Saturday, October 27, 2012

అర్జునుడు - X

    అర్జున్ కళ్ళు తెరిచి చూసాడు. నిద్ర నించి అప్పుడే లేచిన తనకి, పక్కనే పడుకున్న శైలజ కనిపించింది. తన కళ్ళల్లో నీళ్ళని తనకి తెలియకుండానే తుడుచుకున్నాడు అర్జున్. అర్జునా! కేక మళ్ళీ వినిపించింది. సందేహం లేదు, రాజ గురువుది, ఆ కేక. ఈ లోపులో ఒక బాణం రివ్వున ఎగసి, తన వెనుక  ఉన్న గోడకి గుచ్చుకుంది. శైలజ దిగ్గున లేచింది.

    కత్తి, డాలు తో, యోధుని get-up  లో బయటికి వచ్చాడు అర్జున్. కోట గోడల దగ్గర, ద్వారం వద్ద ఉన్న సైనికులు బాణాల కి మరణించారు. ఎదురుగా చెక్క మరియు రాతి weapons  తో ఉన్నారు, ఫిలిప్పీన్స్ సైనికులు. పున్నమి చంద్రుని వెలుగులో, ఎత్తైన ఆ కోట నించి  బాణాలని తప్పిస్తూ, కిందకి దిగుతూ వస్తున్నాడు అర్జున్.

    వస్తూనే, తన కత్తి వేటుకి ఇద్దరిని చంపాడు అర్జున్. ఇంకా సైనికులు చాల మంది ఉన్నారు. 

Saturday, October 13, 2012

Telugu To English Translation (అనగా అనువాదము)

    మన వాళ్ళు ఇంగ్లీషు లో మాట్లాడే కొన్ని వాక్యాలకి తీరు తెన్నూ ఉండదు. అలాంటి "మక్కి కి మక్కీ" అనువాదాల గురించే, ఈ పోస్ట్.

1. That much is not there. (అంత లేదు)
2. Write oil on your head. (నీ తల మీద నూనె రాయి).
3. Your head! (నీ తలకాయి)
4. Your face (u)! (నీ మొహం) 
5. What (a)maa? (ఏంటమ్మ?)
6. Cry your own cry (నీ ఏడుపు నువ్వు ఏడు)
7. First First లో (మొట్ట మొదట్లో)
8. You are very white! (నువ్వు చాల తెల్లగా ఉన్నావు, should use 'fair' instead of 'white' here)

డాన్ (కీ) జోక్స్కష్టమే కాదు .... 

ఒక సారి డాన్, ఒక పేరు మోసిన జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. తన ఫ్యూచరు చెప్పమని బలవంతం చెయ్యడం తో, ఆయన డాను తో కూర్చున్నాడు. ఆయన డాను ముఖం చూసాడు, కుడి చెయ్యి చూసాడు, తనకి తెలిసినదంతా యూస్ చేసాడు. కాని డాను ఫ్యూచరు మాత్రం అంతుపట్ట లేదు. అప్పుడు అర్ధమైంది ఆయనకి, "డాన్ ఫ్యూచరు చెప్పడం కష్టమే కాదు, అసాధ్యం" అని.

ఒక సారి డబ్బు అవసరం అయ్యి, డాను కూర్మారావు దగ్గర పది వేలు అప్పు తీసుకున్నాడు. నెల తిరిగాక, కూర్మానికి ఏదో అవసరం అయ్యి, డాను ఇంటికి ఫోను చేసాడు. ఇంట్లో లేడట, ఆఫీసులో ఫోను చేసాడు, లేడన్నారు. ఇలా పాపం ఆరు నెలలు గడిచింది. చివరికి ఏదో పని మీద అటుగా వెళ్తుంటే, డాన్ ఇంట్లో ఉండటం చూసాడు. వెంటనే డాన్ ఇంట్లోకి వెళ్తే, డాను నేల మీద శవమై పడి ఉన్నాడు. అప్పుడు అర్ధమైంది కూర్మానికి "డాన్ చావనైనా చస్తాడు కాని, డబ్బులు మాత్రం వెనక్కి ఇవ్వడని".

ఒక సారి, డాన్ వాళ్ళ ఆవిడకి, కళ్ళ ప్రోబ్లం ఏదో వస్తే, డాక్టరు దగ్గరికి వెళ్లారు. పనిలో పనిగా మీరు కూడా చెక్ అప్ చేయించుకోమ్మంది ఆవిడ. తప్పక ఒప్పుకున్నాడు డాను. ఆవిడ చకింగు అయ్యాక, డాక్టరు డాన్ ని కూర్చోబెట్టాడు. ముందు ఏవో పెద్ద అద్దాలు పెట్టి, చదవమన్నాడు. డాన్ అన్నీ గడగడా చదివేశాడు. Prescription రాస్తూ డాక్టరు ఏదో డవుటు పడ్డాడు. రెండు కళ్ళకీ అంత తేడా ఉండదని చెప్పి, మళ్ళీ ఒక కంట్లో అద్దం మార్చాడు. డాన్ మళ్ళీ అన్నీ గడగడా చదివేశాడు. డాక్టరు డవుటు వచ్చి మళ్ళీ మార్చాడు, ఇలా మారుస్తూనే ఉన్నాడు. అన్నీ డాను గడగడా చదివేశాడు. అప్పుడు అర్ధమైంది డాక్టరు కి "డాన్ కళ్ళ సైటు చెక్ చెయ్యడం, కష్టమే కాదు, అసాధ్యం కూడా అని".

డాన్ వాళ్ళ స్కూల్లో రంజని అని ఒక అమ్మాయి ఉండేది. డాన్ అంటే, ఎందుకో తనకి కొంచెం ఇష్టం ఉండేది. ఒక సారి, డాన్ కి "ఫ్రెండ్ షిప్ చేస్తే చాక్లెట్ ఇస్తా"నంది, డాను ఒప్పుకున్నాడు. చాకలేట్టు తీసుకుని, రెండు రోజుల్లో మొహం చాటేశాడు. తరవాత మళ్ళీ ఇంకో సారి, నాతో ఫ్రెండ్ షిప్పు చేస్తే పరీక్షల్లో చూపిస్తానంది. డాన్ ఒప్పుకున్నాడు, తీరా పరీక్షల్లో (చూసి కాపీ కొట్టినా కూడా) తనకే ఎక్కువ మార్కులు రావడంతో, మళ్ళీ మాట్లాడ లేదు డాన్.

ఇంకో సారి, నాతొ ఫ్రెండ్ షిప్ చేస్తాడేమో అని, ఊరికే వాడి రికార్డ్లు రాయడానికి ఒప్పుకుంది తను. ఇప్పుడూ పని జరగలేదు, అప్పుడు అర్ధమైంది తనకి, "డాన్ తో ఫ్రెండ్షిప్ చెయ్యడం కష్టమే కాదు, అసాధ్య౦ కూడా అని".

చిన్నప్పుడు డాన్ వాళ్ళ నాన్న, రోజూ సైకిలు ఎందుకు తుడవడం లేదని, డాన్ కి ఒక రోజు బడిత పూజ చేసాడు. అప్పటి నించీ డాన్, regular గా సైకిలు తుడవటం మొదలెట్టాడు, డాన్ తండ్రి కూడా పాపం తన కొడుకు బాగు పడుతున్నాడని, సంతోషించాడు. రోజు సైకిలు తుడిచాక, ఒక గంట సేపు TV చూసేవాడు డాను. ఎప్పుడూ జాకి చాన్, సినిమాలే చూస్తున్నా ఏమీ అనేవాడు కాదు తండ్రి. ఆర్నెల్ల తర్వాత, సడన్ గా ఒక రోజు నించీ సైకిలు తుడవడం మానేసాడు డాను. చాలా రోజులు మానేసే సరికి, డాన్ తండ్రి ఒక రోజు మళ్ళీ అడిగాడు, డాను పెడసరం గా సమాధానం చెప్పడం తో, ఈ సారి కర్ర పట్టుకొచ్చాడు తండ్రి. అయితే డాను అద్వితీయమైన కరాటే నైపుణ్యం చూపించి, తండ్రి ని కొట్టకుండా వదిలేసాడు. అప్పుడు అర్ధమైంది తండ్రికి, "డాన్ ఇంకొకరు చెప్పిన మాట వినడం, కష్టమే కాదు, అసాధ్యం అని".

విలేకరి: అసలీ డాన్ ఎవరో, ఎలా ఉంటాడో, పూర్తిగా చెప్తారా?
పోలీసు ఆఫీసరు: డాన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా!
(సశేషం) 

డాను, వాడి డూపు ఒకే చోట ఉన్నారు. ఇద్దర్లో, ఎవరు నిజమో, ఎవరు నకిలీయో చెప్పడం కష్టం గా ఉంది. ఇద్దరూ, నేను డాను కాదంటే కాదని వాదిస్తున్నారు. చివరికి పోలీసు ఆఫీసరు, ఇద్దర్నీ విడిచి పెట్టేయ్యమంది, ఎందుకో తెలుసా... డాన్ ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కాబట్టి. దొరికిన వాళ్ళు ఇద్దరూ డాన్సు కాదని తేల్చేసింది, పోలీసు ఆఫీసరు రంజని. 

వీర తాళ్ళు


అప్పుడెప్పుడో మాయా బజార్లో, కొత్త పదాల అవసరాన్ని మన S.V. రంగా రావు గారు గుర్తు చెయ్యడం కాదు, నేను అనుకునే కొన్ని కొత్త పదాలని (funny గా) ఒక చోట పొందు పరిస్తే ఎలా ఉంటుందని, ఈ పేజీ మొదలు పెట్టాను. అసమదీయులందరికీ, ఇందులో స్వాగతం. 

1. గజీతగాడు: బాగా జీతం సంపాదిస్తున్న వాడు.
2.  సంపన్నులు: కొంచెం అయినా (ఆదాయపు) పన్ను కడుతున్న వాళ్ళు. 
3. ఆస్తికులు: బాగా ఆస్తి ఉన్న వాళ్ళు.

Tuesday, October 9, 2012

Serial Killers - IV

గురూజీ: కుదరదన్నా నా! (కొంచెం కోపం గా)

తెంబి: యాణ్ (తనూ గట్టిగా)

గురూజీ: (ఏవో లెక్కలు వేస్తూ నోట్లో ఆలోచిస్తూ ఉండి, చెయ్యి అడ్డం గా తిప్పాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు).

తెంబి: (ఏదో ఆలోచించి) ఒణ్ మిణిట్! (తన భుజానికున్న గుడ్డ సంచీ లోంచి, ఇవాల్టి న్యూస్ పేపర్ తీసాడు).

అందులో, ఈ రోజు సుడోకు ఉన్న పేజి తిప్పాడు. మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యడం మొదలు పెట్టాడు.     అయిదు నిమిషాల తర్వాత మొత్తం అంతా అయ్యింది. తర్వాత, ఉన్న తొమ్మిది చదరాల్లోను, మధ్య నంబరు circle  చేసాడు. వాటిల్తో ఏదో జ్యోతిష్యం లాగ గణించడం మొదలు పెట్టాడు. కొంత సేపటికి,

తెంబి: నోర్త్, ఇంద సాటైన్, డిల్లి ఇంద సాటైన్ (Saturn, శని). (Explain చేసాడు). జూపిటేయ్ (Jupiter, గురుడు) ఇంద ... (పెన్ను ఉన్న కుడి చెయ్యి పేపరు నించి పైకి లేపి, కుడి వైపు రెండు సార్లు ఊపాడు, ఈస్ట్ కి  వెళ్లాలన్నట్టు).

గురూజీ, కళ్లార్పి తల ఊపాడు.

ఇది చెప్పి తెంబి, నొసలు చిట్లించాడు, తర్వాత కళ్ళజోడు సవరించి, గురూజీ కళ్ళల్లో చూసిన తన కళ్ళు, కిందకి దించాడు. ఇదంతా చూసిన ముత్యాలకి మాత్రం ఏమి అర్ధం కాలేదు.

- 2 -
మొత్తానికి, హీరో సైకిలు మీద హై-వే మీదుగా హైదరాబాద్ నించి డిల్లీ వెళ్ళడం కాన్సిల్ అయ్యింది. అలా ఉత్తరం వైపు  వెళ్తే శని అట. తూర్పుకి వెళ్ళడం, వాస్తు ప్రకారం భేషని, గురూజీ, అండ్ తెంబి ప్రవచించడం జరిగింది. ఆల్రెడీ హీరోయిన్ను కోసమని డిల్లీ కి సైకిలు మీద వెళ్ళడం, ఒక నెల రోజులు లాగించారు, కాబట్టి, ఇప్పుడు కలకత్తా వెళ్ళడానికి మంచి కారణం కావలసి వచ్చింది. హై-వే మీద diversion పెట్టాలని తెంబి చెప్పిన సలహా అందరికీ నచ్చింది. (హై-వే under repair, ప్లీజ్ టర్న్ రైట్) పెట్టిన బోర్డుని, అక్కడ పెట్టారు. పక్కనే ఉన్న మట్టి రోడ్డు, చెట్ల గుబురు మీదకి మంచి diversion ఇచ్చారు.

జరిగిన ఎపిసోడులు already టీవీ లలోకి వెళ్ళిపోయాయి కాబట్టి, రూటు మార్చి, హీరో కలకత్తా వైపు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాల్సి రావడం జరిగింది.

- 3 -
ఇది జరిగిన తర్వాత, గురూజీ తెంబి అంటే ప్రత్యేకమైన ప్రేమ చూపించడం మొదలెట్టారు. "సుడోకు లో జ్యోతిష్యం" అనే ఒక గొప్ప ప్రక్రియని తనకి పరిచయం చెయ్యడం తో, తన సహోద్యోగి తెలివి తేటలపై, అపారమైన నమ్మకం వచ్చింది గురూజీకి. ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా ఆనంద భాష్పాలు వచ్చేవి గురూజీకి.

- 4 -
ఈ వార్త మొత్తం ఇంట్లో స్టాఫ్ అందరికీ తెలిసిపోయింది. ముత్యాలు, ఇంట్లో అందరికీ, పెద్ద గొంతికతో ఈ స్టోరీ చెప్పడం, అందరూ, (టీవీ unit తో సహా) తెంబి ని అభినందించడం జరిగాయి.

సత్తి రెడ్డి: సుడోకు తో జాతక మెట్ల చెప్తార్ర బై ...?  

నాయక్: ఏమో, నాకేం దెల్సు రా బై! (కొంచెం సేపాగి, హాలంతా చూస్తూనే ...) అసలు సుడోకంటే ఏంద్ర? (అసలు డవుటు చెప్పాడు)

సత్తి రెడ్డి: అయినా, పేపర్ల పక్కనే జాతకం ఉంటె, సుడోకు ఎందుకురా పూర్తి చెయ్యుడు?

నాయక్: (చిన్నగా నవ్వుతూ ...) ఏది జాతకమెక్కడ? చూపియ్?

సత్తి రెడ్డి: ఇదిగోరా భై! (సుడోకు పేజీలోనే ఉన్న జాతకం చూపించాడు).

నాయక్: ఇవాళేమి రాసిండో, చెప్పించుకోవాల. లాయరు బాబు ఉన్నడా ఏంది?