Saturday, October 13, 2012

డాన్ (కీ) జోక్స్కష్టమే కాదు .... 

ఒక సారి డాన్, ఒక పేరు మోసిన జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. తన ఫ్యూచరు చెప్పమని బలవంతం చెయ్యడం తో, ఆయన డాను తో కూర్చున్నాడు. ఆయన డాను ముఖం చూసాడు, కుడి చెయ్యి చూసాడు, తనకి తెలిసినదంతా యూస్ చేసాడు. కాని డాను ఫ్యూచరు మాత్రం అంతుపట్ట లేదు. అప్పుడు అర్ధమైంది ఆయనకి, "డాన్ ఫ్యూచరు చెప్పడం కష్టమే కాదు, అసాధ్యం" అని.

ఒక సారి డబ్బు అవసరం అయ్యి, డాను కూర్మారావు దగ్గర పది వేలు అప్పు తీసుకున్నాడు. నెల తిరిగాక, కూర్మానికి ఏదో అవసరం అయ్యి, డాను ఇంటికి ఫోను చేసాడు. ఇంట్లో లేడట, ఆఫీసులో ఫోను చేసాడు, లేడన్నారు. ఇలా పాపం ఆరు నెలలు గడిచింది. చివరికి ఏదో పని మీద అటుగా వెళ్తుంటే, డాన్ ఇంట్లో ఉండటం చూసాడు. వెంటనే డాన్ ఇంట్లోకి వెళ్తే, డాను నేల మీద శవమై పడి ఉన్నాడు. అప్పుడు అర్ధమైంది కూర్మానికి "డాన్ చావనైనా చస్తాడు కాని, డబ్బులు మాత్రం వెనక్కి ఇవ్వడని".

ఒక సారి, డాన్ వాళ్ళ ఆవిడకి, కళ్ళ ప్రోబ్లం ఏదో వస్తే, డాక్టరు దగ్గరికి వెళ్లారు. పనిలో పనిగా మీరు కూడా చెక్ అప్ చేయించుకోమ్మంది ఆవిడ. తప్పక ఒప్పుకున్నాడు డాను. ఆవిడ చకింగు అయ్యాక, డాక్టరు డాన్ ని కూర్చోబెట్టాడు. ముందు ఏవో పెద్ద అద్దాలు పెట్టి, చదవమన్నాడు. డాన్ అన్నీ గడగడా చదివేశాడు. Prescription రాస్తూ డాక్టరు ఏదో డవుటు పడ్డాడు. రెండు కళ్ళకీ అంత తేడా ఉండదని చెప్పి, మళ్ళీ ఒక కంట్లో అద్దం మార్చాడు. డాన్ మళ్ళీ అన్నీ గడగడా చదివేశాడు. డాక్టరు డవుటు వచ్చి మళ్ళీ మార్చాడు, ఇలా మారుస్తూనే ఉన్నాడు. అన్నీ డాను గడగడా చదివేశాడు. అప్పుడు అర్ధమైంది డాక్టరు కి "డాన్ కళ్ళ సైటు చెక్ చెయ్యడం, కష్టమే కాదు, అసాధ్యం కూడా అని".

డాన్ వాళ్ళ స్కూల్లో రంజని అని ఒక అమ్మాయి ఉండేది. డాన్ అంటే, ఎందుకో తనకి కొంచెం ఇష్టం ఉండేది. ఒక సారి, డాన్ కి "ఫ్రెండ్ షిప్ చేస్తే చాక్లెట్ ఇస్తా"నంది, డాను ఒప్పుకున్నాడు. చాకలేట్టు తీసుకుని, రెండు రోజుల్లో మొహం చాటేశాడు. తరవాత మళ్ళీ ఇంకో సారి, నాతో ఫ్రెండ్ షిప్పు చేస్తే పరీక్షల్లో చూపిస్తానంది. డాన్ ఒప్పుకున్నాడు, తీరా పరీక్షల్లో (చూసి కాపీ కొట్టినా కూడా) తనకే ఎక్కువ మార్కులు రావడంతో, మళ్ళీ మాట్లాడ లేదు డాన్.

ఇంకో సారి, నాతొ ఫ్రెండ్ షిప్ చేస్తాడేమో అని, ఊరికే వాడి రికార్డ్లు రాయడానికి ఒప్పుకుంది తను. ఇప్పుడూ పని జరగలేదు, అప్పుడు అర్ధమైంది తనకి, "డాన్ తో ఫ్రెండ్షిప్ చెయ్యడం కష్టమే కాదు, అసాధ్య౦ కూడా అని".

చిన్నప్పుడు డాన్ వాళ్ళ నాన్న, రోజూ సైకిలు ఎందుకు తుడవడం లేదని, డాన్ కి ఒక రోజు బడిత పూజ చేసాడు. అప్పటి నించీ డాన్, regular గా సైకిలు తుడవటం మొదలెట్టాడు, డాన్ తండ్రి కూడా పాపం తన కొడుకు బాగు పడుతున్నాడని, సంతోషించాడు. రోజు సైకిలు తుడిచాక, ఒక గంట సేపు TV చూసేవాడు డాను. ఎప్పుడూ జాకి చాన్, సినిమాలే చూస్తున్నా ఏమీ అనేవాడు కాదు తండ్రి. ఆర్నెల్ల తర్వాత, సడన్ గా ఒక రోజు నించీ సైకిలు తుడవడం మానేసాడు డాను. చాలా రోజులు మానేసే సరికి, డాన్ తండ్రి ఒక రోజు మళ్ళీ అడిగాడు, డాను పెడసరం గా సమాధానం చెప్పడం తో, ఈ సారి కర్ర పట్టుకొచ్చాడు తండ్రి. అయితే డాను అద్వితీయమైన కరాటే నైపుణ్యం చూపించి, తండ్రి ని కొట్టకుండా వదిలేసాడు. అప్పుడు అర్ధమైంది తండ్రికి, "డాన్ ఇంకొకరు చెప్పిన మాట వినడం, కష్టమే కాదు, అసాధ్యం అని".

విలేకరి: అసలీ డాన్ ఎవరో, ఎలా ఉంటాడో, పూర్తిగా చెప్తారా?
పోలీసు ఆఫీసరు: డాన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా!
(సశేషం) 

డాను, వాడి డూపు ఒకే చోట ఉన్నారు. ఇద్దర్లో, ఎవరు నిజమో, ఎవరు నకిలీయో చెప్పడం కష్టం గా ఉంది. ఇద్దరూ, నేను డాను కాదంటే కాదని వాదిస్తున్నారు. చివరికి పోలీసు ఆఫీసరు, ఇద్దర్నీ విడిచి పెట్టేయ్యమంది, ఎందుకో తెలుసా... డాన్ ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కాబట్టి. దొరికిన వాళ్ళు ఇద్దరూ డాన్సు కాదని తేల్చేసింది, పోలీసు ఆఫీసరు రంజని. 

No comments:

Post a Comment