబడదు (Slides change చేసాడు). వాళ్ళని గాని, వాళ్ళ రాజుని గాని ఏదో మాయ మాటలు చెప్పి convince చెయ్యచ్చు. (ఏదో పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు). ఒక వేళ మనల్ని రానివ్వకపొతే, వాళ్ళ దీవిని వశపరచుకోవడం చాలా ఈజీ, ప్రపంచ దేశాల ద్రుష్టి లో పడకుండా పని కానివ్వాలి అంతే (ఈ మాటని ఫిలిప్పీన్స్ ప్రస్తుత అధ్యక్షుడి కేసి చూస్తూ అన్నాడు రఘునాథ్).

మీటింగ్ చాలా success అయ్యింది. అందరూ ఆ దీవిని నయానో, భయానో ఫిలిప్పీన్స్ లో కలిపెయ్యలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ దీవికి కొంతమంది దౌత్యవేత్తలని పంపారు, అందులో రఘునాథ్ కూడా ఉన్నాడు. వాళ్ళంతా ఆటవికులే కాబట్టి రఘునాథ్ పెద్దగా ఏమి prepare అవ్వలేదు, రాజు తో మాట్లాడటానికి.

వీళ్ళు దీవిలో అడుగుపెట్టగానే ఆటవికులు వీళ్ళని బంధించారు. రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. ఎత్తైన సింహాసనం లో కూర్చున్న అర్జున్ ని చూసి కొంచెం disappoint అయ్యాడు రఘునాథ్. అర్జున్ చెప్పిన మీద, వీళ్ళ చేతుల కట్లు విప్పారు ఆటవికులు.

రఘునాథ్: హలో, నా పేరు రఘునాథ్! (చెయ్యి ముందుకి చాపాడు). (ఇది చూసిన ఆటవికులు, attack చేస్తున్నాడనుకుని బల్లేలతో ముందుకి వచ్చారు. వారిని వారించి అర్జున్ సింహాసనం దిగి కిందకి వచ్చాడు).

Shake-hand అయ్యాక, రఘునాథ్ కంటిన్యూ చేసాడు.

రఘునాథ్: మీ దీవిలో, మంచి వన మూలికలు ఉన్నాయని మాకు తెలిసింది, వాటిని ... ఇక్కడ నించి ... తవ్వి తీసుకునేందుకు మా ప్రభుత్వం ... నన్ను ఇక్కడికి ... పంపించింది (పూర్తి చేసాడు).

అతను మాట్లాడుతున్నంతసేపు, అర్జున్ అతని మొహం కేసి చూడలేదు. అతని వేషాన్ని, మిలిటరీ డ్రెస్ ని కింద నించి పై దాకా చూస్తున్నాడు. అలా చూస్తున్న అర్జున్ కి అతని identity card కనిపించింది.

అర్జున్: రఘునాథ్! (కార్డు లో పేరు చదువుతూ). ఇండియన్నా? (అడిగాడు, కొద్దిగా నవ్వుతూ)

రఘునాథ్: I am from Philippines! నేను పుట్టింది ఇండియాలో, కాని ఇప్పుడు ఉన్నది మటుకూ ఫిలిప్పీన్స్, I am a citizen of Philippines, not an Indian. (ఎలాగో పూర్తి చేసాడు రఘునాథ్. పూర్తి కాగానే, జేబు లోంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. కొంచెం tension గా ఉంది అతనికి. ఎవడో ఆటవికుడు ఉంటాడనుకుంటే, ఒక నాగరికుడు రాజుగా ఉండటం, తనని అన్ని ప్రశ్నలు వెయ్యడం, పైగా తను చెప్పింది వినకుండా, అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది).

అర్జున్ మొహం లోని చిరునవ్వు మాయం అయ్యింది.

అర్జున్: (ID కార్డు ని వదిలేస్తూ) ఏ మూలికలు?
రఘునాథ్: ఆ ...!
అర్జున్: అదే, ఏమి వన మూలికలు అని?
రఘునాథ్: మూలికలంటే, చాలా ఉన్నాయి, many of them are here! ప్రపంచానికి కావలసిన ఎన్నో మంచి మూలికలు ఇక్కడే ఈ ద్వీపం లోనే ఉన్నాయి. అందుకే మేము ఇక్కడికి (ఇంకా చెప్తూ పోతున్నాడు, మధ్యలో అర్జున్)

అర్జున్: నన్ను చెప్పమంటారా? ఈ దీవిలో ఏ పెట్రోలో, డయమండ్సో, బంగారమో మీకు కనిపించాయి, అందుకే ఇక్కడ అవన్నీ తవ్వి తీసుకుపోవడానికి ఇక్కడకి వచ్చారు. (రఘునాథ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు).

రఘునాథ్ తో ఇవి చెప్పడానికి ముందు రాజగురువు కేసి ఒక సారి చూసాడు అర్జున్. అతడు అనుమానం గా వద్దన్నట్టు తలాడించడంతో, తన మనసులోమాట బయటికి చెప్పాడు.

రఘునాథ్ ఇంకేమి మాట్లాడలేకపోయాడు. తిరిగి అర్జున్,

అర్జున్: (రఘునాథ్ కేసి తిరిగి) చూడండి, ఇక్కడి ప్రజలు ప్రకృతి ని తల్లి గా భావిస్తారు. ఆ తల్లిని ఏదో లోహాల కోసమో, ఖనిజాల కోసమో తవ్వడం వీళ్ళ దృష్టి లో మాతృ హత్య. వీళ్ళకి రాజు గా నేను చెప్పేది ఒకటే, ఈ విషయం వీళ్ళల్లో ఎవరికీ తెలియక ముందే ... వెళ్ళిపొండి! ఇంకొక్క క్షణం ఉంటె, నేనే ఏమి చేస్తానో తెలియదు. (కోపంగా రఘునాథ్ కేసి చూసాడు అర్జున్).

రఘునాథ్, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఫిలిప్పీన్స్ తమ మీదకి యుద్ధానికి వస్తుందని, అందరికీ తెలుసు. ఇవాళో రేపో, ఆ ఆధునిక మారణాయుధాలతో తాము ఎలా పోరాడతామో, అర్జున్ కి తెలియడం లేదు.

-- 2 --
అర్జున్ ఒక సంఘటనని చూస్తున్నాడు. దశాణి  ... నవాణి ... (సంస్కృతం లో అనుకుంటా, countdown జరుగుతోంది) ...  షష్టీహి ... ... శూన్యం 

వెంటనే తెల్లటి వెలుగు కళ్ళముందు కనిపించింది. భయంకరమైన ధ్వని, కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి వెలుగు కనిపించాయి అతనికి. ఆ తెల్లటి వెలుగు మెల్లగా దుమ్ము తెరగా మారింది. ఆ దుమ్ము లోనించి వస్తున్నాయి రెండు రదాశ్వాలు. రధం పైన నించుని చూస్తున్నాడు, ఒక ఆజానుబాహుడు. చూస్తే అచ్చు అర్జున్ లాగానే ఉన్నాడు. రాజరికపు దుస్తులలో ఉన్న అతని మొహం తేజోవంతం గా ఉంది. స్ఫురద్రూపి ఐన అతని కళ్ళలో మాత్రం ఒక సన్నటి కన్నీటి తెర.

రధం అతి వేగం గా పయనిస్తోంది. రధం వెళ్తున్న ప్రదేశం పేరు గాండీవ క్షేత్రం. అది పాండవుల తాలూకు అమ్ముల పొది, శస్త్రాలను భద్రపరిచే చోటు. మోడరన్ భాషలో చెప్పాలంటే "Missile Silo". పాండవుల తాలూకు అస్త్రాలైన "పాశుపతం", "వారుణాస్త్రం", "బ్రహ్మాస్త్రాదులు" అక్కడ భద్రపరచబడి ఉంటాయి. దారికి ఇరు వైపులా ఉన్న సైనికులు అతనికి వందనం చేస్తున్నారు.

రథం ఒక సువిశాలమైన భవంతి ముందు ఆగింది. ఈ నాటి Military style లో ఎత్తైన గోడలు, ఒక ఇనుము తో చేసిన మందమైన ఎత్తైన ద్వారం ఉన్నాయ్ ఆ భవనం చుట్టూ. రథం దిగి రాకుమారుడు ఒంటరిగా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఏదో Identification/Password అడిగింది ఆ ద్వారం సంస్కృతం లో, ఇతను చెప్పాడు. ద్వారం పైకి లేచింది, లోపలికి వెళ్ళాడు, అతని వెంట ఒక నలుగురు సైనికులు మాత్రమే లోపలికి వెళ్ళారు. అతని రాకని, కొన్ని పెద్ద పెద్ద చిలకలు ఆటోమాటిక్ గా చెప్తూ ఆ భవనం లోపలి దారులలోనికి వెళ్ళాయి. చిలుకలు చెప్తున్నవి గాని, ద్వారం వద్ద identification అతడు ఏమి చెప్పాడో, అర్జున్ కి తెలియడం లేదు.

రాజు వేషంలో ఉన్న అర్జున్ దగ్గరికి రాగానే అన్ని తలుపులూ వాటంతట అవే తెరుచుకోసాగాయి (face recognition అనుకోవచ్చు). సంస్కృతం లో అవి అతనికి సైనిక వందనం చెప్పడం కూడా మొదలు పెట్టాయి. అర్జున్ ఒక A/C chamber లోనికి ప్రవేశించాడు. అతని వెనుక వచ్చిన సైనికులు ద్వారం దగ్గరే ఆగిపోయారు. ఆ A/C chamber లో temperature maintain చేస్తున్నవి పువ్వులు. ఒక గోడ అంటా creepers లాగ పెరిగిన కొన్ని పెద్ద పూల మొక్కలు, వేడి ని control చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఒకొక పువ్వు అందులోంచి రాలి పోతోంది కూడా.

అక్కడ అనేకమైన Computer లు, ఆ chamber కి సంబంధించిన temperature etc... వివరాలు సంస్కృతం లో చెప్తున్నాయి. ఒక పక్కగా ఐదుగురు ఋషులు (తెల్లటి dress ల్లో, పెద్ద గెడ్డాలతో) ఉన్నారు. Chamber మధ్యలో ఉన్న అర్జున్ దగ్గరికి వాళ్ళల్లో ఒక ముని వచ్చాడు. వణుకుతున్న చేతులతో, అతనొక Glass box (గాజు పెట్టి), అర్జున్ కి అందించాడు. అది అందుకొంటూ ఆ ముని కేసి చూసాడు అర్జున్. ఆ ముని కళ్ళు దించుకొన్నాడు. ఆ ముని తిరిగి తన స్థానానికి వెళ్ళాడు.

తర్వాత ఆ రాకుమారుడు ఆ గది లోనే ఉన్న ఒక Glass Chamber లోనికి వెళ్ళాడు. అతను వెళ్ళగానే ఆ chamber తలుపులు మూసుకున్నాయి. అతని ఎదురుగా ఉన్న పెద్ద buttons panel లో ఏవో buttons నొక్కాడు. తర్వాత బ్రహ్మ దేవుడు తనకు ఇచ్చిన మంత్రాన్ని password గా enter చేసాడు. ఆ తరువాత గాజు పెట్టె లోని crystal ని తీసి panel లోనికి key లాగ పెట్టాడు. Count down సంస్కృతం లో start అయ్యింది. ఎందుకో తెలీదు అతని కళ్ళల్లో నీళ్ళు, అర్జున్ కి తానె ఏడుస్తున్నట్టు అనిపించింది. ఒక వీరుడికి ఉండవలసిన గర్వం అతని కళ్ళల్లో ఇప్పుడు మాయమయ్యింది.

Countdown start అయ్యింది, శూన్యం (Zero) అంటూనే, అర్జున్ కి మెలకువ వచ్చింది. నిద్ర లేచిన అర్జున్ కళ్ళలో నీళ్ళు, ఎందుకు వచ్చాయో తనకి తెలియడం లేదు.

తెలతెల వారుతున్న ఆ సమయం లో, కోట దిగి కిందకి వచ్చాడు అర్జున్. అక్కడే చలిమంట చుట్టూ, కొంతమంది వీరులతో కూర్చున్నాడు రాజ గురువు. తన వైపే చూస్తున్న రాజ గురువు పక్కగా కూర్చున్నాడు అర్జున్. అర్జున్ కేసి మెరుపు నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు రాజ గురువు.

రాజ గురువు: భారతం చెప్పుకుంటున్నాము, వింటావా అర్జునా! (ఎంతో ప్రేమగా అడిగాడు రాజ గురువు. అర్జున్ తల ఊపాడు). మనుషుల బుర్రలపైన యుద్ధమనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. చరిత్ర ఎన్ని చెప్పినా, ఎంత వీరత్వాన్ని ప్రబోధించినా యుద్ధం చేసిన ప్రతి వీరునికి అంతః కరణ లో ఏదో ఒక బాధ, తప్పు చేసిన భావన ఇంచుమించు తప్పదు.

సాదివూ: (ఈ మధ్యలో తన సందేహాన్ని వెల్లడించాడు సాదివూ) మంచి కి చెడు కి మధ్య జరిగే యుద్ధానికైనా రెండువైపులా నష్టాలు తప్పవు. చెడ్డ వాని వైపు కూడా మంచి వాడు ఉంటాడు, అలాంటప్పుడు యుద్ధం ఎలా చెయ్యడం?

రాజ గురువు: నిజమే, భారతం లో శల్యుడు చావలేదా? ఎం, శల్య సారధ్యం వల్లనే కదా, కర్ణుడి ఆత్మ విశ్వాసం క్షీణించింది? భీష్ముడు, ద్రోణుడు, కొంతవరకు కర్ణుడు చెడ్డవాళ్ళంటే నమ్మడం కష్టం. ఒక మంచి కోసమని ఇంతమందిని చంపడానికి, ఇంత చెడు చెయ్యడానికి మనిషన్న వాడికి బాధే కదా? (రాజ గురువు చెప్పుకు పోతున్నాడు). అయితే శ్రీ కృష్ణుడు ఏమి బోధించాడు? మనుషులం, మనమెవరం? మంచి చెడ్డలు ఎంచడానికి మనమెవరం, అంతా ఆ పరమాత్ముడే చూస్తాడు, మన పని అల్లా దేవుడు మనకిచ్చిన గమ్యాన్ని చేరుకోవడమే! (అర్జున్ కేసి తిరిగి నవ్వుతూ అన్నాడు).

అర్జున్ కళ్ళలో ఎందుకో నీళ్ళు, అతనికి అర్ధం కావడం లేదు, బాధ ఎక్కడినించి వస్తోందో? అలాగని యుద్ధం అంటే భయం లేదు అతనికి, జరగబోయేది తలచుకుంటే, అందరి ప్రాణాలకి తన ప్రాణం అడ్డు వేద్దాం అనిపిస్తోంది, కాని పని జరగదే?

తెల్లవారుతూండగానే, గస్తీ కి కూర్చున్న సాదివూ తదితర వీరులు వెళ్ళిపోయారు. తనకి వచ్చిన కల గురించి చెప్దామనుకున్నాడు అర్జున్. అతని కేసి తిరిగి, నవ్వుతూ తను ఇందాక చెప్తున్నది continue చేస్తున్నట్టుగా అన్నాడు రాజ గురువు.

రాజ గురువు: (అర్జున్ భుజం మీద చెయ్యి వేసి) సత్యానికి ధర్మానికి నిలబడే ధర్మరాజు అంతటి వాడే "అశ్వద్ధామ హతః, (కుంజరః)" అని అబద్ధం చెప్పాడు. ఇంద్రుడు, అర్జునుడి తండ్రి (చిన్నగా నవ్వుతూ...) కర్ణుడి వద్ద, మాయోపాయం తో యాచించవలసి వచ్చింది. మంచి యందు నమ్మకం తో బ్రతికేది మనుషులే, వాళ్ళనే ఈ యుద్ధాలు బాధిస్తాయి. దేవుడైన శ్రీ కృష్ణుడు, తత్వాన్ని చెప్పాడు కాని, మనుషుల బాధను నివారించలేడు గా?!
(కళ్ళు మూసుకుని కృష్ణుడికి నమస్కరించాడు రాజ గురువు).

రాజ గురువు: (కొంత సేపు కళ్ళు మూసుకుని ప్రార్ధించి..., మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న అర్జున్ కేసి క్రీగంట చూసి, గమనించి) నువ్వు ప్రయోగించినది బ్రహ్మశిరో నామకాస్త్రం, నాలుగు  బ్రహ్మాస్త్రాల పెట్టు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన చోట, అప్పటి జన నష్టం మాత్రమె కాకుండా, ఎన్నో దీర్ఘ కాలిక ప్రభావాలు ఉంటాయని, ముఖ్యంగా అక్కడ కొంత కాలం వరకు పంటలు పండవని, భూమి నిస్సారమౌతుందని, పిల్లలు పుట్టరని, పుట్టిన వాళ్ళు వికారంగా పుడతారని చెబుతారు.

అర్జున్ కి ముందు పూర్తిగా అర్ధం కాలేదు, ఆతర్వాత తన కల గురించే చెప్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు. రాజ గురువు, అదేమీ పట్టించుకోకుండా చెప్తున్నాడు.

రాజ గురువు: ప్రస్తుతం ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం, అటువంటి నాలుగు బ్రహ్మాస్త్రాలని తీసుకు వెళుతోంది. కౌరవుల ఆధీనం లో ఉన్న నాలుగు చిట్టచివరి నగరాల పైకి ఆ అస్త్రాలని సంధించారు పాండవులు. అవే గనుక ఆ నగరాల మీద పడితే, కౌరవులతో పాటు, సామాన్య ప్రజానీకం కూడా భయంకరంగా చస్తారు. అన్ని తెలిసి, అన్న గారు యుధిష్ఠిరుని ఆజ్ఞ మీద, ఈ పని చెయ్యక తప్పలేదు నీకు. ఐతే, ఇదే సమయంలో దుర్యోధనుడి ప్రోద్బలం మీద, అశ్వత్థామ అదే అస్త్రాన్ని తమపై సందిస్తున్నాడని తెలియదు పాండవులకి.

రాజ గురువు: నిజానికి కౌరవులు ఈ అస్త్రాన్ని ముందే ప్రయోగించారు. ఈ రెండు అస్త్రాలని ప్రయోగించినట్టు దివ్య దృష్టి (prediction technology అనుకోవచ్చు, మన భాషలో) ద్వారా తెలుసుకొన్న వశిష్టుడు, ఇద్దరికీ ఆ అస్త్రాలని ఆపమని వర్తమానం పంపించాడు.

అది విన్నాక నీవు వెంటనే, ఆ నాలుగు అస్త్రాలని ఉపసంహరింపచేసావు. ఐతే, తన గర్వం కోసం సమస్త ప్రపంచాన్ని నిర్లక్ష్యం చెయ్యగల సుయోధనుడు మాత్రం, అంత త్వరగా ఇది పడనివ్వలేదు. అశ్వత్థామ చేత మూడే ఉపసంహరింప చేయించాడు అతడు. నాలుగో అస్త్రాన్ని మటుకు, బభ్రువాహనుడు ఉన్న కన్యాకుబ్జం వైపు సంధించాడు మానధనుడు, దుర్యోధనుడు. అతనికి తన చావు సమీపించిందని తెలుస్తూనే ఉంది, కాని పాండవుల వంశోద్దారకుని హత్య చెయ్యదలిచాడతడు. అందుకే నీ కుమారుడు అభిమన్యుని విధవ (Widow), ఉత్తర, కడుపులో పెరుగుతున్న భ్రూణాన్ని చంపదలిచాడతడు. అతనే ప్రస్తుత పాండవ వారసుడు కాబట్టి, ఆ పసి కందుని చంపడం ద్వారా పాండవ వంశాన్ని చెయ్యగలిగినంత మట్టు పెట్టాలన్నదే అతని ధ్యేయ౦. ప్రస్తుతం, నెలలు నిండిన ఉత్తర తన బావగారైన బభ్రువాహనుని సంరక్షణలో ఉంది. సరిగ్గా ఆమె ఉన్న కన్యాకుబ్జం వైపు వెళ్తోందా అస్త్రం.

ఏదో తెలిసినట్టు, తెలియనట్టు అనిపిస్తోంది అర్జున్ కి. చూసినట్టుగా అనిపిస్తోంది, కాని పూర్తిగా గుర్తుకిరావడం లేదు. నమ్మాలనే ఉంది, కాని నమ్మబుద్ది వెయ్యడం లేదతనికి. చెప్పింది సగం విని సగం వదిలేసానా అనిపించింది అతనికి, కాని మొత్తం అంతా ఏదో చూసినట్టు, గుర్తుగా ఉంది. ఆ సందిగ్ధం లో ఎలాగో అక్కడినించి కదిలాడు అతను.

-- (సశేషం) --

అర్జునుడు - VI


అది ఫిలిప్పీన్స్ లోని మనిలా లో Military district. ఒక పెద్ద భవంతిలో, మిలిటరీ దుస్తుల్లో కొంతమంది. వాళ్ళంతా ఒక meeting hall లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఒక presentation జరుగుతోంది. Presentation ఇస్తున్నది, ఫిలిప్పీన్స్ King's Scientific advisor, భారతీయ సంతతి కి చెందిన Dr. రఘునాథ్. 

రఘునాథ్: Gentlemen! I will make it brief. (బటన్ నొక్కాడు, తెర మీద ఒక ద్వీపం యొక్క aerial view కనిపిస్తోంది). ఈ ద్వీపం మన దేశానికి 100 మైళ్ళ దూరం లో ఉంది. ఇంత కాలం ఎందుకో మన satellite images లో ఇది కనిపించలేదు. ఇప్పుడు కనిపించిన data ప్రకారం దీన్లో చాలా విలువైన ఖనిజాలు, మినరల్స్ ఉన్నాయి. దీన్ని సొంతం చేసుకోవడం వల్ల, మన దేశానికి ఆర్ధికం గా బలం చేకూరుతుంది. 

రఘునాథ్: (తనే మళ్ళీ కంటిన్యూ చేసాడు). మనకు తెలిసిన సమాచారం బట్టి, ఈ దీవి ఇంకా ఆటవికుల చేతిలో ఉంది. వాళ్లకి సముద్రం మీద ప్రయాణించడం, ఇంకా తెలియదు. వాళ్ళ technology కూడా మన ముందు నిలబడదు (Slides change చేసాడు). వాళ్ళని గాని, వాళ్ళ రాజుని గాని ఏదో మాయ మాటలు చెప్పి convince చెయ్యచ్చు. (ఏదో పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు). ఒక వేళ మనల్ని రానివ్వకపొతే, వాళ్ళ దీవిని వశపరచుకోవడం చాలా ఈజీ, ప్రపంచ దేశాల ద్రుష్టి లో పడకుండా పని కానివ్వాలి అంతే (ఈ మాటని ఫిలిప్పీన్స్ ప్రస్తుత అధ్యక్షుడి కేసి చూస్తూ అన్నాడు రఘునాథ్).

మీటింగ్ చాలా success అయ్యింది. అందరూ ఆ దీవిని నయానో, భయానో ఫిలిప్పీన్స్ లో కలిపెయ్యలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ దీవికి కొంతమంది దౌత్యవేత్తలని పంపారు, అందులో రఘునాథ్ కూడా ఉన్నాడు. వాళ్ళంతా ఆటవికులే కాబట్టి రఘునాథ్ పెద్దగా ఏమి prepare అవ్వలేదు, రాజు తో మాట్లాడటానికి.

వీళ్ళు దీవిలో అడుగుపెట్టగానే ఆటవికులు వీళ్ళని బంధించారు. రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. ఎత్తైన సింహాసనం లో కూర్చున్న అర్జున్ ని చూసి కొంచెం disappoint అయ్యాడు రఘునాథ్. అర్జున్ చెప్పిన మీద, వీళ్ళ చేతుల కట్లు విప్పారు ఆటవికులు.

రఘునాథ్: హలో, నా పేరు రఘునాథ్! (చెయ్యి ముందుకి చాపాడు). (ఇది చూసిన ఆటవికులు, attack చేస్తున్నాడనుకుని బల్లేలతో ముందుకి వచ్చారు. వారిని వారించి అర్జున్ సింహాసనం దిగి కిందకి వచ్చాడు).

Shake-hand అయ్యాక, రఘునాథ్ కంటిన్యూ చేసాడు.

రఘునాథ్: మీ దీవిలో, మంచి వన మూలికలు ఉన్నాయని మాకు తెలిసింది, వాటిని ... ఇక్కడ నించి ... తవ్వి తీసుకునేందుకు మా ప్రభుత్వం ... నన్ను ఇక్కడికి ... పంపించింది (పూర్తి చేసాడు).

అతను మాట్లాడుతున్నంతసేపు, అర్జున్ అతని మొహం కేసి చూడలేదు. అతని వేషాన్ని, మిలిటరీ డ్రెస్ ని కింద నించి పై దాకా చూస్తున్నాడు. అలా చూస్తున్న అర్జున్ కి అతని identity card కనిపించింది.

అర్జున్: రఘునాథ్! (కార్డు లో పేరు చదువుతూ). ఇండియన్నా? (అడిగాడు, కొద్దిగా నవ్వుతూ)

రఘునాథ్: I am from Philippines! నేను పుట్టింది ఇండియాలో, కాని ఇప్పుడు ఉన్నది మటుకూ ఫిలిప్పీన్స్, I am a citizen of Philippines, not an Indian. (ఎలాగో పూర్తి చేసాడు రఘునాథ్. పూర్తి కాగానే, జేబు లోంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. కొంచెం tension గా ఉంది అతనికి. ఎవడో ఆటవికుడు ఉంటాడనుకుంటే, ఒక నాగరికుడు రాజుగా ఉండటం, తనని అన్ని ప్రశ్నలు వెయ్యడం, పైగా తను చెప్పింది వినకుండా, అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది).

అర్జున్ మొహం లోని చిరునవ్వు మాయం అయ్యింది.

అర్జున్: (ID కార్డు ని వదిలేస్తూ) ఏ మూలికలు?
రఘునాథ్: ఆ ...!
అర్జున్: అదే, ఏమి వన మూలికలు అని?
రఘునాథ్: మూలికలంటే, చాలా ఉన్నాయి, many of them are here! ప్రపంచానికి కావలసిన ఎన్నో మంచి మూలికలు ఇక్కడే ఈ ద్వీపం లోనే ఉన్నాయి. అందుకే మేము ఇక్కడికి (ఇంకా చెప్తూ పోతున్నాడు, మధ్యలో అర్జున్)

అర్జున్: నన్ను చెప్పమంటారా? ఈ దీవిలో ఏ పెట్రోలో, డయమండ్సో, బంగారమో మీకు కనిపించాయి, అందుకే ఇక్కడ అవన్నీ తవ్వి తీసుకుపోవడానికి ఇక్కడకి వచ్చారు. (రఘునాథ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు).

రఘునాథ్ తో ఇవి చెప్పడానికి ముందు రాజగురువు కేసి ఒక సారి చూసాడు అర్జున్. అతడు అనుమానం గా వద్దన్నట్టు తలాడించడంతో, తన మనసులోమాట బయటికి చెప్పాడు.

రఘునాథ్ ఇంకేమి మాట్లాడలేకపోయాడు. తిరిగి అర్జున్,

అర్జున్: (రఘునాథ్ కేసి తిరిగి) చూడండి, ఇక్కడి ప్రజలు ప్రకృతి ని తల్లి గా భావిస్తారు. ఆ తల్లిని ఏదో లోహాల కోసమో, ఖనిజాల కోసమో తవ్వడం వీళ్ళ దృష్టి లో మాతృ హత్య. వీళ్ళకి రాజు గా నేను చెప్పేది ఒకటే, ఈ విషయం వీళ్ళల్లో ఎవరికీ తెలియక ముందే ... వెళ్ళిపొండి! ఇంకొక్క క్షణం ఉంటె, నేనే ఏమి చేస్తానో తెలియదు. (కోపంగా రఘునాథ్ కేసి చూసాడు అర్జున్).

రఘునాథ్, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఫిలిప్పీన్స్ తమ మీదకి యుద్ధానికి వస్తుందని, అందరికీ తెలుసు. ఇవాళో రేపో, ఆ ఆధునిక మారణాయుధాలతో తాము ఎలా పోరాడతామో, అర్జున్ కి తెలియడం లేదు.

-- 2 --
అర్జున్ ఒక సంఘటనని చూస్తున్నాడు. దశాణి  ... నవాణి ... (సంస్కృతం లో అనుకుంటా, countdown జరుగుతోంది) ...  షష్టీహి ... ... శూన్యం 

వెంటనే తెల్లటి వెలుగు కళ్ళముందు కనిపించింది. భయంకరమైన ధ్వని, కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి వెలుగు కనిపించాయి అతనికి. ఆ తెల్లటి వెలుగు మెల్లగా దుమ్ము తెరగా మారింది. ఆ దుమ్ము లోనించి వస్తున్నాయి రెండు రదాశ్వాలు. రధం పైన నించుని చూస్తున్నాడు, ఒక ఆజానుబాహుడు. చూస్తే అచ్చు అర్జున్ లాగానే ఉన్నాడు. రాజరికపు దుస్తులలో ఉన్న అతని మొహం తేజోవంతం గా ఉంది. స్ఫురద్రూపి ఐన అతని కళ్ళలో మాత్రం ఒక సన్నటి కన్నీటి తెర.

రధం అతి వేగం గా పయనిస్తోంది. రధం వెళ్తున్న ప్రదేశం పేరు గాండీవ క్షేత్రం. అది పాండవుల తాలూకు అమ్ముల పొది, శస్త్రాలను భద్రపరిచే చోటు. మోడరన్ భాషలో చెప్పాలంటే "Missile Silo". పాండవుల తాలూకు అస్త్రాలైన "పాశుపతం", "వారుణాస్త్రం", "బ్రహ్మాస్త్రాదులు" అక్కడ భద్రపరచబడి ఉంటాయి. దారికి ఇరు వైపులా ఉన్న సైనికులు అతనికి వందనం చేస్తున్నారు.

రథం ఒక సువిశాలమైన భవంతి ముందు ఆగింది. ఈ నాటి Military style లో ఎత్తైన గోడలు, ఒక ఇనుము తో చేసిన మందమైన ఎత్తైన ద్వారం ఉన్నాయ్ ఆ భవనం చుట్టూ. రథం దిగి రాకుమారుడు ఒంటరిగా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఏదో Identification/Password అడిగింది ఆ ద్వారం సంస్కృతం లో, ఇతను చెప్పాడు. ద్వారం పైకి లేచింది, లోపలికి వెళ్ళాడు, అతని వెంట ఒక నలుగురు సైనికులు మాత్రమే లోపలికి వెళ్ళారు. అతని రాకని, కొన్ని పెద్ద పెద్ద చిలకలు ఆటోమాటిక్ గా చెప్తూ ఆ భవనం లోపలి దారులలోనికి వెళ్ళాయి. చిలుకలు చెప్తున్నవి గాని, ద్వారం వద్ద identification అతడు ఏమి చెప్పాడో, అర్జున్ కి తెలియడం లేదు.

రాజు వేషంలో ఉన్న అర్జున్ దగ్గరికి రాగానే అన్ని తలుపులూ వాటంతట అవే తెరుచుకోసాగాయి (face recognition అనుకోవచ్చు). సంస్కృతం లో అవి అతనికి సైనిక వందనం చెప్పడం కూడా మొదలు పెట్టాయి. అర్జున్ ఒక A/C chamber లోనికి ప్రవేశించాడు. అతని వెనుక వచ్చిన సైనికులు ద్వారం దగ్గరే ఆగిపోయారు. ఆ A/C chamber లో temperature maintain చేస్తున్నవి పువ్వులు. ఒక గోడ అంటా creepers లాగ పెరిగిన కొన్ని పెద్ద పూల మొక్కలు, వేడి ని control చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఒకొక పువ్వు అందులోంచి రాలి పోతోంది కూడా.

అక్కడ అనేకమైన Computer లు, ఆ chamber కి సంబంధించిన temperature etc... వివరాలు సంస్కృతం లో చెప్తున్నాయి. ఒక పక్కగా ఐదుగురు ఋషులు (తెల్లటి dress ల్లో, పెద్ద గెడ్డాలతో) ఉన్నారు. Chamber మధ్యలో ఉన్న అర్జున్ దగ్గరికి వాళ్ళల్లో ఒక ముని వచ్చాడు. వణుకుతున్న చేతులతో, అతనొక Glass box (గాజు పెట్టి), అర్జున్ కి అందించాడు. అది అందుకొంటూ ఆ ముని కేసి చూసాడు అర్జున్. ఆ ముని కళ్ళు దించుకొన్నాడు. ఆ ముని తిరిగి తన స్థానానికి వెళ్ళాడు.

తర్వాత ఆ రాకుమారుడు ఆ గది లోనే ఉన్న ఒక Glass Chamber లోనికి వెళ్ళాడు. అతను వెళ్ళగానే ఆ chamber తలుపులు మూసుకున్నాయి. అతని ఎదురుగా ఉన్న పెద్ద buttons panel లో ఏవో buttons నొక్కాడు. తర్వాత బ్రహ్మ దేవుడు తనకు ఇచ్చిన మంత్రాన్ని password గా enter చేసాడు. ఆ తరువాత గాజు పెట్టె లోని crystal ని తీసి panel లోనికి key లాగ పెట్టాడు. Count down సంస్కృతం లో start అయ్యింది. ఎందుకో తెలీదు అతని కళ్ళల్లో నీళ్ళు, అర్జున్ కి తానె ఏడుస్తున్నట్టు అనిపించింది. ఒక వీరుడికి ఉండవలసిన గర్వం అతని కళ్ళల్లో ఇప్పుడు మాయమయ్యింది.

Countdown start అయ్యింది, శూన్యం (Zero) అంటూనే, అర్జున్ కి మెలకువ వచ్చింది. నిద్ర లేచిన అర్జున్ కళ్ళలో నీళ్ళు, ఎందుకు వచ్చాయో తనకి తెలియడం లేదు.

తెలతెల వారుతున్న ఆ సమయం లో, కోట దిగి కిందకి వచ్చాడు అర్జున్. అక్కడే చలిమంట చుట్టూ, కొంతమంది వీరులతో కూర్చున్నాడు రాజ గురువు. తన వైపే చూస్తున్న రాజ గురువు పక్కగా కూర్చున్నాడు అర్జున్. అర్జున్ కేసి మెరుపు నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు రాజ గురువు.

రాజ గురువు: భారతం చెప్పుకుంటున్నాము, వింటావా అర్జునా! (ఎంతో ప్రేమగా అడిగాడు రాజ గురువు. అర్జున్ తల ఊపాడు). మనుషుల బుర్రలపైన యుద్ధమనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. చరిత్ర ఎన్ని చెప్పినా, ఎంత వీరత్వాన్ని ప్రబోధించినా యుద్ధం చేసిన ప్రతి వీరునికి అంతః కరణ లో ఏదో ఒక బాధ, తప్పు చేసిన భావన ఇంచుమించు తప్పదు.

సాదివూ: (ఈ మధ్యలో తన సందేహాన్ని వెల్లడించాడు సాదివూ) మంచి కి చెడు కి మధ్య జరిగే యుద్ధానికైనా రెండువైపులా నష్టాలు తప్పవు. చెడ్డ వాని వైపు కూడా మంచి వాడు ఉంటాడు, అలాంటప్పుడు యుద్ధం ఎలా చెయ్యడం?

రాజ గురువు: నిజమే, భారతం లో శల్యుడు చావలేదా? ఎం, శల్య సారధ్యం వల్లనే కదా, కర్ణుడి ఆత్మ విశ్వాసం క్షీణించింది? భీష్ముడు, ద్రోణుడు, కొంతవరకు కర్ణుడు చెడ్డవాళ్ళంటే నమ్మడం కష్టం. ఒక మంచి కోసమని ఇంతమందిని చంపడానికి, ఇంత చెడు చెయ్యడానికి మనిషన్న వాడికి బాధే కదా? (రాజ గురువు చెప్పుకు పోతున్నాడు). అయితే శ్రీ కృష్ణుడు ఏమి బోధించాడు? మనుషులం, మనమెవరం? మంచి చెడ్డలు ఎంచడానికి మనమెవరం, అంతా ఆ పరమాత్ముడే చూస్తాడు, మన పని అల్లా దేవుడు మనకిచ్చిన గమ్యాన్ని చేరుకోవడమే! (అర్జున్ కేసి తిరిగి నవ్వుతూ అన్నాడు).

అర్జున్ కళ్ళలో ఎందుకో నీళ్ళు, అతనికి అర్ధం కావడం లేదు, బాధ ఎక్కడినించి వస్తోందో? అలాగని యుద్ధం అంటే భయం లేదు అతనికి, జరగబోయేది తలచుకుంటే, అందరి ప్రాణాలకి తన ప్రాణం అడ్డు వేద్దాం అనిపిస్తోంది, కాని పని జరగదే?

తెల్లవారుతూండగానే, గస్తీ కి కూర్చున్న సాదివూ తదితర వీరులు వెళ్ళిపోయారు. తనకి వచ్చిన కల గురించి చెప్దామనుకున్నాడు అర్జున్. అతని కేసి తిరిగి, నవ్వుతూ తను ఇందాక చెప్తున్నది continue చేస్తున్నట్టుగా అన్నాడు రాజ గురువు.

రాజ గురువు: (అర్జున్ భుజం మీద చెయ్యి వేసి) సత్యానికి ధర్మానికి నిలబడే ధర్మరాజు అంతటి వాడే "అశ్వద్ధామ హతః, (కుంజరః)" అని అబద్ధం చెప్పాడు. ఇంద్రుడు, అర్జునుడి తండ్రి (చిన్నగా నవ్వుతూ...) కర్ణుడి వద్ద, మాయోపాయం తో యాచించవలసి వచ్చింది. మంచి యందు నమ్మకం తో బ్రతికేది మనుషులే, వాళ్ళనే ఈ యుద్ధాలు బాధిస్తాయి. దేవుడైన శ్రీ కృష్ణుడు, తత్వాన్ని చెప్పాడు కాని, మనుషుల బాధను నివారించలేడు గా?!
(కళ్ళు మూసుకుని కృష్ణుడికి నమస్కరించాడు రాజ గురువు).

రాజ గురువు: (కొంత సేపు కళ్ళు మూసుకుని ప్రార్ధించి..., మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న అర్జున్ కేసి క్రీగంట చూసి, గమనించి) నువ్వు ప్రయోగించినది బ్రహ్మశిరో నామకాస్త్రం, నాలుగు  బ్రహ్మాస్త్రాల పెట్టు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన చోట, అప్పటి జన నష్టం మాత్రమె కాకుండా, ఎన్నో దీర్ఘ కాలిక ప్రభావాలు ఉంటాయని, ముఖ్యంగా అక్కడ కొంత కాలం వరకు పంటలు పండవని, భూమి నిస్సారమౌతుందని, పిల్లలు పుట్టరని, పుట్టిన వాళ్ళు వికారంగా పుడతారని చెబుతారు.

అర్జున్ కి ముందు పూర్తిగా అర్ధం కాలేదు, ఆతర్వాత తన కల గురించే చెప్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాడు. రాజ గురువు, అదేమీ పట్టించుకోకుండా చెప్తున్నాడు.

రాజ గురువు: ప్రస్తుతం ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం, అటువంటి నాలుగు బ్రహ్మాస్త్రాలని తీసుకు వెళుతోంది. కౌరవుల ఆధీనం లో ఉన్న నాలుగు చిట్టచివరి నగరాల పైకి ఆ అస్త్రాలని సంధించారు పాండవులు. అవే గనుక ఆ నగరాల మీద పడితే, కౌరవులతో పాటు, సామాన్య ప్రజానీకం కూడా భయంకరంగా చస్తారు. అన్ని తెలిసి, అన్న గారు యుధిష్ఠిరుని ఆజ్ఞ మీద, ఈ పని చెయ్యక తప్పలేదు నీకు. ఐతే, ఇదే సమయంలో దుర్యోధనుడి ప్రోద్బలం మీద, అశ్వత్థామ అదే అస్త్రాన్ని తమపై సందిస్తున్నాడని తెలియదు పాండవులకి.

రాజ గురువు: నిజానికి కౌరవులు ఈ అస్త్రాన్ని ముందే ప్రయోగించారు. ఈ రెండు అస్త్రాలని ప్రయోగించినట్టు దివ్య దృష్టి (prediction technology అనుకోవచ్చు, మన భాషలో) ద్వారా తెలుసుకొన్న వశిష్టుడు, ఇద్దరికీ ఆ అస్త్రాలని ఆపమని వర్తమానం పంపించాడు.

అది విన్నాక నీవు వెంటనే, ఆ నాలుగు అస్త్రాలని ఉపసంహరింపచేసావు. ఐతే, తన గర్వం కోసం సమస్త ప్రపంచాన్ని నిర్లక్ష్యం చెయ్యగల సుయోధనుడు మాత్రం, అంత త్వరగా ఇది పడనివ్వలేదు. అశ్వత్థామ చేత మూడే ఉపసంహరింప చేయించాడు అతడు. నాలుగో అస్త్రాన్ని మటుకు, బభ్రువాహనుడు ఉన్న కన్యాకుబ్జం వైపు సంధించాడు మానధనుడు, దుర్యోధనుడు. అతనికి తన చావు సమీపించిందని తెలుస్తూనే ఉంది, కాని పాండవుల వంశోద్దారకుని హత్య చెయ్యదలిచాడతడు. అందుకే నీ కుమారుడు అభిమన్యుని విధవ (Widow), ఉత్తర, కడుపులో పెరుగుతున్న భ్రూణాన్ని చంపదలిచాడతడు. అతనే ప్రస్తుత పాండవ వారసుడు కాబట్టి, ఆ పసి కందుని చంపడం ద్వారా పాండవ వంశాన్ని చెయ్యగలిగినంత మట్టు పెట్టాలన్నదే అతని ధ్యేయ౦. ప్రస్తుతం, నెలలు నిండిన ఉత్తర తన బావగారైన బభ్రువాహనుని సంరక్షణలో ఉంది. సరిగ్గా ఆమె ఉన్న కన్యాకుబ్జం వైపు వెళ్తోందా అస్త్రం.

ఏదో తెలిసినట్టు, తెలియనట్టు అనిపిస్తోంది అర్జున్ కి. చూసినట్టుగా అనిపిస్తోంది, కాని పూర్తిగా గుర్తుకిరావడం లేదు. నమ్మాలనే ఉంది, కాని నమ్మబుద్ది వెయ్యడం లేదతనికి. చెప్పింది సగం విని సగం వదిలేసానా అనిపించింది అతనికి, కాని మొత్తం అంతా ఏదో చూసినట్టు, గుర్తుగా ఉంది. ఆ సందిగ్ధం లో ఎలాగో అక్కడినించి కదిలాడు అతను.

-- (సశేషం) --

అర్జునుడు - V


శైలజ పెద్ద గావు కేక పెట్టింది. అర్జున్ ని కుదుపుతూ, గట్టిగా అరుస్తూ, ఒక చేత్తో చచ్చి పడున్న మృత దేహాలకేసి చూపిస్తూ ఉంది. అర్జున్ ని hysterical గా అదే పనిగా కుదుపుతోంది. లేచిన అర్జున్, తన ఊపుకి కింద పడిన తన కళ్ళజోడు తీసుకుని, ఏంటన్నట్టు చూసాడు. తనే చంపిన మృత దేహాలు కనిపించడం తో, కొద్దిగా ఖంగారు పడ్డాడు అర్జున్. తమాయించుకుని చూస్తున్న అతనితో,

శైలజ: Sorry! (క్షమించమన్నట్టు అనునయం గా అంది).

అతనికేసి మాట్లాడుతున్న శైలజకి అర్జున్ shirt మీద వీపు పైన, ఒక పెద్ద రక్తపు మరక కనిపించింది. అనుమానం, భయంతో అతనికేసి చూస్తూ,

శైలజ: ను... ను... ను... నువ్వే, నువ్వే చంపావు, ను.. ను... ను... నువ్వే!? (భయ౦ తో నోట మాట రావడం లేదు తనకి, పైగా నమ్మ బుద్ది వెయ్యడం లేదు).

ఔనన్నట్టు, తల దించుకున్నాడు అర్జున్. ఈ సారి శైలజ ఇంకా గట్టిగా అరిచింది.

- 2 -
చాలా సేపు అతనికి దూరం గా కూర్చుంది శైలజ. అతను తను చూసిన అర్జున్ అయితే కాదు, ఎందుకో అంతా తెలిసి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అనిపిస్తోంది. మోసగాడు, హంతకుడా అంటే, అతని మొహం చూస్తే, అలా అనిపించడం లేదు. ఇందాకటి నించి చూస్తోంది, అర్జున్ మొహంలో ఎందుకో acceptance కనిపించడం లేదు, కొద్దిగా బాధపడుతున్నట్టు ఉంది, ఆ dead bodies కేసి అర్జున్ చూసినప్పుడల్లా. చివరికి అతను అమాయకుడే అని నమ్మింది శైలజ.

శైలజ: (అతని దగ్గరగా వెళ్లి) ఎందుకు చంపావ్, attack చేసారా? (మెల్లగా అడిగింది. అర్జున్ అవునన్నట్టు తల పంకించాడు. అతను ఏదో తప్పు చేసినట్లు తల దించుకునే ఉన్నాడు)

శైలజ: ఎ... ఎలా చంపావ్? (ఈ సారి కొంచెం determined గా గట్టిగా అడిగింది. అర్జున్ కొంచెం సేపు అలాగే ఉండి, తల అడ్డం గా ఊపాడు).

- 3 -
ఇంత సేపూ మాట్లాడుతున్న శైలజకి అర్జున్ harmless అని నమ్మకం కుదిరింది.

శైలజ: జేమ్స్ బాండా, spy కదా, జేమ్స్ బాండ్ కదా? (అడిగింది దించిన అర్జున్ మొహంలో మొహం పెట్టడానికి ప్రయత్నిస్తూ. అర్జున్ అడ్డం గా తల ఊపాడు)

శైలజ: (తనే మళ్ళీ) ఎందుకు చెప్పడం లేదు, చెప్తే చంపేస్తారు కదా, అందుకే చెప్పడం లేదు, (కొంచెం సేపాగి) కదా? (అడిగింది)

అర్జున్: (కళ్ళల్లో నీళ్ళతో, face పైకెత్తి) గుర్తుకు రావడం లేదు (గట్టిగా అరిచాడు. మళ్ళీ తనే తల పట్టుకుని, ఈసారి కాస్త మెల్లగా) గుర్తుకు రావడం లేదు, అంతే.

శైలజ: (అర్జున్ దగ్గరికి వచ్చింది, అతని జుట్టులో వేళ్ళని పోనిస్తూ) అయితే గుర్తుకి తెచ్చుకోవడానికి try చెయ్! (అనునయం గా చెప్పింది)

అర్జున్ కళ్ళు మూసుకుని అంతా గుర్తు తెచ్చుకోవడానికి try చేస్తున్నాడు. అంతా గుర్తుకి వస్తున్నట్టే ఉంది, కాని బల్లెం తో తను పొడిచిన scene గుర్తుకి రావడంతోటే, అతనికి చాలా భయం వేస్తోంది. అమాంతం కళ్ళు తెరుచుకుంటున్నాయి. భయం తో heart-beat పెరిగి, ఆందోళనగా లేస్తున్నాడతను. మళ్ళీ శైలజ ని చూసి, కళ్ళు మూసుకుంటున్నాడు అతను.

ఇదంతా సముద్రం కేసి చూస్తున్న శైలజ గమనిస్తూనే ఉంది. ఓహో, అన్నట్టుగా కొంచెం కనీ కనిపించనట్టు తల పైకెత్తి, మళ్ళీ దించింది.

- 4 -
ఆ దీవిలోఅవతలి వైపు ఉన్న ఆటవికులలో కలకలం నెలకొంది. శత్రు వేగులను చంపుతామని వెళ్ళిన యువరాజు, అతని సహాయకులు, ఇద్దరు మెరికల్లాంటి యోధులు ఇంకా రాలేదు. సమయం, రాత్రి కావస్తోంది. ఎంత late అయ్యినా ఈ మధ్యాన్నానికి వచ్చి ఉండాలి మరి.

రాజ గురువు: (ఇతడిని రాజే పిలిపించాడు. Trance లో ఉన్నట్టు ఊగుతున్నాడు అతను). యువరాజు అదుల్య వీర, మరణించాడు. (Announce చేసాడు)

ఈ మాట వింటూనే, ఆత్రుతగా నిలబడి చూస్తున్న, రాజు తన సింహాసనం లో కూలబడ్డాడు.

రాజ గురువు: (మళ్ళీ తనే), అతని వెంట వెళ్ళిన ఇద్దరు వీరులు కూడా మృత్యు వాత పడ్డారు. మహావీరుడైన అతనిని ఎదిరించి, తమ చావు తామే కొని తెచ్చుకున్నారు.

ఇంతలో ఒక వేగుల వాడు, సాదివూ (సహా దేవుడు) వచ్చాడు.

సాదివూ: మహారాజులకి ప్రణామాలు! దుర్వార్త మోసుకు వచ్చినందుకు క్షంతవ్యుడ్ని. (కొద్దిగా రాజు గారి కేసి చూసి, మళ్ళీ కళ్ళు వంచాడు. అతడు మొత్తమంతా తల వంచుకునే ఉన్నాడు.) యువరాజు అదుల్య వీర, అతని సహాయకులు ఉ౦పకతి, ఆర్కేబు వీర స్వర్గాన్ని పొందారు. (ఇంకా చెప్పబోతున్న అతడిని, తన చెయ్యి చాపి, ఆగమని సైగ చేసాడు రాజు. వెళ్ళమని చేతి సౌజ్ఞ తో చెప్పాడు. అతడు వెళ్ళిపోయాడు).

రాజుకి ఈ మాటలేమి రుచించడం లేదు. కళ్ళల్లో నీళ్ళు, ఎలాంటి వాడైనా తన కొడుకు చావుని జీర్ణించుకోలేక పోతున్నాడు.

రాజ గురువు: (Trance లోంచి లేచాడు. రాజు దగ్గరకి వెళ్లి,) రాజా! బాధ పడకు, వీర లక్షణం కాదు. (భుజం తట్టాడు)

మరో వైపు చూస్తూ, హఠాత్తు గా రాజ గురువు కళ్ళు ఎర్రబారాయి.

రాజ గురువు: అయినా, వీరుడై వీర ధర్మాన్ని మరచిన వాడు, మరు క్షణమే చచ్చిన వాడితో సమానం. నీ కొడుకు చావుతో, మన రాజ్యానికి పట్టిన గ్రహణం వీడి పోయింది, అందుకు సంతోషించు! (ఉపదేశించి నిష్క్రమించాడు).

తల దించుకుని ఉన్న రాజు, రాజ గురువు మాటలకి తల పంకించాడు. అది నిజమని తనకి తెలుస్తూనే ఉంది. కాని ఎందుకో తన కొడుకు చావుని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆలోచిస్తున్న రాజు కళ్ళు ఎర్రబారాయి. బాధ, నిస్సహాయత గా, అది ప్రతీకారేచ్చ గా పరిణమించింది.

తన సైన్యం లోంచి, మెరికల్లాంటి యోధులని తనకు తానే ఎంచాడు రాజు. ఒక్కొకడూ ఆరడుగుల పొడవు తో, విశాలమైన ఛాతి, కండలు తిరిగిన దేహంతో ఉన్నారు. తన సైన్యం లో సగం మందిని, ఎవ్వరికీ తెలియకుండా, చివరికి రాజ గురువు కి కూడా చెప్పకుండా, ఎంచాడు రాజు. అప్పుడు సమయం రాత్రి 8 (మన భాష ప్రకారం) కావస్తోంది. తన కొడుకుని చంపినవాడి చావు తనే దగ్గరుండి చూడాలనుకున్నాడు, అందుకే ఎవ్వరికీ చెప్పకుండా తను కూడా ఆ సైన్యం తో బయలుదేరాడు రాజు.

- 5 -
అప్పుడు సమయం తెలతెల వారుతోంది. అర్జున్ కి సడన్ గా మెలకువ వచ్చింది. అతని తో పాటే లేచిన శైలజ,

శైలజ: ఏ.. ఏమైంది అర్జున్!
అర్జున్: (మాట్లాడద్దు అన్నట్టు గా, నోటి మీద వేలు ఉంచి) ఉష్!

పొదల్లోకి చూస్తున్న అర్జున్ కేసి, మళ్ళీ పొదల్లోకి కొంచెం బెరుగ్గా మార్చి మార్చి చూస్తూ, శైలజ

శైలజ: ఎవరైనా ఉన్నారా... (కొంచెం తలెత్తి చూస్తూ) ... అక్కడ?

అర్జున్ ఏమి మాట్లాడకుండా నే ఉన్నాడు. ఒక్క సారిగా, పైకి లేచి, శైలజ ని అమాంతం ఎత్తి, దూరంగా ఉన్న ఒక రాయి చాటున కూర్చోబెట్టాడు. ఆమె ఎవరికీ కనిపించకుండా కింద పడి ఉన్న కొబ్బరాకులు కొన్ని మీద కప్పాడు. శైలజ అక్కడ ఉన్నట్టు ఎవరికీ కనిపించదు కాని, ఆ ఆకుల సందుల్లోంచి శైలజకి అంతా కనిపిస్తూనే ఉంది. తను  ఏదో అనబోయి భయంగా ఆగిపోయింది. అప్రయత్నం గా కొంచెం ఆకుల నించి దూరంగా, లోపలకి జరిగింది శైలజ.

శైలజ ని అక్కడ ఉంచి, ఒక్క ఉదుటన వెనక్కి తిరిగాడు అర్జున్. కొంచెం దూరం పెద్ద అంగలతో వెళ్లి, అక్కడ ఇసుకలో పడిఉన్న ఒక పెద్ద డాలు ని తీసాడు, అది నిన్న చనిపోయిన అదుల్య వీరది.

అర్జున్ ఇది చేస్తుండగానే ఆకాశం లో రివ్వున బాణాలు ఎగిసాయి. అర్జున్ ఆ పెద్ద డాలుని పైకి తీసి, round గా గాలిలో తిప్పుతూ తన తల మీద రెండు చేతులతో పట్టుకున్నాడు. ఆ శరపరంపర, ఆగడంతోటే ఉ౦పకతి లాంటి కొందరు యోధులు, కత్తి డాలుతో ఇంకొందరు వేగంగా పరిగెత్తుకుంటూ అర్జున్ దిశగా వస్తున్నారు. గాలిలో నిశ్శబ్దం ఆవరించింది. అర్జున్ వాళ్ళ కేసి చూస్తూ ఒక సారి, శైలజ ఉన్న వైపుకి తిరిగాడు. ఆకుల సందుల్లోంచి చూస్తున్న శైలజ, భయం భయం గా అర్జున్ కేసి చూసింది. ఎందుకో తల కొద్దిగా ఊపింది తను.

అర్జున్ ఇలా చూస్తుండగానే, ఇంకొందరు విలుకాళ్ళు ముందుకి వచ్చారు. వారి వెనక కాగడాలు పట్టుకుని కొందరు కనిపిస్తున్నారు. వారి దగ్గరే ఉన్న రాజు, అశ్వారూడుడై ఉన్నాడు. వీళ్ళందరి ని చూస్తూ, గట్టిగా అరుస్తూ, అర్జున్ కేసి తన కత్తి చూపిస్తూ ఉన్నాడు అతను.

అర్జున్ ఇంకొంచెం ముందుకి వెళ్లి, నేలలో ఉన్న రెండు బరిసెలని తీసాడు, డాలుని కింద పడేస్తూ.యుద్ధం భయంకరం గా జరుగుతోంది. ఇప్పుడు అర్జున్ పూర్తి స్థాయి aggressive గా fight చేస్తున్నాడు, అవును మరి, ఇంతమంది తో యుద్ధం చేస్తూ, ఎవరినీ చంపకుండా ఉంటే కష్టం కదా. అర్జున్ మాత్రం సర్వ శక్తులూ ఒడ్డి పోరాడుతున్నాడు.

యుద్ధం మెల్లగా అర్జున్ వైపు మొగ్గుతోంది, లెక్కకు మిక్కిలి వీరాగ్రేసరులు మరణించారు. తన వద్ద ఉన్న వీరులు, అర్జున్ కేసి వెళ్ళడానికి తటపటాయించడం చూసి, రాజుకి ఎక్కడలేని రోషం వచ్చింది. గుర్రం దిగి, తనంతట తానె, అక్కడ ఉన్న ఇద్దరు వీరులని చంపాడు. పెద్ద పెట్టున పెడబొబ్బ పెడుతూ, అర్జున్ కేసి పరిగెడుతూ వచ్చాడు. అతడిని చూసి అక్కడ ఉన్న వీరులు దారి ఇచ్చి పక్కకి తప్పుకున్నారు.

రాజుతో యుద్ధం జరుగుతోంది. ఇదివరకటి యుద్దాల లాగ లేదు ఇది. ఇద్దరూ, చాలా technique తో fight చేస్తున్నారు. అర్జున్ కి fight లో ఎంత ease ఉందో, ఆ రాజుకి కూడా అలాగే ఉంది. వీళ్ళిద్దరూ ఇలా ఎంత కాలం యుద్ధం చేస్తూ ఉన్నారో తెలియదు, అప్పటికి చాలా సేపు అయ్యింది. అయితే రాజుతో యుద్ధం మొదలు పెట్టినప్పుడు, ఈదురు గాలితో పెద్ద వాన పట్టుకుంది. ఇంచుమించు (మన భాషలో) 11 కావస్తున్నా, గాలి వానకి మబ్బులకి ఎక్కువ light కనిపించడం లేదు. ఏదో ఇదివరలో జరిగిన ప్రళయం తాలూకు సంకేతం లాగ, తుఫాను. హోరు గాలి వీస్తోంది, మెరుపులు ఉరుములు, పిడుగుల ధ్వనులు.

ఇద్దరూ యుద్ధం చేస్తూ, తీరాన్ని దాటి అడవి ప్రాంతం లోపలకి వెళ్లారు. అర్జున్ కి ఏమవుతుందో అని, భయంతో శైలజ కూడా, అటు వైపుగా వెళ్ళింది, మిగిలిన వీరుల కంట్లో పడకుండా ఎలాగో. అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రాంగణం మీద యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. చుట్టూ అన్ని వైపులా కాగడాలు పెట్టి ఉన్నాయి. వెనకగా, ఆటవికుల గుడి అనుకుంటా, ఉంది.

శైలజ కి చాలా ఆశ్చర్యం గా ఉంది. అసలు "ఇతనేనా తను ఇదివరలో చూసిన అర్జున్" అని తనకి చాలా సార్లు అనిపిస్తోంది. అంత ప్రళయ భీకరమైన వాతావరణం లో అస్సలు అదేమీ లేదన్నట్లుగా అర్జున్ fight చెయ్యడం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది తనకి. తనకి ఎవరు ఎవరో సరిగ్గా కనిపించడం లేదు కూడా, కళ్ళు చిట్లించుకుని చూస్తోంది. ఇంతలో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో, ప్రశాంతమైన అర్జున్ ముఖం శైలజ కి కనిపించి౦ది. అతని ముఖం లోని రాజసం, దర్పం ఆమెకి అప్పుడు పొడగట్టాయి. ఆ మెరుపుల వెలుగులో వెండిలా తళుక్కున మెరిసిన అతని రూపాన్ని అలా చూస్తూ బొమ్మలా ఉండి పోయింది తను.

చివరకి యుద్ధం లో రాజు ఓడిపోయాడు, అలిసిపోయి రొప్పుతూ ఆ ఎత్తైన పీఠం లో ఒక వైపుగా ఉండిపోయాడు. ఇంతలో, చాలా మంది ప్రజలతో రాజ గురువు అక్కడికి చేరుకున్నాడు. వీళ్ళందరినీ చూసి, శైలజ భయంగా, అర్జున్ పక్కకి వచ్చి నిలబడింది. రాజ గురువు జరిగిన దాన్ని అర్ధం చేసుకున్నాడు. అర్జున్ దగ్గరకి వచ్చి,

రాజ గురువు: (తన భాషలో ఏదో అడిగాడు. అర్జున్ కి అర్ధం కాలేదు. అది గమనించి రాజ గురువు) సాదివూ! (దూరం గా ఉన్న సాదివూ ని పిలిచాడు. సాదివూ దగ్గరికి వచ్చాడు. వాడిని మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు రాజ గురువు).

సాదివూ (సహ దేవుడు): (తల దించుకుని, చేతులు కట్టుకుని) సాదివూ! (చెప్పాడు)

రాజ గురువు, అర్జున్ కేసి తిరిగి, ప్రశ్నార్ధకం గా కళ్ళు ఎగరేసాడు.

శైలజ: (అర్జున్ తో, low voice తో) ఏంటి?

అర్జున్: పేరడుగుతున్నారు, (రాజ గురువు కేసి తిరిగి) అర్జున్! (చెప్పాడు)

రాజ గురువు, పేరు వినడం తోటే, తన ప్రజానీకం కేసి తిరిగి, ఏదో announce చేసాడు. ఒక చెయ్యి మంత్ర దండం మీద పెట్టి, ఇంకో చేతితో అర్జున్ కేసి చూపిస్తూ ఏదో చెప్తున్నాడు అతను.

అయితే, ఇదంతా దూరం నించి చూస్తున్న రాజు, ఉండబట్ట లేక పోయాడు. అర్జున్ ని చంపడానికి, వేగం గా తన కత్తి తోటి దూసుకు వచ్చాడు. అర్జున్ తప్పించుకున్నాడు కాని, శైలజ చెయ్యి చీరుకు పోయింది. ఇది చూసి, అక్కడ ప్రజానీకం లో ఒకడు, తన గొడ్డలి తో రాజు ని చంపేసాడు. వాళ్ళ దీవి ఆచారం ప్రకారం, రాజు ని యుద్ధం లో ఓడించిన వాడికి, రాజు తన రాజ్యాన్ని అప్పగించాలి. ఇది చెయ్యకపోగా, దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన రాజుని, ఆ దీవి ఆటవికులు చంపేశారు.

ఇంతలో ప్రజ తో ఏదో మాట్లాడుతున్న రాజ గురువు,


రాజ గురువు: అర్జున, వీరార్జున! (అర్జున్ కేసి చూపిస్తూ అన్నాడు).

అర్జున్ నివ్వెరపోయాడు.ఆ దీవి ఆచారం ప్రకారం, వాళ్లకి ఇప్పుడు అర్జునే రాజు. ఆ కాగడాల వెలుగులో, అశేషమైన ప్రజానీకం అర్జున్ కి మోకరిల్లింది.

-- (సశేషం) --

అర్జునుడు - IV


    కళ్ళు తెరిచిన శైలజకి దూరంగా అర్జున్ కనిపించాడు. ఒక గుడ్డ సంచీ లో, కొన్ని పళ్ళు తీసుకు వస్తున్నాడు అతను, చేతిలో ఒక కర్ర. ఎదురుగా చలి మంట వేసి ఉంది. అప్పుడు బహుసా రాత్రి 7-8 అయ్యి ఉంటుంది.

    రివ్వు రివ్వున కెరటాలు ఎగుస్తున్నాయి. శైలజ, అర్జున్ పక్క పక్కగా కూర్చున్నారు. శైలజ అర్జున్ ఇద్దరూ కూడా, మోకాళ్ళలో మొహం దాచుకున్నట్టు కూర్చున్నారు. Sudden గా తల పైకెత్తి శైలజ అంది,

శైలజ: It's ok అర్జున్. బతికే ఉన్నాం కదా. పైగా land మీదే ఉన్నాం, ఏమి పరవాలేదు లే. (పరవాలేదు అంటున్నప్పుడు ఆమె గొంతు వణికింది. కొంచెం సేపాగి మళ్ళీ తనే), అయినా flight లో అందరూ పోవడమేంటి, మనం ఇద్దరమే ఉండటం ఏంటి? పైగా ఇంక దొరకదేమో అనుకుంటూ ఉంటె, land దొరికింది.

అర్జున్ కొంచెం confidence తెచ్చుకుని, ఆమె కళ్ళల్లోకి చూసాడు. అతను తన కళ్ళల్లోకి చూడటం గమనించి,

శైలజ: (కళ్ళు పెద్దవి చేసి) కదా! (కన్విన్సు చేస్తున్నట్టు అంది. అర్జున్ ఏమి మాట్లాడలేదు, తల దించుకుని మళ్ళీ ఇంకో వైపు తిరిగాడు. శైలజే మళ్ళీ), ఇంత హెల్పు చేసిన వాడు, తప్పకుండా మనల్ని ఇంటికి చేరుస్తాడు లే. (నిర్లిప్తం గా పూర్తి చేసి, తల కిందకి దించుకుంది. మళ్ళీ తల పైకెత్తి), అయినా I like it here అర్జున్, అయినా ఎవరికైనా ఇంత మంచి honeymoon దొరుకుతుందా చెప్పు, అందరికీ దూరంగా, nature మధ్యలో! (కళ్ళల్లో మెరుపుతో).

ఇద్దరూ, తీరాన్ని తాకి బద్దలౌతున్న మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్న అలల్లా, మొక్కవోని ఆత్మవిశ్వాసం తో ఉన్నారు.

-2-

ఆ ద్వీపానికి రెండో వైపున, ఒక ఆటవిక జాతి ఉంది. ఆ ఆటవిక మాంత్రికుడు (రాజగురువు కూడా) trance ఉన్నట్టుగా ఊగుతున్నాడు. ఎదురుగా ఒక మంట మండుతూ ఉంది.

రాజగురువు: మన ద్వీపానికి అవతలి వైపు ఇద్దరు వింత మనుషులు దిగారు, ఒక ఆడా ఒక మగ. వారి వేష భాషలు, చాలా విచిత్రం గా ఉన్నాయి. (ఈ మాట వింటూనే, యువ రాజు "అదుల్య వీర" ఆసనం లోంచి లేచాడు).

యువరాజు: అయితే, ఆ శత్రు వేగులను ఇప్పుడే సంహరించి వస్తాను. (తన సహాయకులు ఇద్దరికే సౌజ్ఞ చేసాడు, ఇద్దరూ అతన్ని అనుసరించి ముందుకి కదిలారు. అయితే trance లోంచి లేచిన రాజగురువు).

రాజగురువు: తప్పు యువరాజా, తప్పు. అతడు మహా వీరుడు, మహా శక్తి వంతుడు. అతడిని సంహరింప ప్రయత్నింపక, మన వైపు తిప్పుకొనుట మంచిది.

యువరాజు: హు, వీరుడు!! ఈ రాజ్యమున నా కన్నా వీరుడెవరు? ముసలివారు, చాదస్తాలు మానుకుని, దయచేయండి. మా మాటకు విలువ ఇచ్చిన మాకూ, మీకూ ఇద్దరకూ ఉచితము. (తన తండ్రి రాజు కి, రాజ గురువు కి ఒకేసారి warning ఇచ్చాడు. తన సహాయకులు ఆర్కేబు, ఉ౦పకతి తో వెళ్తున్న అతనిని ఆపే ధైర్యం ఆ సభ లో ఎవరికీ లేకపోయింది).

-3-

అప్పుడు సమయం తెలతెలవారుతోంది. చెట్ల చాటును౦చి, అదుల్య వీర, అతని సహాయకులూ చూస్తున్నారు. ఆ time కి, అర్జున్ శైలజ ఇద్దరూ నిద్రపోతూ ఉన్నారు. శైలజ అయితే గురక కూడా పెడుతోంది. నిన్నంతా అలసి పోయిందేమో, నిద్రలో దొర్లుకుంటూ దూరం గా ఉన్న ఒక పడిపోయిన చెట్టు కాండం కౌగలించుకుని పడుకుని ఉంది. చెట్లచాటు నుంచి ముగ్గురూ బయటకు వచ్చారు. ఉ౦పకతి కి signal ఇచ్చాడు అదుల్య వీర. ఉ౦పకతి చేతిలోకి ఒక బల్లెం తీసుకుని, గురి చూసి అర్జున్ మీదకి విసిరాడు.

అర్జున్ కి అప్పుడు, ఒక విచిత్రమైన కల వస్తోంది. ఇదివరకు వచ్చినట్టు గానే, రధం, అందులో నిండు చూలాలు, ఒక రాజు రధాన్ని నడపడం, పెద్ద తుఫాను వానలో, ఇదంతా వస్తోంది. వాళ్ళు రధం లోంచి దూకినప్పుడు, ఇదివరకు కలలో, తెల్లటి వెలుగు కనిపించింది అతనికి. ఈ సారి, వాళ్ళు ఇద్దరూ, ఒక గుడి ప్రాంగణం లో పడటం కనిపించింది. దానితో పాటు, గుడి గంటలు, ఈదురు గాలికి చాలా ఎక్కువగా మోగుతున్నాయి. ఈ భయ౦కరమైన శబ్దానికి అతనికి మెలకువ వచ్చింది. ఆ ఉత్తర క్షణ౦ లో తనపైకి వచ్చిన బల్లాన్ని అప్రయత్నం గా తన కుడి చేతితో పట్టుకున్నాడు అర్జున్.

ఉ౦పకతి, అదుల్య వీర కొంచం ఆశ్చర్యపడ్డారు. పైకి లేచిన అర్జున్ కి, తీవ్రమైన ఆయాసం గా అనిపిస్తోంది. శ్వాస తీసుకోవడం కష్టం గా ఉంది. పక్కనున్న కళ్ళజోడు తీసుకుని, పెట్టుకున్నాడు. తూలి పడబోయి, బల్లెం సహాయంతో నిలదొక్కు కున్న, అర్జున్ ని, అతని కళ్ళద్దాలని చూసి,

అదుల్య వీర: వీరుడు, మహా వీరుడు!? (అర్జున్ కేసి చూపిస్తూ, పరిహసిస్తున్నట్టు అన్నాడు. అతని నవ్వుతో మిగిలిన ఇద్దరూ కూడా శృతి కలిపారు).

అర్జున్ కి పెద్దగా ఏమి తెలియడం లేదు, నవ్వులు దూరం నించి వినిపిస్తున్నట్టు ఉన్నాయి. మనుషులు లీలగా కనిపిస్తున్నారు, ఆయాసం ఎందుకొచ్చిందో తెలియదు కాని, ఇప్పుడు తగ్గుతోంది కొంచం.

యధాలాపం గా, ఇంకొక బరిసె తీసుకుని, ఉ౦పకతి విసిరాడు నవ్వు ముఖం తో. అర్జున్ తన ఎడమ కాలు, కొద్ది గా వెనక్కి జరిపాడు. కుడి చేతిలో బల్లెం ఉంది. ఒక్క సారి గా, మడమ rotate చేసి, ఎడమ వైపుకి తిరిగాడు. ఉ౦పకతి విసిరిన బల్లెం అర్జున్ చొక్కా గుండీలని తాకుతూ వెళ్ళిపోయింది. అర్జున్ shirt button ఒకటి, దారం తెగడంతో, నేలమీద పడింది.

కొంచం disappoint అయ్యిన, అదుల్య వీర, ఉ౦పకతి ని తొందర చేసాడు.ఈ సారి, కొంత దూరం పరిగెత్తి, గాలిలో ఎగిరి (నేలకి సమాంతరం గా బాడీ ఉంచి), round తిరుగుతూ ఒక angle లో ఉన్నప్పుడు, చేతిలో ఉన్న బరిసె విసిరాడు ఉ౦పకతి.

అర్జున్ కి మాత్రం ఏమి చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో తెలియడం లేదు. సరైన సమయానికి ఎలాగో, ఆయుధం గుండెల్ని చీల్చకుండా తప్పించుకోగలుగుతున్నాడు అంతే. చచ్చిపోతానేమో అనే భయం తో, అతనికి శ్వాస లయ తప్పుతోంది.

ఈ సారి అర్జున్ ఉ౦పకతి ని face చేస్తూ తిరిగాడు. తన ఎడమ కాలిని ఇంకా వెనక్కంతా జరిపి, ఒకే సారి, కుడి కాలి మోకాలి మీద కూర్చున్నాడు (పరుగుపందెం లో భంగిమ లాగ). ఈ సారి ఉ౦పకతి బల్లెం అతని తల వెంట్రుకలని రాసుకుంటూ వెళ్ళిపోయింది.

ఉ౦పకతి కి, అదుల్య వీరకి, ఆర్కేబు కి ఆశ్చర్యానికి అంతు లేదు. ఉ౦పకతికి చెందిన, ఒక అద్భుతమైన విన్యాసమది. అసలా బల్లెం ఏ angle లో విసురుతాడో, ఎప్పుడు విసురుతాడో, మహా వీరులకి కూడా చెప్పడం బహు కష్టం. అటువంటిది, సునాయాసం గా, దాన్ని అర్జున్ తప్పించుకోవడం తో, తమ ఆశ్చర్యాన్ని దాచుకోలేక పోయారు.

రివ్వున గాలి వీచింది. ఆ ప్రదేశం అంతా, ఒక సారి పూనకం వచ్చినట్టు ఊగింది. దూరంగా, ఒక నీటి చెలమలో నీటి బిందువులు పడుతున్న శబ్దం, గడుస్తున్న సమయాన్ని కొలుస్తున్న గడియారపు శబ్దం లా ఉంది. అర్జున్ కి ఇంకా అంతా బాగా కనిపించడం లేదు, ఆయాసం ఇప్పుడే కొద్దిగా తగ్గినట్టు ఉంది. ఆయాసం తగ్గించుకుని, లేచి నిలబడ్డాడు.

ఉ౦పకతి తన చిట్టచివరి విన్యాసాన్ని ప్రదర్శించాడు. పరిగెడుతూ, నెల బారుగా వంగి, ఒక బల్లెన్ని విసిరాడు. ఆ విసిరిన చేతిని, నేలపై ఆనించి, direction మార్చుకుని, రెండో చేతిలోని బల్లేన్ని ఇంకో దిశనించి విసిరాడు. విసిరి, నెల పైన పడి, round గా దొర్లుతూ, అర్జున్ నించి దూరంగా జరిగాడు.

ఇది చాలా పరిచయం ఉన్నట్టుగా, చేతిలోని తన బల్లేన్ని, ఒక angle లో తిప్పి, రెండిటినీ ఒకే సారి అడ్డుకున్నాడు అర్జున్. దూరంగా లేచి నిలబడిన ఉ౦పకతి, ఇంకా దూరంగా తన మిత్రుల వైపు పరిగెత్తాడు. ఇంక లాభం లేదని,  ఉ౦పకతి చేతిలో రెండు చిన్న బరిసెలని తీసుకున్నాడు. అర్జున్ కి ఇందాకటి ఆయాసం అయితే తగ్గింది గాని, అప్పుడప్పుడూ శ్వాస లయ తప్పుతోంది.

అర్జున్ వైపు తిరిగి, కుడి చేతి బల్లేన్ని, కింద నించి పైకి ఏటవాలుగా కదిపాడు, ఎడమచేతి బల్లెం తో, కొంచెం horizontal angle లో పైనించి కింద వైపు, ఎడమ వైపు నించి అర్జున్ మీదకి దాడి చేసాడు.

- 4 -

అర్జున్ అన్నింటినీ తప్పించుకుంటున్నాడు. యుద్ధం భయంకరం గా జరుగుతోంది. చాలా concentration తో ఫైటింగ్ చేస్తున్నాడు అర్జున్. ఇదివరకు గుండెలదాకా వచ్చిన ఆయుధాన్ని చూసి, గుండె లయ తప్పేది, కాని ఇప్పుడు మాత్రం అలా కావడం లేదు. మెల్లగా తన ఆయాసం, గుండె లయ తప్పడం పోయాయి. అతని కళ్ళల్లో,  ఉ౦పకతి, అతని చేతిలోని ఆయుధం మాత్రమే కనిపిస్తున్నాయి, మిగిలిన ప్రపంచం అతని దృష్టిలో లేనట్లే. అంత ఏకాగ్రతతో యుద్ధం చేస్తున్నాడు అతను.

చాలా సేపయ్యింది. అక్కడి తెలతెలవారుతున్న lighting కొంచం, చాలా కొంచం improve అయ్యింది. సూర్యుడు, కదిలితే ఈ యుద్ధం ఎక్కడ miss అవుతానో అన్నట్టు, ఉదయిస్తున్నట్టుగానే ఉండిపోయాడు. గాలి వీచడం ఆగిపోయింది. తెల్లవారే సమయం లో అటూ ఇటూ తిరిగే పక్షులు ఎక్కడా కనిపించడం లేదు.

కొంత సమయం అయ్యాక, ఉ౦పకతి ఆగిపోయాడు, రొప్పుతూ ఉండిపోయాడు. అర్జున్ కి మాత్రం అంత ఆయాసం లేదు, గట్టిగా గాలి పీల్చి కొద్దిగా ఉమ్మాడు అంతే. ఇక చిట్ట చివరి ప్రయత్నం చేసిన అతడు, అప్రయత్నంగా వెళ్లి దూరంగా నేల పైఉన్న, బరిసె మీద పడ్డాడు. కోసుగా ఉన్న ఆ బరిసె మొన, తన కంఠాన్ని కోయడంతో, అప్పటికప్పుడే చనిపోయాడు అతను.

నిజానికి, అర్జున్ తన ఫైటు లో, ఉ౦పకతిని గాయ పరచడం లేదు. తన బల్లెం తో, చాలా సార్లు ఉ౦పకతిని పొడిచే భంగిమ లో ఉండి కూడా, చివరి వరకూ తీసుకు రాలేదు అతను. అతనికి నిజం చెప్పాలి అంటే, కొంచెం అయోమయం గానే ఉంది. అసలీ ఫైటు లో తనకి ఇంత talent ఎలా ఉందొ, అతనికే అర్ధం కావడం లేదు. పైపెచ్చు, ఫైటు లో ఏకాగ్రత మాత్రం వచ్చేస్తోంది, ఏదో సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడినట్టు. ఎందుకు వస్తోందో అర్ధం కావడం లేదతనికి. అసలు ఇప్పటి వరకూ చాలా భయపడినవన్నీ ఇప్పుడు, ఇంత ఈజీ గా ఎందుకు అనిపిస్తున్నాయి?

ఈ సారి అదుల్య వీర నోట్లో నములుతున్న పుల్లముక్క ని ఊసాడు. కొంచెం బాధగా పేస్ పెట్టి, అర్జున్ వైపుకి తన ఒరలోని కత్తి తీసి కదిలాడు. కొంచెం దూరంలో ఉన్న ఆర్కేబు కేసి చూసి, ముందుకి వెళ్ళమన్నట్టు, తల ముందుకి ఊపుతూ సైగ చేసాడు. కొంచెం ముందూ వెనకా చూస్తున్న ఆర్కేబు, ముందుకి కదిలాడు. అసలు వాళ్ళ తెగ కట్టుబాటు ప్రకారం, ఒక వీరుడితో ఒకరే యుద్ధం చెయ్యాలి.

ముళ్ళ గదతో తన వైపుకి వచ్చిన ఆర్కేబు ని సునాయాసం గా చంపివేశాడు అర్జున్. మళ్ళీ concentration తో ఫైటు మొదలు పెట్టాడు అర్జున్. ఈ సారి, ఇంకా aggressive moves అతనికి వస్తున్నాయి. అతను కదులుతున్న వేగం, అతని moves అద్వితీయం గా ఉన్నాయి. అదుల్య వీర సామాన్యుడేమి కాదు, ఆరడుగుల పొడుగు, కండలు తిరిగిన దేహం, రాజ లక్షణాలు ఉట్టి పడుతున్న మొహం. ఒక రకం గా చెప్పాలంటే, ఈ నాడు మన ప్రపంచం నించి కనుమరుగైన ఖడ్గ విద్య అంతా అతని దగ్గరే ఉంది.

చిట్ట చివరకి అదుల్య వీర చనిపోయాడు. తన బల్లేన్ని ముందుకి push చేసి, అదుల్య వీరని పొడిచాడు అర్జున్. Solid blow తగిలిన అదుల్య వీర, చేతిలో ముందుకి దూసిన కత్తితో, ఆ ఇసుక beach లో పడిపోయాడు. అర్జున్ చాలా concentration తో, trance లో ఉన్నట్టుగా అలాగే ఉండిపోయాడు. ఒక అద్వితీయమైన యుద్ధ భంగిమలో ఉన్నాడు అతను.

అతని concentration కొద్ది సేపటికి break అయ్యింది.Trance లాంటి స్థితి లోంచి బయటకి వచ్చాడు అతను. బయటకి వచ్చిన అర్జున్ కి, ఎదురుగా మృత దేహాలు, చేతిలో ఆయుధం కనిపించాయి. తనే చంపినట్టు కొద్దిగా గుర్తుకు రావడంతో accept చెయ్యలేకపోయాడు. మళ్ళీ పాత అర్జున్ లా అతనికి భయం ఆవహించింది. అతనికి కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది. తల పట్టుకుని, అదే beach లో కొంచెం సేపు తుళ్ళుతూ, తిరిగాడు అర్జున్. జరిగినది తెలుస్తున్నట్టే ఉంది, కాని భయం వేస్తోంది, పూర్తిగా గుర్తుకు రావడం లేదు. అలాగే తిరిగి, ఒక చోట పడిపోయాడు అర్జున్. నిస్సత్తువగా ఉన్న అతనికి, మైకం ఆవహించింది.

(సశేషం)

అర్జునుడు III


    అర్జున్ ఒక సంఘటనని చూస్తున్నాడు. భయంకరమైన వాన, ఉరుములు, పిడుగులు. ఆ వానలో దట్టమైన అరణ్యం గుండా వెళ్తున్న ఒక మెరుపు, నేల మీద మెరుపా అనిపించే ఒక రధం అది. అందులో ఒక రాజు లాంటి వ్యక్తి, ఇంకొక నెలలు నిండిన వనిత. అర్జున్ కి తన గుండె తీవ్రం గా కొట్టుకోవడం తెలుస్తోంది. Anxiety చాలా ఎక్కువగా వస్తోంది, తనకి ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది, తీవ్రంగా రొప్పుతున్నాడు ఊపిరి తీసుకున్న ప్రతి సారి, ప్రతి సారికి ఇంకా ఎక్కువగా రోప్పవలసి వస్తోంది అతనికి. ఇంతలో, ఒక భయంకరమైన వెలుగు, ఆ వెలుగు రధం లోని వారిని కమ్మేయడం, చివరికి తెల్లటి వెలుగు తప్ప ఏమి కనిపించకపోవడం, అతనికి అనుభవం అయ్యింది. ఆ వెలుగు చూస్తే కళ్ళు పోతాయేమో అనిపిస్తోంది. అర్జున్ కి శ్వాస తీసుకోవడం ఇంచుమించు కష్టంగా ఉంది.

    అర్జున్ నిద్ర లోంచి లేచాడు. ఆనుకుని శైలజ పడుకుని ఉంది. ఏంటో flight అంతా గందరగోళం గా ఉంది. అప్పుడే మైకు లోంచి announcement వస్తోంది. 
మైకు: Your attention please! మన ఫ్లైటు ప్రస్తుతం rough weather లో ప్రయాణిస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు ఇంకో పది నించి ఇరవై నిముషాలు ఉండవచ్చు, కావున ఎవరి సీట్లలో వాళ్ళు, సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చోవలసిందిగా ప్రార్ధన. 

ఈ కోలాహలం లో శైలజ కూడా లేచింది. కొద్దిగా ఒళ్ళు విరుచుకుంటూ announcement వస్తున్న స్పీకర్ కేసి చూసింది. కొంచం సేపటికి కాని ఈ ఫ్లైట్ పరిస్థితి వీళ్ళకి అర్ధం కాలేదు. నిజమే, ఫ్లైట్ చాలా rough weather లోంచి ప్రయాణిస్తోంది. చాలా పెద్ద వాన, బహుసా tropical hurricane అయ్యుంటుంది, బయట కురుస్తోంది. అప్పుడప్పుడు మెరుపులు, భయంకరమైన పిడుగులు కనిపిస్తున్నాయి. విమానం ఎలాగైనా దీన్నించి బయట పడితే చాలని అనుకుంది శైలజ. 

అర్జున్ కి కూడా అలానే ఉంది. ఇంతే మొదటి సారి, అలా అనుకో బుద్ది వెయ్యలేదు అతనికి. ఎందుకో తెలీదు, దేవుడిని ప్రార్ధించడం ఎందుకనిపించింది. ఇంతలోనే అనుకున్నాడు, దేవుడిని ప్రార్ధించకపొతే ఎలా? మెడలోని locket చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. 

Flight వాడు ఇరవై నిమిషాల్లో పోతుందన్నాడు, అర గంట పైనే అయ్యింది. ఇంకా ఆ తుఫాను లోనే ఉన్నారు ఫ్లైట్ తో సహా అందరూ. ఇప్పుడు ఫ్లయ్ టు లో వాళ్లందరికి అలవాటై పోయింది. ఇంచుమించుగా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఊరికే దేవుడికి కళ్ళు మూసుకుని దణ్ణాలు పెట్టుకుంటోంది శైలజ. అర్జున్ మాత్రం మౌనం గా కిటికీ లోంచి బయటకి చూస్తూనే ఉన్నాడు. ఒక సారి తిరిగి watch time చూసుకున్నాడు అర్జున్. 

ఉన్నట్టుండి ఒక మెరుపు మెరిసింది. ఏదో కరంటు లాంటింది ఫ్లైట్ కి తగలడం తో ఫ్లైట్ ఒక్క సారిగా బాగా shake అయ్యింది. కళ్ళుమూసుకుని ప్రార్ధిస్తున్న శైలజ, ఆ కుదుపుకి "ఆహ్!" అంటూ కళ్ళు తెరిచింది. అర్జున్, తల పైకెత్తి ఒక్క సారి బయటకి చూసాడు. చాలా మంది తమ సీట్ల్లల్లోంచి లేచి, కుడి వైపు కూర్చున్న వాళ్ళు, కిటికీ లోంచి బయటకి చూద్దామని వాలారు. కుడి వైపు propeller తిరగడం మానేసింది. మెల్లగా అది flight light ల వెలుగులో slow అయిపోవడం కనిపిస్తోంది. అసలే అందరూ కుడి వైపుకి చేరిపోవడం, ఇంకా propeller ఆగి పోవడంతో ఫ్లైట్ అంతా కుడి వైపుకు వాలిపోయింది.

ఫ్లైట్ లో చాలా మంది హాహాకారాలు, ఏడుపులు మొదలెట్టారు. చాలా మంది ఏడుస్తున్నారు. అర్జున్ కి ఎందుకో ఏడవాలనిపించడం లేదు. మరీ పెద్ద incident ఏమి జరగడం లేదన్నట్టు శైలజ వైపు చూసాడు. తను కళ్ళు గట్టిగా మూసుకుని దేవుడిని ప్రార్ధిస్తోంది. దణ్ణం పెట్టిన రెండు చేతుల్లోంచి ఒక చెయ్యి తీసి తనకి తానే విసినికర్ర విసిరినట్టు విసురుకోవడం మొదలెట్టింది. అర్జున్ మరొక్కసారి కిటికీ లోంచి బయటకి చూసాడు. అతనూ ఏమి చెయ్యాలో తెలీక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. 

అందరికీ తెలుస్తూనే ఉంది, ఈ పరిస్థితుల్లో flight ఎక్కువ సేపు వెళ్ళలేదు అని. అందరూ ప్రాణాలు చిక్కబట్టుకుని silent గా కూర్చున్నారు. Flight లో స్మశాన నిశ్శబ్దం అలముకొని ఉంది. అర్జున్, ఇప్పుడు భయం వెయ్యడం తో శైలజ చెయ్యి పట్టుకున్నాడు. విసురుకుంటున్న చెయ్యి తను పట్టుకోవడం తో, ఏడుపు మొదలెట్టింది శైలజ. అయినా తను ఎక్కువ ఏడిస్తే అర్జున్ ఎక్కడ భయపడతాడోనని ఏడుపు మానేసి౦ది. ఇద్దరూ ఒకళ్ళ చేతిలో ఇంకొకరు చెయ్యి వేసుకున్నారు. ఆమె అలా చెయ్యడం చూసి, అర్జున్ కళ్ళు తెరిచాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఇంకొకరు చూసుకున్నారు.

మైకు లో ఏదో announcement వచ్చింది. 

మైకు: Your attention please! Due to the present circumstances, we have to crash land our flight. Please brace yourselves. Put on the seat belts, and wear your life jackets. Our crew will assist you, we might mostly land somewhere in the Pacific Ocean, (మైకు కట్ అయ్యినట్టుగా బీప్ బీప్ మని సౌండ్స్ వస్తున్నాయి).

అందరూ ఏవేవో reactions చూపిస్తున్నారు. అర్జున్, శైలజ మటుకూ ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూస్తూనే ఉన్నారు. ఏదో జరుగుతున్నట్టు, ఏదో మైకు లో చెప్పినట్టు వాళ్లకి తెలుస్తూనే ఉంది. ఏమవుతుందో వాళ్లకి sixth sense ఎప్పుడో చెప్పినట్టుగా, ఇవేమీ వినకుండా అలానే ఉన్నారు. వాళ్ళ చుట్టూ చాలా గందరగోళం గా ఉంది. పసిఫిక్ మహా సముద్రం లోనికి విమానం descent స్టార్ట్ చేసింది. దాన్ని descent అనడం కన్నా free-fall అనడం బెటర్.

సరిగ్గా అప్పుడే ఎడమవైపు propeller load ఎక్కువ అవ్వడంతో, cut అయ్యిపోయింది. స్పీడ్ గా తిరుగుతూ వచ్చిన ఆ propeller విమానాన్ని రెండు ముక్కలు చేసింది. ఆ propeller కట్ చేసిన ప్రాంతాల్లోని వాళ్ళంతా హృదయ విదారకం గా చనిపోయారు. సరిగ్గా అప్పుడే విమానం లో మంటలు మొదలయ్యాయి. రెండు అగ్నిగోళాలు ప్రశాంతత ఆవరించిన ఆ సముద్రం లో ఎక్కడో ఒక చోట, పడిపోవడం మొదలెట్టాయి. మంటలు క్రమం గా రెండు parts లోను, propeller కట్ చేసిన ప్రాంతం నించి వ్యాపించడం మొదలెట్టాయి. చేతిలో చెయ్యేసుకుని, ఒకరి వైపు ఒకరు తిరిగి, closed eyes తో, ఆ యువ జంట పసిఫిక్ మహా సముద్రం లోనికి పడిపోయింది. 

అర్జున్ కళ్ళు తెరిచాడు. తామున్న విమానం పార్టు కొంచెం నీళ్ళలో తేలుతోంది. చుట్టూ ముసిరిన లావుపాటి ఈగలు (tropical). చుట్టూరా మృతదేహాలు, కాలిపోయినవి కొన్ని, నీటిలో నానినవి కొన్ని. చాలా భయంకరం గా ఉంది అక్కడ. ఈ లోపల శైలజ కూడా కళ్ళు తెరిచింది. మగత గా, 

శైలజ: ఎ ... ఎ ... ఎక్కడున్నాం? ఏం జరిగింది? (శైలజ కి మొదట నిన్న రాత్రిది గుర్తుకు రాలేదు. చుట్టూ ఉన్నదంతా చూసి, గుర్తుకు తెచ్చుకుంది. అప్పటికే time మధ్యాన్నం అయ్యినట్టుంది, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు)

ఇదేమి పట్టించుకోనట్టు అర్జున్, ఆమె చెయ్యిని పక్కకి తీసి, తానున్న part లోకి ముందుకి వెళ్ళాడు. ఏదో వెతుకుతున్నట్టు వెళ్ళిన అర్జున్, కొంచెం దూరం వెళ్ళాక వాంతి చేసుకున్నాడు. కొంచెం సేపు తరువాత, ఒక yellow color లోని bags తో వచ్చాడు అతను. ఒక సెట్ శైలజకిచ్చి,

అర్జున్: ఊదు! (చెప్పాడు).

ఇద్దరూ చాలా సేపు ఊది, రెండు లైఫ్ జాకెట్స్, ఒక yellow color life-boat తయారు చేసారు. లైఫ్ జాకెట్స్ వేసుకుని, లైఫ్ బోటు మోసుకుంటూ, నీళ్ళలోకి ఓపెన్ అయ్యిన flight area లోకి వచ్చారు. Boat ని నీళ్ళలో వేసాడు అర్జున్, అది నీటి మీద తేలింది. అర్జున్ మొదట అందులోకి ఎలాగో దిగాడు. తరువాత చెయ్యి పట్టుకొని శైలజ ని దింపాడు. అంతకు ముందే తెచ్చుకున్న తెడ్లసాయంతో, అతను ముందు కూర్చుని rowing చెయ్యడం మొదలు పెట్టాడు. 

శైలజ కూడా రెండు నిముషాలు rowing చేసింది. Flight నించి కొంత దూరం వచ్చాక ఏడుపు మొదలెట్టింది. చేతులతో ముఖం కప్పేసుకొని వెక్కుతూ ఏడుస్తోంది తను. మొదటి సారి అర్జున్ తనేమి చేస్తున్నది స్పృహ లోకి వచ్చిన సమయం అదే. ఒక సారి కళ్ళ లోంచి కారుతున్న నీళ్ళని తుడుచుకున్నాడు అర్జున్. మళ్ళీ తను చూస్తోందేమోనని వెనక్కి తిరిగి చూసాడు. తను ఏడుస్తూనే ఉంది, మొహం చేతులతో కప్పేసుకుని. కొంచెం సేపయ్యాక ఏడుపు ఆపు చేసింది శైలజ, వెక్కడం ఇంకా ఉంది కాని. 

అర్జున్: ఎం పర్లేదు, Flight లోంచి బయటకి వచ్చేసాం కదా, ఇదిగో ఈ watch చూపిస్తున్నట్టు, ఇలా ఉత్తరం వైపు వెళ్ళాం అంటే,  philippines వస్తుంది, మనం అక్కడికి వెళ్తాం, వాళ్లకి మన సంగతి చెప్తాం, India వాళ్ళం కదా, definite గా help చేస్తారు. (కొంచెం సేపాగి...), రేపు సాయంకాలానికల్లా India లో ఉంటాం (ఏదో తెలిసినట్టు చెప్పేసాడు). 

కొంచెం సేపు ఏడిచి, సొమ్మసిల్లిపోయిందో, లేదంటే అర్జున్ మాటలకి సమాదానపడిందో గాని, శైలజ నిద్రపోయింది. ఆమె నిద్రపోయాక, అర్జున్ ఇహలోకం లోకి వచ్చాడు. ఇంతవరకు ఉగ్గబట్టుకున్న దుఃఖం అంతా తనంతట తానె బయటకి వచ్చేసింది. తనలో తానూ ఇలా అనుకున్నాడు, 

అర్జున్: (స్వగతం) ఉత్తరం వైపు వెళ్తే philippines వస్తుందా, ఎవడు చెప్పాడు? పైగా సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నాడు, ఇప్పుడు దిక్కులు చెప్పడం కష్టం. తన watch పని చెయ్యడం ఆగిపోయి, ఇప్పటికి దాదాపుగా ఒక రోజు కావస్తోంది. చుట్టూ ఎక్కడ చూసినా అనంతంగా సముద్రం. నిస్సహాయం గా అనిపించింది అతనికి. చేతికున్న watch తీసి, నీళ్ళలోకి విసిరాడు.

అలా ఇంచుమించు గా ఒక అయిదు గంటలు rowing చేసుంటాడు అర్జున్. ఇంక అతనికి కూడా ఓపిక నశిస్తోంది. ఎక్కడా నేల కనిపించడం లేదతనికి, చెమటలు ధారాపాతం గా కారుతున్నాయి. సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు, ఇక చీకటి పడితే నేల, నీళ్ళు ఏమి కనిపించదు కూడా. అతనికింక ఒళ్ళంతా నిస్సత్తువ ఆవహించింది. Rowing ఇంచుమించి ఆపు చేసి, boat లో నడుంవాల్చి పడుకున్నాడు. కళ్ళు మూసుకోబోతున్నంతలో, అతనికి పైన ఎగురుతూ ఏవో పక్షులు కనిపించాయి. ఏదో అనుమానం వచ్చి చూసాడు, yes, తను అనుకున్నది కరక్టే, అవి కాకులు, crows, Yes!

కాకులు నేలని విడిచి నీటిలో ఎక్కువ దూరం ఎగరలేవు, అవి కనిపించాయంటే దగ్గరలో ఎక్కడో నేల ఉన్నట్టే. ఇనుమడించిన ఉత్సాహం తో rowing మొదలెట్టాడు. ఇంకో అరగంట లో, ఒక దీవి దూరం గా కనిపించింది అతనికి. అదే టై౦ కి శైలజ కూడా లేచింది. ఒడ్డుకి ఇంకా బోటు చేరకుండానే, నీళ్ళల్లోకి దిగి నడవడం మొదలెట్టింది శైలజ. ఇతను కూడా, బోటు వదిలేసి ఆమె వెనకాల నడవడం మొదలెట్టాడు.

తీరాన్ని చేరుతూనే, మోకాళ్ళపైన కూలబడ్డాడు అర్జున్. శైలజ మాత్రం ఇంకా ముందుకి వెళ్లి, అక్కడున్న చెట్లకేసి

శైలజ: Help! Somebody please Help! Help! (చేతులు ఊపుతూ గట్టి గట్టి గా అరుస్తూ, పైకి గెంతుతూ అరుస్తోంది. తనకి హెల్ప్ చెయ్యాలని ఎంత ఉన్న, లేచి నిలబడ లేక పోయాడు అర్జున్, అలాగే బోర్లా పడిపోయాడు. ఎన్నో సార్లు కళ్ళు తెరిచిన అతనికి, శైలజ అరుస్తూ ఉండడం కనిపిస్తూనే ఉంది. కొంత సేపు english, తర్వాత మళ్ళీ తెలుగు, చాలా ట్రై చేసింది తను. ఆ దట్టమైన అడవి లాంటి చెట్లలోకి కొంచెం వెళ్లి కూడా చూసింది. తను అరగంట కి పైగా అరుస్తూనే ఉండడం, తిరిగి వెనక్కి వచ్చి, కూలబడి అతని పక్కని పడుకుని పోవడం, అతనికి కళ్ళు తెరిచినప్పుడల్లా కనిపిస్తూనే ఉంది. చివరికి అతనికి కూడా నిద్ర ఆవహించింది. సూర్యుడు అస్తమించాడు).

 (సశేషం)

అర్జునుడు II


    అర్జున్, శైలజ honeymoon కి new zealand వెళ్తున్నారు. విమానం malaysia మీదుగా new zealand వెళ్తోంది. అందరూ సర్దుకుని కూర్చుంటున్నారు. అర్జున్, పై కాబిన్ లో తన బాగ్ ని పెడుతున్నాడు. ఎంత try చేసినా బాగ్ అందులో fit అవ్వటం లేదు. మరొక్కసారి బలంగా తోసి, అంతే force తో చెయ్యి వెనక్కి తీసాడు అర్జున్. అతని మోచెయ్యి, అటు వైపు గా వెళ్తున్న air hostess తలకి తగిలింది. అసలే పొడుగు మనిషి, పొడుగు చేతులు, ఒక సారి బలంగా వెనక్కి తీయడంతో, గట్టి దెబ్బ తగిలి air hostess కింద పడిపోయింది. ఆమెని వెనక్కి తిప్పితే గాని తెలియలేదు, స్పృహ కోల్పోయిందని. 

ఇంతలో, ఇంకో foreign air hostess, కొంచం పెద్దావిడ అటువైపు వచ్చింది.

Air hostess: Excuse me Sir! (అర్జున్ తో) What happened? 
అర్జున్: I hit her on her head and she fainted. (కొంచెం భయంగా). 
Air hostess: Yes Sir! But why did you hit her? 

అర్జున్: I hit her on her head and she ... (మళ్ళీ అదే కంటిన్యూ చేసాడు. ఈ సారి, ఇంకా భయంగా ఉంది అతనికి)
Air hostess: (Disappointed గా పేస్ పెట్టి) I am afraid Sir, then I have to call the police and, .... (ఇంకో వైపుకి చూస్తూ). 

ఇప్పుడే bathroom నించి వచ్చిన శైలజ ఇదంతా చూసింది. కొంచెం ఫాస్ట్ గా నడుస్తూ వచ్చి, 

శైలజ: (Air hostess తో), Excuse me! It was just an accident! He was trying to push the baggage into the rack, and his hand hit her accidentally. It was an accident (repeat చేసింది).

Air hostess అవునా అన్నట్టు, అర్జున్ కేసి చూసింది. తల దించుకున్నఅర్జున్, అవునన్నట్టు తల ఊపాడు. శైలజ కళ్ళేగరేస్తూ Air hostess కేసి చూసింది. Air hostess రెండో వైపు చూస్తూ, అనుమానం గా ఫేస్ పెట్టి, 

Air hostess: ఒకే ... (కొంచెం సేపాగి) ... సారీ సర్! ... It's allright. 

ఫారిను Air hostess ఇంక నిష్క్రమించింది. 

శైలజ కూర్చుంటూ, అర్జున్ చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది. వీళ్ళ వెనకాల row లో, కలర్-కలర్ సూట్లు వేసుకుని, ఇద్దరు ఊరోళ్ళు, బ్రహ్మం, భద్రం కూర్చున్నారు. వీళ్ళు కూర్చుంటూ ఉండగా, ఏదో జోక్ వేసుకుని నవ్వారు. ఈ episode అంటా ఫాలో అవుతూనే ఉన్నారు వాళ్ళు.  

అర్జున్ కి కొంచెం టెన్షన్ గా ఉంది. తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అతనికి. ఎలాగో చైర్ లో కూలబడ్డాడు. వెనకాల బ్రహ్మం, 

బ్రహ్మం: (భద్రం తోటి) బావ, బావా! 
భద్రం: ఏంట్రా అది! 
బ్రహ్మం: మనం విమానం ఎక్కడం ఇది (అర్జున్, శైలజల కేసి తిరిగి నవ్వుతూ) పదో సారి కదా! మరి మొదటి సారి ఎక్కిన వాళ్లకి ఎలా ఉంటుంది బావా? 
భద్రం: (అంతా వెంటనే క్యాచ్ చేసి...) ఏముందిరా! కళ్ళు తిరుగుతున్నట్టు, కాళ్ళు వణుకుతున్నట్టు, వాంతి అవుతున్నట్టు ఉంటుందిరా బామ్మర్ది! 

Magazine పేజీలు తిరగేస్తున్న శైలజ, "ఓహో!" అన్నట్టుగా తల ఎగరేసి, తిరిగి magazine చదవడం మొదలెట్టింది.  ఇక్కడ నిజంగానే అర్జున్ కి కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు, చేతులు అతనికి తెలియకుండానే వణకడం మొదలెట్టాయి. వెనకాల వాళ్ళు జోక్స్ వేసుకుంటూనే ఉన్నారు. అర్జున్ కి టెన్షన్ కి ఏమి వినిపించడం లేదు. వెనకాల వాళ్ళు అతని పరిస్థితి చూసి ఇంకా రెచ్చిపోయారు. శైలజ మటుకు ఏమి పట్టించుకోవడం లేదు. 

బ్రహ్మం: బావా, బావా! 
భద్రం: ఏంట్రా అది! (కొంచెం చిరాగ్గా) 
బ్రహ్మం: ఈ ఇమానాల్లో మందిస్తారు కదా, నువ్వైతే ఎన్ని పెగ్గులు ఎయ్యగలవ్ బావా! 
భద్రం: పెగ్గులే౦ట్రా! బాటిల్సే బాటిల్సు!
బ్రహ్మం: ఆహా, సూపర్ బావా! స్ట్రె౦గ్త్ అంటే నీది, నీది బావా! నేను, ఒక్క పెగ్గు కూడా వెయ్యలేను బావా! (వెటకారం గా నవ్వుతూ, శైలజ అర్జున్ ల కేసి చూస్తూ అన్నాడు). 

అర్జున్ కి ఇవేమీ వినిపించడం లేదు. ఒక పావుగంట తర్వాత, అర్జున్ కి కొంచెం నెమ్మదించింది. అతనికి తల తిరగడం, కాళ్ళు చేతులు వణకడం ఆగిపోయాయి. కొంచెం చెమట కూడా పట్టింది కాని, విమానం లో A.C ఉండడం వల్ల, ఇప్పుడు చెమట అంతా ఆరిపోయింది. ఇప్పుడు అర్జున్ కి బాగానే ఉంది. ఇంతలో Seat-Belt sign రావడంతో, తన బెల్ట్ పెట్టుకున్నాడు అర్జున్. శైలజ తనకి బెల్ట్ పెట్టుకోవడం రావట్లేదంది, అర్జున్ హెల్ప్ చేస్తున్నాడు. 

ఈ మధ్య బ్రహ్మం, భద్రం గోల కాస్త తగ్గింది, అప్పుడప్పుడూ జోక్స్ వేస్తూనే ఉన్నారు గాని. Air-Hostess episode అయ్యి పావుగంట దాటడంతో, అర్జున్ కి మామూలు గానే ఉంది. పైగా ఇప్పుడు magazine శైలజ, అర్జున్ ఇద్దరూ కలిసి చదువుతున్నారు కూడా. విమానం కదిలింది.

విమానం take-off అవుతోంది. సడన్ గా వెనక సీట్లో బ్రహ్మం మొదలెట్టాడు.


బ్రహ్మం: (ఊగిపోతూ...) ఆపండ్రోయ్!

అర్జున్ కి మొదట అర్ధ౦ కాలేదు. Magazine లోంచి తలతిప్పి పక్కకి చూసాడు. ఇంతలో, శైలజ ఏదో జోక్ వేసి engage చెయ్యడంతో, మళ్ళీ తల తిప్పి, ఇద్దరూ నవ్వుకున్నారు.

బ్రహ్మం: (ఊగిపోతూ...) ఆపండ్రోయ్!
భద్రం: (బ్రహ్మం తో) ఆపరా బామ్మర్ది! విమానం గాల్లోకి లేచే దాకానే ఉంటుంది, ఊరికే నస పెట్టకు.
బ్రహ్మం కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, తల ఓ range లో తిరుగుతోంది. కొంచెం సేపైతే డోకొచ్చేలా ఉంది. విమానం take-off అవ్వబోతున్న టైం లో, సరిగ్గా, సీట్-బెల్ట్ తీసేసి, పడుతూ లేస్తూ పరిగెత్తాడు బ్రహ్మం, toilet లోకి. అతన్ని చూసి, దూరంగా ఉన్న ఒక Air Hostess,

Air Hostess: Hey, Mister!

ముందు వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసారు. అర్జున్ కూడా చూడబోతుంటే, ఏదో జోక్ వేసి శైలజ engage చేసింది. ఇద్దరూ నవ్వుకున్నారు.

కొంతసేపటికి, bathroom నించి బ్రహ్మం బయటికి వచ్చాడు. అతని ముక్కు దెబ్బ తగిలినట్టు, ఎర్రగా ఉంది. కొద్దిగా కుంటుతున్నాడు. Air Steward వచ్చి, దన్నుగా జబ్బ పట్టుకుంటే, మూలిగాడు.

అతన్ని పట్టుకుని, సీట్లో కూర్చోబెడుతూ, Air Hostess అడిగింది.

Air Hostess: First time?

బ్రహ్మం: (బుంగమూతి పెట్టి) No, tenth time. (చెప్పాడు) 

Air Hostess చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది. భద్రం అప్పుడే గాఢనిద్ర లోకి వెళ్ళిపోయినట్టు, ఏదో magazine తో ముఖం కప్పేసుకుని, గుర్రు పెడుతున్నాడు. 

కొంతసేపటికి భద్రం లేచాడు. ఏదో మాట్లాడుతున్న అర్జున్ తో శైలజ,  

శైలజ: Actually, why don't you talk to me in English?
అర్జున్: ఇంగ్లీషె౦దుకు, మన భాష తెలుగు ఉండగా (నవ్వుతూ అన్నాడు)? 
శైలజ: No, Arjun please. We should talk in English. Because we are on a plane? It is an international language, ya... (చేతులు తిప్పుతూ అంది)
అర్జున్: సరే, అలాగే కానియ్! (కొంచెం అనుమానంగా ఆమెకేసి చూస్తూ, నవ్వుతూ అన్నాడు). 

వాళ్ళిద్దరూ english లో మాట్లాడుకుంటున్నారు. కొంచెం సేపటికి అర్జున్ నిద్రలోకి వెళ్ళాడు. Beverages serve చేసే బండి తో Air Hostess వచ్చింది, శైలజ ఏమి వద్దంది. 

వెనకాల బ్రహ్మం, భద్రం తెగ తంటాలు పడుతున్నారు.  

భద్రం: ఇస్కీ... ఇస్కీ... ఇస్కీ... సాచిస్కి! 
ఏమి అర్ధం కాలేదన్నట్టు ఫారిను air hostess ఫేసు పెట్టింది. 
Air Hostess: What...? (పక్కగా చూస్తూ)
శైలజ: (Mag లోంచి తలెత్తి...) He means Whiskey, Scotch.

Air Hostess మాట్లాడకుండా whiskey గ్లాసు లో పోసింది. 

శైలజ: (తల వెనక్కి తిప్పి, కాస్త రఫ్ గా..., భద్రం తో)  ఏ వూరు బాబు మన్ది? 
మారు మాట్లాడకుండా భద్రం whiskey తాగేసాడు. 

విమానం Kuala Lumpur లోఆగినప్పుడు, వాళ్ళిద్దరూ గప్-చుప్ గా దిగేశారు. బ్రహ్మం వీళ్ళ కేసి చూసి, ఒక వెర్రి నవ్వు నవ్వాడు. అర్జున్ నవ్వు రిటర్న్ చేసాడు. శైలజ ఏమి పట్టించుకోకుండా magazine మీద concentrate చేసింది. విమానం Kuala Lumpur నించి, New Zealand వైపు తన ఆఖరి మజిలీ ని స్టార్ట్ చేసింది. 

(సశేషం)

అర్జునుడు -- I


    అప్పుడే భీమవరం నించి Auto దిగిన సత్తిబాబు, ఎదురుగుండా ఉన్న పెద్ద line ని చూసి ఆగిపోయాడు. "అయ్య బాబోయ్! ఇదేంటి! ఈ మధ్య పెళ్ళిళ్ళకి కూడా లైన్లు కడుతున్నారా?". ఏదో "గుంపులో గోవింద" అని, లైన్లో నిలబడిపోయాడు. అసలా line ఎందుకో అని, కొంచం ముందుకి చూద్దామని చాల try చేసాడు. ఉహూ! లాభం లేదు, line అష్టవంకర్లు తిరిగి ఉంది. 

    కొంతసేపటికి line లో ముందుకి వచ్చాడు సత్తిబాబు. ముందు జరుగుతున్నదంతా కనిపిస్తూనే ఉంది. ఎదురుగా ఒక desk దగ్గిర ఒక అమ్మాయి పన్నీరు జల్లుతోంది. ఇంకో చిన్న పిల్ల గులాబీలు ఇస్తోంది. ఇదంతా బానే ఉంది కాని, ఇంకొకటి కూడా జరుగుతోంది అక్కడ. అక్కడ రాజీవ్ గాడు, సంతోష్ గాడు ఏదో పని ఉన్నట్టు హంగామా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరి తోటి, 

రాజీవ్: మేస్టారు, నమస్తే! సార్, ID card ఉందాండి, మరి address proof? (పక్కనే సంతోష్ గాడు ఏదో రిజిస్టర్ లాంటిది పెట్టి, అందరి names నోట్ చేస్తున్నాడు. కొంతమంది పరాచికాలాడటానికి try చేస్తున్నారు, కొంతమంది ఇదేంటబ్బా అనుకుంటూ ముందుకి కదులుతున్నారు. మొత్తానికి వాళ్ళ అల్లరి బారిన పడటం మటుకు తప్పటం లేదు ఎవరికీ.)

    ఇదంతా చూస్తున్న సత్తిబాబుకి చిర్రెత్తింది. "పావుగంట సేపు, line లో నిలబెట్టి చివరికి వీళ్ళు చేసేది ఇదా! లాభం లేదు, వీళ్ళకి నా (భీమవరం) తెలివితేటలు చూపించాల్సిందే!", fix ఐపోయాడు. కరక్ట్ గా తన వంతు వచ్చేవరకు ఆగాడు.

రాజీవ్: (సత్తిబాబు తో), ఏవండి మాస్టారు! ID card సార్! (అడిగాడు. ఏదో ధ్యాసలో ఉన్నట్టు కటింగ్ ఇచ్చి, ఇప్పుడే విన్నట్టుగా face పెట్టాడు సత్తిబాబు. ఆ పైన Shirt జేబుల్లో చూసాడు, మర్చిపోయి ఆందోళన పడుతున్నట్టుగా face పెట్టి, కంగారు చూపిస్తూ pant జేబుల్లో వెతకడం మొదలుపెట్టాడు. కొంత సేపటికి తను తెచ్చిన బాగ్ ఓపెన్ చేసాడు. చాలా సేపే అయ్యింది. రాజీవ్ గాడు, సంతోష్ గాడి కేసి చూసి చిన్న నవ్వు నవ్వుతున్నాడు.)

సత్తిబాబు: అరెరే, మర్చిపోయాను సార్! మీరేమి అనుకోకపోతే, (పక్కనున్న, పన్నీరు జల్లుతున్న అమ్మాయి కేసి తిరిగి), పాపా! Address రాసుకోమ్మా! (తన purse తీసి, అందులో ఉన్న తన భీమవరం అడ్రస్ అంతా గడగడా చదివేసాడు. వీళ్ళకి ఏమి జరుగుతోందో తెలిసేలోపుగా..., రాజీవ్ కేసి తిరిగి), ఈ అడ్రస్ లో ఉన్న మా ఇంటికి కి వెళ్లి సత్తిబాబు ఇమ్మన్నాడని చెప్పండి, ID proof, Address proof మీ చేతికిస్తారు. (మళ్ళీ రాజీవ్, సంతోష్ ల కేసి చూస్తూ), సారీ అండి! (చాలా దీనమైన face పెట్టాడు. మళ్లీ వాళ్లకి అవకాశం ఇవ్వకుండా అక్కడనించీ కదిలాడు).

అవాక్కై చూస్తున్న రాజీవ్ ని చూస్తూ, "తిక్క కుదిరిందా" అన్నట్టు, ఆ అమ్మాయి నవ్వడం మొదలెట్టింది. సంతోష్ కి ఏమి పూర్తిగా అర్ధంకాలేదు. సత్తిబాబు కేసి చూస్తూ ఏదో అనబోయిన సంతోష్ గాడిని ఆపి,

రాజీవ్: వాడి౦టికెళ్లి, వాడు ఇమ్మన్నాడని చెప్పాక ఇంకా ID proof, Address proof ఎందుకురా సత్తిబాబూ! (సంతోష్ గాడిని ఉద్దేశించి "లో వాయిస్" లో అన్నాడు రాజీవ్. సంతోష్ గాడికి సీన్ అర్ధం అయ్యింది.)

    ఇంకో ముగ్గురు నలుగురిని బాధించి, ఏదో పని ఉన్నట్టుగా అక్కడినించి కదిలారు రాజీవ్, సంతోష్. దారిలో మంటపం మీదనించి వెళ్తూ, 

రాజీవ్: ఏరా! అంతా ఓకేనా! (పెళ్లి పీటల మీద ఉన్న తన friend, పెళ్లి కొడుకుని ఉద్దేశించి అన్నాడు, ఏడిపిస్తున్నట్లుగా. పెళ్లి పీటల మీద ఉన్న అర్జున్, నవ్వుతూ చేతిలోని చెక్కగరిటని విసరబోయాడు. రాజీవ్ గాడు తప్పించుకున్నట్లుగా act చేసి, చిన్నగా నవ్వుతూ తన room కేసి వెళ్ళాడు). 

    సంతోష్ గాడి కోసం వెతుకుతూ ఉన్న రాజీవ్ కి మళ్ళీ సత్తి బాబు తగిలాడు. గుద్దుకుని పడబోతున్న సత్తిబాబు ని పట్టుకుని,

రాజీవ్: మేస్టారు, నేను, నా పేరు రాజీవ్ అండి, పెళ్ళికొడుకు ఫ్రెండ్. (చెప్పాడు).

సత్తి బాబు: నేను, సత్తి బాబంటారండి. పెళ్లి కూతురు తాలూక. (చెప్పాడు)

    కొంచెం సేపటి తరువాత ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. రాజీవ్ జోకులకి
సత్తి బాబు నవ్వుతుంటే, సత్తి బాబు జోకులకి రాజీవ్ నవ్వుతున్నాడు. మొత్తానికి ఇద్దరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు.

రాజీవ్: మాస్టారు, ఎక్కడుంటున్నారు?

సత్తి బాబు: ఆ!? (అర్ధం కాలేదన్నట్టు పేస్ పెట్టి).

రాజీవ్: అదే, విడిది ఎక్కడా అని?

సత్తి బాబు: కూకట్ పల్లి లో ఉన్న మా అత్తింట్లో చెప్పారండి. సాయంకాలానికి అక్కడే.

రాజీవ్: మేస్టారు, ఆడ పెళ్లి వాళ్ళతో ఉంటె, ఏముందండి. మా బాచ్ తో ఉండండి, సూపర్ enjoyment!

కొంచెం సేపు tempting తర్వాత,

సత్తి బాబు: ఇందులో ఏమి తేడా లేదు కదా? (అనుమానంగా పేస్ పెట్టి)

రాజీవ్: ఎంత మాట గురూగారు! ఇందాకటిదొకటి చాలలేదా మాకు, ఇప్పుడు మనం మనం ఫ్రెండ్స్ అండీ! (
Convincing గా చెప్పాడు. సత్తి బాబు కూడా ఏదైనా తేడా వస్తే, తన (భీమవరం) తెలివితేటలు చూపించవచ్చులే అని follow అయిపోయాడు).

    రూం ఎంటర్ అయిన సత్తి బాబుకి అంతా అయోమయం గా ఉంది. రూం నిండా సిగరెట్ పొగే, కొంతమంది పేకాడుతున్నారు. అంతలో పేకఆడుతున్న సంతోష్ గాడు,

సంతోష్: శైలజ రా, మన శైలజ రా! (ఏడుపు పేస్ పెట్టాడు, వాడిని అందరూ ఊరుకోబెడుతున్నారు)

సత్తి బాబు: (ఏదో అర్ధం అయినట్టు) ఓహో! వద్దు లెండి, నాకర్ధం అయ్యింది, నేవస్తా!  

రాజీవ్: అయ్యయ్యో, మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు! ఇదేమి మీరు అనుకున్నట్టు కాదండి.

సత్తి బాబు: మరి, ఇంకేంటండి! (కొంచం గట్టిగా అడిగాడు, ఆవేశంగా).

రాజీవ్: అయ్యయ్యో, మీకెలా చెప్పాలి, ఎలా. (కొంచెం సేపు ఆలోచించి) సరే, మీకు విషయం అర్ధం కావాలి అంటే, అర్జున్, శైలజల లవ్ స్టొరీ మీరు వినాలి. అప్పుడే మీకు అర్ధం అవుతుంది.

సత్తి బాబు: (కోపంగా చూస్తూ), సరే, లవ్ స్టొరీ అన్నారు కాబట్టి వింటున్నాను. (ఏదైనా తేడా వస్తే వేసేద్దాం అనుకుని).

రాజీవ్: అర్జున్ మాకందరికీ మంచి ఫ్రెండ్. మాలో కొంతమందికి చిన్నప్పటి నించి కూడా తెలుసు. నేను, సంతోష్ గాడు ఐతే, వాడితో చిన్నప్పడినించి ఫ్రెండ్స్ మే. మేమందరం కలిసి ఒకే సారి జాబ్ లో ఒకే కంపెనీ లో జాయిన్ అయ్యాం. అందరం ఒకే చోట కలిసిఉండే వాళ్ళం కూడా. మేం జాయిన్ అయ్యిన తర్వాత ఒక 6 months కి అనుకుంటా, శైలజ జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి తెలివితేటలు, అందం చూసి మాలో చాలా మంది try చేసాం.

సత్తి బాబు: (కోపంగా) ఊ!

రాజీవ్: అయినా ఆ అమ్మాయి ఎవరికీ పడలేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా పడేయ్యాలని చాలా మంది try చేసారు. కాని, తనకున్న clarity ముందు అవన్నీ ఏమి పని చెయ్యలేదు!

సత్తి బాబు: (ఇంకా కోపం గానే) ఊ! (ఇంతలో సంతోష్ గాడు),

సంతోష్: (సత్తి బాబు కేసి చూస్తూ) బాబు, నీ పేరేంటని అన్నావ్!

సత్తి బాబు: (కోపంగా ఎటో చూస్తూ), ఇంకా ఏమి అనలేదు!

సంతోష్: ఐతే ఏదో ఒకటనేయి, ఓ పనైపోతుంది కదా. (కోపం గా తనకేసి చూస్తున్న సత్తి బాబు తో), అహ! మనం మనం ఒక మాటనుకుంటే బెటర్ కదా అని! (మళ్లీ అన్నాడు)

సత్తి బాబు: సత్తి బాబు (ఇంకా కోపంగానే. ఇంతలో సంతోష్ గాడికి పేకాటలో ఫుల్-కౌంట్ పడింది, ఇంక ఆట వైపు వెళ్ళాడు వాడు.)

రాజీవ్: మా అర్జున్ కూడా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని మాకెవ్వరికి తెలీదు! అసలు తెలిసే అవకాశమే లేదు వాడితోటి, అంటా silent! (నోటికి zip వేసినట్టు చూపించి, అన్నాడు).

కొంచం సేపటికి,

సత్తి బాబు: మీరెన్నైనా చెప్పండి, అతనంత అమాయకుడంటే నమ్మడం కష్టమండి! అరె, అయినా ఈ రోజుల్లో అంత అమాయకులు ఎక్కడున్నారండి?

రాజీవ్: మీరు నా మాట నమ్మడం లేదు, ఉరేయ్ (అటునించి వెళ్తున్న ఒక బొట్టు candate ని పరిచయం చేసాడు). వీడు చెప్తాడు వినండి! (సత్తి బాబు తో)

బొట్టు: మొదట్లో నేను కూడా వీళ్ళు చెప్పింది నమ్మలేదు, కాని వీళ్ళతో కలిసాక అర్ధంఅయ్యింది. నేను మొదట్లో 6  months వేరే వాళ్ళతో ఉంది, తర్వాత వీళ్ళతో కలిసాను లెండి.

బొట్టు: ఒక సారి మా పని మనిషి, (సంతోష్ గాడు సీన్ లోకి ఎంటర్ అయ్యి flashback రింగులు తిప్పాడు).

పనమ్మాయి: ఏంటో, పైకెంతో (దీర్ఘం తీసింది) బుద్ధిమంతుల్లా ఉంటారమ్మా! తీరా చూస్తే అన్నీ వెధవ బుద్దులే!

బొట్టు: (నవ్వుతూ), ఇలాగే సణుక్కుంటూ ఒక వారం రోజులు పని చేసింది. చివరికి తేలిందేమిటంటే, పొద్దున్నే గిన్నెలు తోమటానికి వచ్చిన మా పని పిల్లకి, మా అర్జున్ గాడి కంచం లో మందు వాసన కొట్టిందట! (రాజీవ్, సంతోష్ అంతా నవ్వుతున్నారు).

సత్తి బాబు: (కొంచం నవ్వి, డౌట్ గా) ఆగండాగండి! అది అతని కంచమేనని తనకెలా తెలుసు?

బొట్టు: మేమైనా ఒక్కో రోజు బయట తింటాం గాని, అర్జున్ ది రోజు ఒకే టైం టేబుల్, weekly same menu.

సత్తి బాబు: ఓహో

బొట్టు: ఆఖరికి, వాడు సింక్ లో కంచం పెట్టె angle కూడా దానికి తెలుసు!

బొట్టు: చివరికి ఆ పని చేసింది, ఇదిగో వీడేనని (రాజీవ్ కేసి వేలు చూపిస్తూ) తేలింది! (రాజీవ్ రెండు చేతులు తలమీద పెట్టుకుని దాక్కున్నాడు. అందరూ నవ్వుకున్నారు).

బొట్టు: ఇంకో సారి ఏమైందో తెలుసాండి! ఒక సారి సంతోష్ గాడి Girl friend,

సత్తి బాబు: (కొంచం రిలీఫ్ గా) ఓహో!

అర్జున్ టవల్లో ఉన్నాడు, ఇక్కడ. చేతిలో గరిటె. పూజ చేసుకుని, నుదుటిమీద బొట్టుతో ఉన్నాడు. డోర్ అవతల ఒక అమ్మాయి english లో తెగ దంచేస్తోంది. సండే మార్నింగ్, full గా makeup అయ్యి ఒచ్చింది. డోర్ మీద ఒక లెవెల్లో బాదుడు మొదలెట్టింది.

ఆ అమ్మాయి: సంతోష్! సంతోష్! (బాదుడు కంటిన్యూ చేసింది.)

ఇంక తప్పదనుకొని అర్జున్, డోర్ కొంచెం తీసాడు.

అర్జున్: He is not home! Come back later! (తలుపేసేయ్యబోయాడు. ఇంతలో ఏదో కీడు శంకించిన ఆ అమ్మాయి, తలుపు ధడాల్మని తోసింది). 

ఎదురుగుండా అర్జున్ గాడు, తన కళ్ళజోడు సరి చేసుకుంటూ, పడిపోబోయి నిలదొక్కుకున్నాడు. ఆ అమ్మాయిని చూడగానే, నాలుగు మెలికలు తిరిగి, రెండో రూం తలుపు చాటున దాక్కున్నాడు. ఆ అమ్మాయి అలా ఉండిపోయింది. ఇక్కడ అర్జున్ కి చెమటలు కారుతున్నాయి. టెన్షన్ గా ఆ అమ్మాయి కేసే చూస్తున్నాడు.

ఇద్దర్లోకి ముందుగా ఆ అమ్మాయి తేరుకుంది. నవ్వు మొదలెట్టింది. కొంచం సేపు నవ్వి, ఇంక నవ్వలేనన్నట్టు, చేతులూ తల ఊపుతూ, అక్కడినించి వెళ్ళిపోయింది.

బొట్టు: ఆ అమ్మాయి మా office కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతె, (ఇంతలో సంతోష్ గాడు వచ్చి)

సంతోష్: కొక్కొరోకో! (లోకమంతా కోడై కూసేదన్నట్టు expression ఇచ్చాడు. ఈ సారి సత్తి బాబుతో సహా అందరూ నవ్వారు).

రాజీవ్: అందుకే, ఏ ముద్దు ముచ్చటా లేకుండా, వాడితో మా శైలజ ఎలా ఉంటుందా అని, బాధ పడుతూ ఉంటాం అంతే!

సంతోష్: సైలజమ్మా! శై...ల...జ...మ్మా! (ఏడుపు కంటిన్యూ చేసాడు).

సత్తి బాబు: తప్పండి, మీ అందర్లోకి చాలా బుద్దిమంతుడు, మంచి వాడు, అతన్ని పట్టుకుని ఇలా!

రాజీవ్: మా బాధ కూడా అదే మాస్టారు! (ఏడుపు మొదలెట్టాడు, ఈ సారి అతనితో అందరూ శృతి కలిపారు).

కొన్ని Software పెళ్ళిళ్ళు, నిలబడవని తనకున్న నమ్మకానికి, కొద్దో గొప్పో experience కి వ్యతిరేకంగా, ఆ రోజు పెళ్లి కొడుకు క్యారెక్టర్ గురించి విన్నాక, సత్తి బాబు తృప్తి గా పెళ్లి భోజనం చేసాడు. అంతే కాకుండా, రాత్రంతా జరిగిన పెళ్లి తంతంతా మంటపం లో కూర్చుని చూస్తూనే ఉన్నాడు, interest తో. ఒక పక్క ఈ కోతిమూక అల్లరి జరుగుతూనే ఉంది.

Next డే, సత్తి బాబు తిరుగు ప్రయాణం. తన చుట్టాల దగ్గర, శైలజ దగ్గర చెప్పేసి, పెళ్ళికొడుకు కి చెప్పి, బయల్దేరాడు. అతనికి చివరి వరకూ send-off  ఇచ్చారు, సంతోష్, రాజీవ్ ఇద్దరూ.

ఆ రోజు సాయంకాలం అప్పగింతలు జరుగుతున్నాయి. (ఆ సీన్ లోకి, సంతోష్, రాజీవ్ ఎలాగో దూరారు).

రాజీవ్: నాన్న చిట్టీ! (ఏడుపు గొంతుతోటి). అర్జున్ గాడి చెయ్యి పట్టేసుకొని, (శైలజ కేసి తిరిగి). అయిదు సంవత్సరాలు, హైదరాబాద్ లో (చెయ్యి వెనక్కి చూపిస్తూ) అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లాడమ్మ! (శైలజ కోపంగా చూసింది. ఈ సారి లెక్క చెయ్యలేదు రాజీవ్).

రాజీవ్: ఆఫీసు కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఆఫీసు కి వెళ్ళడం ఇంటికి రావడం (ఒక చేత్తో అర్జున్ చెయ్యి పట్టుకుని, ఇంకో చేత్తో ముందుకి వెనక్కి చేస్తూ), తప్ప ఇంకో పని చేసి ఎరగడమ్మ. (ఏడుపు పేస్ పెట్టాడు). ఏ పని చెయ్యమంటే ఆ పనే చేస్తాడు గాని, ఇంకో పని చేసి ఎరగడమ్మా...ఆ...ఆ...! (దీర్ఘం తీసారు ఇద్దరూ. ఇంతలో సంతోష్ గాడు).

సంతోష్: అచ్చు రోబోట్ చిట్టి లాగ (ఇద్దరూ, బాధాకరంగా ఏడుస్తున్నారు. ఇంతలో శైలజ అమ్మ గారు, వీళ్ళని కసురుకోవడం తో అక్కడినించి నిష్క్రమించారు, ఇద్దరూను).

నిజానికి ఈ time అంతా అర్జున్ నవ్వుతూనే ఉన్నాడు, అతనికి ఏమి చెయ్యాలో తెలియటంలేదు. వాళ్ళని గదమాయించింది శైలజే. మొత్తానికి, అంతా పూర్తయ్యాక, Honeymoon కి వాళ్ళని సాగనంపడానికి కుటుంబ సభ్యులతో, రాజీవ్ గాడు కూడా Shamshaabad విమానాశ్రయానికి వెళ్లి, send-off ఇవ్వడంతో, ఈ episode పూర్తి అయ్యింది.

(సశేషం)  

మొగుడు -- (కృష్ణ వంశీకి ఏమైంది?!) (1/5)ఏంటిది? అంతఃపురం, danger లాంటి సినిమాలు తీసిన కృష్ణ వంశీ ఈ మధ్య అన్నీ చెత్తగా ఎందుకు తీస్తున్నాడు? అతనికి ఏమైంది? ఇవే ప్రశ్నలు నా మనసులో మెదిలాయి, ఈ సినిమా చూసిన తర్వాత. అస్సలు క్లారిటీ ఏమి లేకుండా, ఒక అతుకుల బొంత storyline తోటి ఎందుకు తీసాడా అనిపించింది.

కధలోకి వెళ్తే, గోపి చంద్ ఒక happy bachelor లాగ ఫస్టు దర్శనమిస్తాడు. పెళ్లి వద్దనే అతను, playboy అనుకుంటాం, కాని మళ్ళీ తనకి తన ఫ్యామిలీ అంటే ఇష్టమని, అందు కోసమే పెళ్ళైతే ఆ అమ్మాయి ఎలా ఫ్యామిలీ లో కలుస్తుందో అని భయమని చెప్తాడు, పర్లేదు ఓకే.

ఆ తర్వాత తాప్సి ని చూసి love లో పడతాడు, ఆ అమ్మాయి తల్లి (రోజా) పెద్ద politician, తండ్రి నరేష్. గోపి చంద్, తన నాన్న రాజేంద్ర ప్రసాద్ తో ప్రేమ విషయం చెప్పాక, వెళ్లి వాళ్ళని అడుగుతాడు, వాళ్ళు కూడా ok చెయ్యడం, పెళ్లి జరిగిపోతుంది.

ఐతే గౌరీ దేవి విగ్రహం రాజేంద్ర ప్రసాద్ అడగడంతో, ఆడ పెళ్లి వాళ్ళు ఇవ్వమనడం తో, పెళ్లి మధ్యలో ఆగిపోతుంది. చివరకి వాళ్ళిద్దరూ ఎలా కలిసారనేది remaining స్టోరీ.

గౌరీ దేవి విగ్రహం తీసుకోవడమనేది తమ కుటుంబ సాంప్రదాయమని రాజేంద్ర ప్రసాద్ సెలవిస్తాడు. తన తండ్రుల బట్టి ఇలాగే జరిగిందని, దాని వల్ల ఎవరికీ ఎటువంటి problem లేదని అంటాడు. అసలు, ఇంటినించి ఆడ పిల్లని పంపేటప్పుడు, లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పోతే, సిరి పోతుందని, అందుకే ఆ అమ్మాయిని గౌరీ దేవిలో పెట్టి, అప్పుడు అమ్మాయిని పంపిస్తామని, ఆడపెళ్ళి వాళ్ళు చాలా strong రీజనే చెప్తారు, నిజమే.

ఇలాంటి గౌరీ దేవి ని పట్టుకెళ్ళే ఆచారాలు, ఎక్కడా లేవన్న సంగతి పక్కన పెడితే, ఇలాంటి వేరే రకం ఆచారాలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ముందే మాట్లాడుకు౦టారనేది, చాలా సింపుల్ పాయింట్. పెద్ద వాళ్లున్నది, ఇలాంటి విషయాలు చెప్పుకోడానికి కూడా కదా. అది జరగకుండా, గౌరీ దేవి విగ్రహం లాస్ట్ మినిట్ లో రాజేంద్ర ప్రసాద్ అడగడం, అది పెద్ద గొడవకి దారి తియ్యడం, నాకు మటుకు హాస్యాస్పదం గా అనిపించింది.

రోజా characterisation కూడా కొంచం సరిగ్గా లేదు. ఆమె మొదట్లో, తనకి వ్యతిరేకం గా protest చేస్తున్న వాళ్ళని పోలీసు కేసు లో ఇరికిస్తుంది. అంతా ok గాని, ఏమి జరుగుతోంది అంటూ వచ్చిన police inspector ని తిడుతుంది. ఒక hard-core manipulative politician గా అప్పుడు కన్పించిన రోజా, తర్వాత మొగుడు చెప్పిన మాట విని, ఒక మామూలు (డబ్బున్న వాడైనా, మంచి వాడైనా సరే) మనిషైన రాజేంద్ర ప్రసాద్ తో వియ్యానికి ఒప్పుకుంటుంది. ఆ ఒక్క సంఘటన మినహా రోజా ఎందులోనూ manipulative గా కనిపించదు. రోజా characterisation సరిగ్గా చెయ్యలేదేమో అనిపిస్తుంది. మిగతా సినిమా అంటా ఒక కోపిష్టి గానో, మొండిపట్టుదల మనిషి గానో మాత్రమె కనిపిస్తుంది కాని, మనుషుల్ని యూస్ చేసి అవతల పారేసే politician దర్శనమివ్వదు.

మిగతా వాళ్ళు ఓకే, గాని సినిమా మొత్తం మీద ఒక నిర్దిష్టమైన storyline లేకుండా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా, "శశిరేఖా పరిణయం" టైపులో, హీరో చివర్లో తన ఫ్యామిలీ వాళ్ళందరినీ తిట్టడం (బావల్తో సహా) ఒకటి, ఎందుకా అనిపించింది. సెకండ్ హాఫ్ మధ్యలో, తన ఫామిలీ వాళ్ళని, "ఆపండి మీ ఓవర్ యాక్టింగ్" అని గోపిచంద్ అనడం, సినిమా లోని డొల్లతనాన్ని బయటపెట్టింది. సినిమా మొత్తం మీద ఇలాంటి dialog ఒకటి ఉంటె చాలనిపిస్తుంది.

మొత్తం మీద, ఒక మొగాడు మొగుడు ఎలా అవుతాడో, ఒక స్త్రీ ఎలా మారుస్తుందో, ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ పెట్టి కృష్ణ వంశీ తీస్తాడనుకుని వెళ్ళిన నాకు చాలా bad experience ఎదురయ్యింది. దీనికన్నా "రోజాని manipulative" గానే అట్టేపెట్టి, పెళ్లిని డ్రామా కింద, చివర్లో ఆపు చేసేసినట్టు చూపిస్తే కొంత twist కి న్యాయం జరిగేదేమో. ఇంకా చెప్పాలంటే, గోపిచంద్ playboy కింద, అతనికి ఇష్టం లేకుండా తాప్సి తోటి పెళ్లైనట్టు, అతన్ని దారికి తేవడానికి తాప్సి try చేసినట్టు, మధ్యలో రోజా అహంకారం అన్నీ పెట్టి ఉంటె, రక్తి కట్టేది. ఏదో ఒక story తీసేసి దానికి మొగుడు, అని పేరు పెట్టేసాడు కృష్ణ వంశీ కూడా, అందరు డైరెక్టర్లు లాగే. అంతఃపురం లాంటి సినిమాలు తీసిన ఒక bright తెలుగు డైరెక్టర్ నించి రావాల్సిన సినిమా కాదిది.

మీరు ఖాళీ గా ఉంటె, వెళ్లి చూడచ్చు, కామెడీ ఓకే, సినిమాలో అవసరం లేదు కాని. మేము కూడా ఒక సారి చూసేసాం కదా. నా అభిప్రాయం తప్పని మీకు అనిపించచ్చేమో కూడా.

ఓ ... మై ఫ్రెండ్ (4.5/5)


ఈ సినిమా చాలా బాగుంది. ఒక delicate సబ్జెక్టు ని తీసుకుని, అంతే delicate గా దాన్ని హేండిల్ చేశారు, ఈ సినిమాలో. సబ్జక్టు ఏమిటంటే, ఒక మగ ఆడ, జీవితాంతం just friends గానే ఉండి పోవచ్చా? ఉంటె (లవర్సు కాదు), దాన్ని అందరూ ఎలా అర్ధం చేసుకుంటారు, etc... etc...

కధ విషయానికి వస్తే, ఇందులో హీరో, హీరొయిన్సు సిద్ధార్థ్, శృతి హాసన్, just friends అంతే. చిన్నప్పటి నించి, school days నించి కూడా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య just friendship యే ఉందని, మనకి వాళ్ళ behavior, characterisation చూస్తె చాలు అర్ధం అవుతుంది. ఎక్కడా అడ్వాన్సు అవ్వడం గాని, ఒకరి గురించి ఇంకొకరు advantage తీసుకోవడం కాని ఉండదు, చాలా సింపుల్ friendship మాత్రమె ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య.

ఇంకో మెయిన్ పాయింటు ఏమిటంటే, వాళ్ళిద్దరూ, ఆడా మగా అని కూడా అనుకోరు. కలిసినప్పుడు, కాళ్ళతో తన్నుకోవడం, శృతి ని ఒక scene లో సిద్ధార్థ్ పైకి ఎత్తి రౌండ్ గా తిప్పడం లాంటివి ఉంటాయి. వీళ్ళిద్దరూ, భుజాల మీద చేతులు వేసుకుని, వెళ్ళిన scenes ఐతే చాలా ఉన్నాయి సినిమా లో. ఐతే, ఎక్కడా రియల్ గా వీళ్ళు శృతి మించరు, అది వేరే విషయం.

ఇలాంటి thick friends మధ్యలో, వాళ్ళ లవర్సు వస్తే పరిస్ధితి ఎలా ఉంటుంది, అనేది సినిమాలో మెయిను కధాంశం. రొటీన్ కధ లాగే, వాళ్ళు వీళ్ళని mis-understand చేసుకోవడం, వీళ్ళు జీవితాంతం కలవమని వాళ్లకి ప్రామిస్ చెయ్యడం, చివరికి వీళ్ళ friendship గుర్తించి వాళ్ళే వీళ్ళని కలపడం (కొంత టైం అయ్యాక), ఇవి మిగిలిన స్టొరీ లోని parts.

స్టొరీ పాతదే అయినా, దాన్ని treat చేసిన విధానం చాలా బాగుంది. ఎక్కడా సగం-సగం గా లేదు, అందరి characterisation అద్భుతం. పైగా, ఇలాంటి సినిమాలు (ఇలాంటి స్టొరీ ఉన్నవి) రావడం rare కాబట్టి, చూడచ్చు. కధలో వీళ్ళే కాకుండా, నవదీప్ (శృతి హాసన్ fiancee), మళ్ళీ హన్సిక (సిద్ధార్థ్ fiancee) ఉన్నారు. వాళ్ళలో, ఒక rich  and open-minded bachelor గా నవదీప్ కనిపిస్తాడు. ఎంత open-minded అయినా, వీళ్ళుఇద్దరినీ అర్ధం చేసుకోలేకపోతాడు.

ఐతే తన ఫీలింగ్స్ ని ముసుగులా తనలోనే ఉంచుకోకుండా, ఎక్కడికక్కడ అతను frank గా చెప్పిన తీరు చాలా బావుంది. At the same time, తనికెళ్ళ భరణి (సిద్ధార్థ్ తండ్రి), సిద్ధార్థ్ ని support చేసినప్పుడు, అతను అడ్డు చెప్పిన తీరు, "మీరు ఇంత చెప్పాకా కూడా ఇలా అనడం బావోదు", అంటూ start చేసి, చాలా నచ్చింది. ఎందుకంటే అతను చెప్పింది 100% కరెక్ట్. తన కొడుకు మంచి వాడని తండ్రిగా నమ్మినట్టుగా, ఒకడు తన భార్య ఫ్రెండ్ (మగాడు) మంచి వాడని నమ్మలేదు, అది చాలా natural.

హన్సిక కి పెద్దగా characterisation అవసరం లేదు, ఎందుకంటే ఆమెది ఒక మామూలు అమ్మాయి రోల్. అందులో తను బాగానే ఉ౦ది, ఆ పార్టు ఓకే.

ఒక practical తండ్రి లాగ తనికెళ్ళ భరణి, బాగా act చేసాడు. మ్యూజిక్ లో గిటారు ఎక్కువగా ఉంది, అది youthful గా ఉంటుందని పెట్టారో, మ్యూజిక్-డైరెక్టర్ కొత్త అవ్వడం వల్లో, లేదంటే సినిమాలో హీరో గిటార్-ప్లేయర్ అనో తెలీదు, మ్యూజిక్ బావుంది కాని. చాలా చోట్ల హీరో వాయించిన గిటారు బిట్స్ బావున్నాయి. ఐతే, సినిమా మ్యూజిక్ లో వెరైటీ చాల important కాబట్టి, ఒక 5-6 సినిమాల తర్వాత, ఇది మారితే ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ కొత్తవాడు, బెస్ట్ అఫ్ లక్ to him.

కెమేరా వర్కు బావుంది, కేరళా లో వీళ్ళ మధ్య clash వచ్చే scenes బాగా తీసారు. కామెడి, need not mention it.

ఇదంతా పాజిటివ్, సినిమా తప్పకుండా చూడచ్చు. ఐతే, ఇలాంటి themes కి వోటు వేసేటప్పుడు, కొంచం జాగ్రత్తగా ఉండాలి. First of all, ఈ సినిమాలో చూపించిన టైపు friendship చాలా తక్కువమందికి ఉంటుంది. ఇలాంటివి ఊహించుకుని, కొంతమంది normal life లో కూడా తాము ఇలాగే అనుకునే problem ఉంది కదా. అదే జరిగితే, వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. పైగా, సినిమాల్లో, ఒకటో రెండో మాంచి సినిమాలు రావడం, వాటిల్తో వచ్చిన ఫీల్తో ఇంకో పది చెత్త సినిమాలు (same అలాంటివి) తీసేయ్యడం, ఒక కొత్త ట్రెండు తెచ్చేయ్యడం మామూలే కదా.


అందుకే, ఈ సినిమా వల్ల వచ్చిన ఫీల్ని అట్టేపెట్టుకోండి, ఎక్కువగా ఇదవ్వద్దు. ఈ సినిమాలో ఇంకో విషయం. చిన్నప్పుట్నించి friends అయినా, teenage వచ్చినాకా కూడా, అలాగే ఉండే వాళ్ళు చాలా తక్కువ. ఇంకో విషయం, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు, పెళ్లి చేసుకుంటున్నప్పుడు, friendship అడ్డు రాకూడదు. అది ఏ friendship అయినా సరే, ఎలాంటిదైనా సరే. సినిమాలో ఇది సరిగ్గానే తీసారు, కాని ఇలాంటివి base చేసుకుని, ఇంకో నాలుగు వెకిలి సినిమాలు రావని గారంటీ లేదు, అందుకే చెప్తున్నా. ఇంకోటి, friend ఎప్పుడు friend లాగానే కనిపించాలి, అంతే గాని ఒక అమ్మాయో, అబ్బాయో కనిపించ కూడదు. ఊరికే బిల్డ్-అప్పులిచ్చి, show చేసి, మళ్ళీ ఈ సినిమాలోలాగా friends మాత్మె అంతే, అదో సుద్ధ అబద్ధం.


మొత్తానికి, చాలా మంచి సినిమా ఇది. చూస్తె చాలా బావుందనిపిస్తుంది. ఇందులో లవ్ పార్టు కూడా, ఏదో teenage లవ్వు కాకుండా, matured పీపుల్ లవ్ చూపించడం, ఇంకోటి చాలా నచ్చింది. ఇద్దరు కపుల్సూ కూడా, చదువు పూర్తి అయ్యాక, జాబ్ లో సెటిల్ అవుతూ ఉండగా, ప్రేమించుకుంటారు. సినిమాలో ఒక matured friendship చూపించేటప్పుడు, దీని విషయం లో compromise అవ్వకుండా, ఇంకా చెప్పాలంటే, దానికి తగ్గట్టుగా లవ్ పెట్టడం అభినందనీయం.

సినిమా మొత్తంలో ఒకే ఒక్క చోట, కొంచం ఎబ్బెట్టు గా అనిపించింది. కేరళాలో, తన తండ్రి తను తెచ్చిన బైకు accept చేసాడని, శృతి హాసన్ ని ఎత్తుకుని పైకి, రౌండు గా తిప్పుతూ ఉంటాడు హీరో. అది చూసి కోప్పడిన నవదీప్ తోసేయ్యడంతో, శృతి కి దెబ్బ తగులుతుంది. తన friend అంతే చాలా ఇష్టపడే సిద్ధార్థ్, ఇక్కడ నవదీప్ ని కొడతాడు. అది కొంచం extra గా అనిపించింది. తనకి ఎంత ఫ్రెండ్ అయినా, తన ఫ్రెండ్ fiancee ని కొట్టకూడదు కదా. అతను కొట్టినా, శృతి హాసన్, తన వుడ్బీ ని సపోర్ట్ చెయ్యకపోవడం, సిద్ధార్థ్ ని తిట్టకపోవడం కొంచెం ఆశ్చర్యం గా అనిపించింది. కావాలంటే, కింద పడిపోవడం వల్ల దెబ్బ తగిలి మాట్లాడలేక పోయింది అనుకోవచ్చు, ఓకే.

"కేవలం ఒక ఆడా మగా అనే వాళ్ళని విడిపోమన్నారు", అని conclude చేశారు సినిమాలో. కాని, పెళ్ళయ్యాక, తన భర్తని, అతని తల్లి చూసుకుంటూ ఉంటె, ఓర్వలేని భార్యలు ఎందఱో ఉన్నారు. మగాళ్ళూ అంతే, పెళ్ళయ్యాక అమ్మాయి అమ్మో నాన్నో జోక్యం చేసుకుంటే, direct గా చెప్పేస్తారు. Love చెయ్యడంలో posessiveness ఎలాగా ఉంటుంది, దాన్ని మనం ఏమి చెయ్యలేము. దానికి "ఓన్లీ మగా, ఆడా కాబట్టే విడిపోయారు", అనడం అంత కంప్లీటుగా కరక్టు కాదు. ఇందులో కూడా, హన్సిక చెప్పిన రీజన్ అదే, "మన మధ్య space ని ఇంకెవరో ఆక్రమించినట్టు ఉంది", అంటుంది, అందులో తప్పు నాకు కనిపించలేదు. నవదీప్ కొంచెం jealous గా react అయ్యాడు కాని. Anyway, watch it, it is a very very good movie.